మంచు మనోజ్ వర్సెస్ మంచు మోహన్‌బాబు..మంచు విష్ణుల మధ్యవార్ నడుస్తున్న సంగతి తెలిసిందే..
మీడియాపై మా నాన్న దాడి చేసినందుకు క్షమించండి అని అన్నారు మంచు మనోజ్. బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు..
.ఈ కేసులో ఇరువురు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి మంచు మనోజ్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో జర్నలిస్టులపై మంచు మోహన్ బాబు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. అనంతరం మోహన్ బాబు సైతం అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఆయనను కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. మీడియాపై మోహన్ బాబు దాడిని నిరసిస్తూ జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. ఈ సదర్భంగా జర్నలిస్టుల ఆందోళనలకు మనోజ్ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు తన తండ్రి మోహన్ బాబు..సోదరుడు మంచు విష్ణుల తరఫున క్షమాపణలు చెప్పారు. ఈ సందర్భంగా తండ్రి మోహన్ బాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి మోహన్ బాబు దేవుడు అని…ఇప్పుడు ఉన్న నాన్న మా నాన్న కాదు అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు.
మోహన్‌బాబు, విష్ణులకు బిగ్ షాక్
కలెక్షన్ కింగ్, అగ్రనటుడు మోహన్ బాబుపై తెలంగాణ రాచకొండ పోలీసులు సీరియస్ అయ్యారు. మంగళవారం సాయంత్రం కవరేజ్‌కు వెల్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో మోహన్ బాబు వద్ద ఉన్న గన్‌తో పాటు మంచు విష్ణు వద్ద ఉన్న గన్ను కూడా స్వాధీనం చేసుకోవాలని స్థానిక పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇకపోతే మోహన్ బాబు, మంచు విష్ణులు గతంలో జూబ్లీహిల్స్ నుంచి ఇద్దరూ గన్ లైసెన్స్ పొందారు. అయితే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు గన్లను సరెండర్ చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
మీడియాపై మోహన్ బాబు దాడి..
ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభంగా ఉన్న మీడియా పట్ల అగ్రనటుడు మంచు మోహన్ బాబు దాడికి పాల్పడటం కలకలం రేపింది.మంగళవారం సాయంత్రం జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద మరోసారి హైడ్రామా నెలకొంది. ఇంట్లోకి వచ్చేందుకు మనోజ్-మౌనిక దంపతులు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంది. దీంతో సెక్యూరిటీ సిబ్బందితో మనోజ్ వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ గేటు తీయకపోవడంతో గట్టిగా లోపలికి తోసుకెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బౌన్సర్లను బయటకు పంపించి వేశారు. ఈ క్రమంలో మంచు మనోజ్‌తోపాటు లోపలికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దౌర్జన్యానికి పాల్పడిన సంగతి తెలిసిందే. కాసే పరిస్థితి ముదరడంతో గేట్లు తోసుకొని లోపలికి వెళ్లారు. పోలీసులు రంగప్రవేశం చేసి బౌన్సర్లను బయటకు పంపించివేశారు. ఈ క్రమంలో మనోజ్‌తో లోనికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దౌర్జన్యం చేశారు. ఓ మీడియా చానల్ ప్రతినిధిపై ఏకంగా దాడికి పాల్పడ్డారు.
జర్నలిస్టు సంఘాల నిరసనలు..
ఇదిలా ఉండగా మోహన్ బాబుపై జర్నలిస్టులపై దాడికి పాల్పడటాన్ని జర్నలిస్ట్ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తక్షణమే మీడియాకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాదు మోహన్ బాబు ఇంటి ఎదుట మీడియా ప్రతినిధులు బైటాయించి ఆందోళనలకు దిగారు. మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ మండిపడింది. మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.మరోవైపు వరంగల్ జిల్లా జర్నలిస్ట్ సంఘాలు మోహన్ బాబు దాడికి నిరసనగా ర్యాలీకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
దాడి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
మీడియాపై మోహన్ బాబు దాడిని రాజకీయ నేతలు, పలువురు ప్రముఖులు ఖండిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పందించారు. దాడి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని వెల్లడించారు. అనంతరం జర్నలిస్టుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.
దాడిని ఖండించిన ఎంపీ రఘునందన్ రావు, అద్దంకి దయాకర్..
కవరేజ్‌కు వెళ్లిన మీడియా ప్రతినిధులపై నటుడు మోహన్ బాబు దాడి చేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ దాడిని పార్టీలకు అతీతంగా నాయకులు ఖండిస్తున్నారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌లు ఖండించారు ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదని అభిప్రాయపడ్డారు.
మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలి: అల్లం నారాయణ.
జర్నలిస్ట్‌లపై సినీ నటుడు మంచు మోహన్ బాబు చేసిన దాడిని తెలంగాణ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ ఖండించారు. ఈ దాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వాహణలో ఉన్న జర్నలిస్ట్ పై దాడి చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. మీడియా స్వేచ్చకు ఎవరు భంగం కలిగించినా ఉపేక్షించరాదన్నారు. మోహన్ బాబుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ చర్యలు తీసుకోని పక్షంలో ఉద్యమిస్తాం అని గట్టిగా హెచ్చరించారు.
మా నాన్న, దేవుడు … మా అన్న తరఫున నేను క్షమాపణలు కోరుతున్నా. మంచు మనోజ్…
మీడియాపై మా నాన్న దాడి చేసినందుకు క్షమించండి అని అన్నారు మంచు మనోజ్. బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.
తన భార్య ఏడు నెలల గర్భవతిగా ఉన్న సమయంలో ఎన్నో బాధలు అనుభవించిందని.. ఇప్పుడు కనిపిస్తున్న తన తండ్రి అలా ఉండేవాడు కాదని అన్నారు. “మా నాన్న నాకు దేవుడు.. కానీ ఈరోజు కనిపిస్తున్న మా నాన్న మా నాన్న కాదు. నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. నేను ఎప్పుడూ ఎవరిని ఆస్తులు అడగలేదు. నా వ్యక్తిగత జీవితం గురించి మా నాన్నగారికి అపార్థంగా చెప్పారు. ప్రేమించి పెళ్లి చేసుకోవడంతోనే నా తండ్రితో నాకు విభేదాలు సృష్టించారు. ఈ విషయంలో నా భార్య, ఏడు నెలల కూతురి పేరును లాగుతున్నారు. నేను సొంత కాళ్ల మీద నిలబడటానికి ప్రయత్నిస్తున్నాను. మీడియాపై దాడి చేయడం బాధ కలిగించింది. అందుకు క్షమాపణ చెబుతున్నాను. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి అన్ని నిజాలను బయటపెడతాను” అంటూ తీవ్ర భావోద్వానికి గురయ్యారు మంచు మనోజ్.
ఇదిలా ఉంటే నిన్న రాత్రి హైదరాబాద్ జల్ పల్లిలోని ఇంటి వద్ద టీవీ9 మీడియా ప్రతినిధి రంజిత్ పై మోహన్ బాబు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జర్నలిస్ట్ సంఘాలు మోహన్ బాబు ఇంటి వద్ద ధర్నా చేశారు. ఇందుకు మంచు మనోజ్ సైతం సంఘీభావం ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన కుటుంబంలో జరుగుతున్న పరిణామాలను చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలాంటి రోజు వస్తుందని తాను కలలో కూడా ఊహించలేదంటూ ఎమోషనల్ అయ్యారు.