నేటి పంచాంగం.. నేటి మాట..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🥀పంచాంగం🥀
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 12 – 12 – 2024,
వారం బృహస్పతివాసరే ( గురువారం )

శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం – హేమంత ఋతువు,
మార్గశిర మాసం,
శుక్ల పక్షం,

తిథి : *ద్వాదశి* రా8.26 వరకు,
నక్షత్రం : *అశ్విని* ఉ8.23 వరకు,
యోగం : *పరిఘము* మ2.42 వరకు,
కరణం : *బవ* ఉ9.35 వరకు
తదుపరి *బాలువ* రా8.26 వరకు,

వర్జ్యం : *సా5.20 – 6.50*
దుర్ముహూర్తము : *ఉ10.03 – 10.47*
మరల *మ2.27 – 3.11*
అమృతకాలం : *రా2.18 – 3.48*
రాహుకాలం : *మ1.30 – 3.00*
యమగండం : *ఉ6.00 – 7.30*
సూర్యరాశి : వృశ్చికం,
చంద్రరాశి : మేషం,
సూర్యోదయం : 6.24,
సూర్యాస్తమయం: 5.23,

*_నేటి మాట_*

*భక్తునికి – ఆత్మ విశ్వాసము ఎలా కలుగుతుంది?*
ఈరోజుల్లో ఏ పని చేసినా ఆత్మ విశ్వాసం ముఖ్యం, అది లేకుండా ఏమీ చేయలేము అని చెబుతుంటారు కదా!!…
_అసలు ఆత్మ విశ్వాసము అనగా నేమి???_
జపము, ధ్యానము, యోగము, మననము, పారాయణము ఇలాంటివంతా మనం చేస్తున్నాము.

కానీ, దీనికి పునాది ఐనటువంటి యొక్క త్యాగము, దయ, ప్రేమ, సహనము, సానుభూతి ఇవి లేకుండా ఈ జపములో ఏమి మనము సాధించగలము? ఎన్ని చేసినా ఆత్మవిశ్వాసం లేకుంటే అన్నీ వృధాయే!!…

ఆత్మ విశ్వాసం రావాలంటే, సాధన చెయ్యాలి , సాధనలో మంచి స్థాయికి చేరాలి!!…,

మొట్టమొదట మనం సద్గుణాలను పెంచుకున్నప్పుడే సాధనలో మనకు తగినటువంటి యొక్క స్థాయి కుదురుతుంది.

ఆ సద్గుణములు లేకుండా ఎంతసేపు మనము ధ్యానములో కూర్చున్న చంచలత్వాన్నే అనుభవిస్తాము, కానీ ప్రశాంతిని మనము ఏమాత్రము కూడ పొందలేము.
*”చిత్త శుధ్ధియే కర్మ:”* మనము చేసేటువంటి కర్మల వల్ల మనకు చిత్తశుధ్ధి వస్తుంది,
చిత్త శుధ్ధి వల్లనే ఆత్మ విశ్వాసము కలుగుతుంది,
ఆత్మ విశ్వాసము చేతనే ఆనందమును అనుభవిస్తాము,

_చిత్త శుధ్ధే కలగక ఆత్మ విశ్వాసము ఎలా కలుగుతుంది?_

*_🥀శుభమస్తు🥀_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏