అల్లు అర్జున్ అరెస్టుపై ప్రముఖుల కామెంట్స్..!

ఇంకా జైలు నుండి విడుదల కాని అల్లు అర్జున్..

అల్లు అర్జున్ విడుదల పై కొనసాగుతున్న ఉత్కంఠ

ఈరోజు విడుదల కావడం కష్టమే అంటున్న జైలు అధికారులు

అల్లు అర్జున్ రాత్రంతా జైల్లోనే ఉండే అవకాశం

ఇప్పటివరకూ తమకు అధికారికంగా బెయిల్ ఉత్తర్వులు అందలేదంటున్న జైలు అధికారులు

బెయిల్ ఉత్తర్వుల కాపీలు ఇంకా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ కాలేదంటున్న అధికారులు

అల్లు అర్జున్ తరపున లాయర్లు తెచ్చిన బెయిల్ కాపీ సరిగ్గా లేదంటున్న జైలు అధికారులు

చంచల్ గూడా జైలు ముందు ఆగ్రహంతో ఆందోళన చేస్తున్న అభిమానులు…

అల్లు అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ రెడ్డి అందరికి జవాబు చెప్పాలి – రవి కిషన్..

అల్లు అర్జున్ ఏమైనా టెర్రరిస్టా? ఇంట్లోకి దూరి అరెస్ట్ చేయడం ఏంటి...

రేవంత్ రెడ్డి పర్సనల్ రివెంజ్ కోసం అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసినట్లే ఉంది..

అల్లు అర్జున్ ఏమైనా టెర్రరిస్టా? ఇంట్లోకి దూరి అరెస్ట్ చేయడం ఏంటి..

అల్లు అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ రెడ్డి అందరికి జవాబు చెప్పాలి – రవి కిషన్

అల్లు అర్జున్ తనకు మంచి మిత్రుడు అని చాలా మంచివాడని అన్నారు..
Video Credits – ANI…

నీ సినిమా నువ్వు స్టూడియో లో స్పెషల్ షో వేసుకొ.. సిఎం రేవంత్ రెడ్డి..

ఆల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

అల్లు అర్జున్ సినిమా చూడటానికి వచ్చి సినిమా చూసి వెళ్ళిపొకుండా కార్లో నుండి బైటికి చూస్తూ హంగామా చేశాడు

నీ సినిమా నువ్వు స్టూడియో లో స్పెషల్ షో వేసుకొని చూడొచ్చు కదా

కావాలంటే ఇంట్లో హోమ్ థియేటర్ లో చూడొచ్చు కదా – సీఎం రేవంత్ రెడ్డి…

అరెస్టు సరైన పద్ధతి కాదు : జగన్‌

అల్లు అర్జున్‌ అరెస్టును వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఎక్స్‌ వేదికగా ఖండించారు. సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటనలో అల్లు అర్జున్‌పై నేరుగా కేసులు బనాయించి మరీ అరెస్టు చేయడం ఏమాత్రం సమ్మతం కాదని ఆయన ట్వీట్‌ చేశారు. తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమేనని పేర్కొన్న జగన్‌.. ఆ సమయంలో అల్లు అర్జున్‌ బాధ్యతాయుతంగా వ్యవహరించారని, బాధిత కుటుంబానికి అండగా ఉంటానని అన్నారని చెప్పారు.

అల్లు అర్జున్ అరెస్టు పై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు

అల్లు అర్జున్ అరెస్టు అన్యాయం

ఆక్సిడెంట్‌కు ఒక వ్యక్తిని బాధ్యుడిని చేయడం సరికాదు.. ఈ తరహా కేసులలో ఇరికిస్తే మంచి మేసేజ్ పోదు

నా స్నేహితుడు రేవంత్ రెడ్డికి తెలిసి జరిగిందో, తెలియకుండా జరిగిందో తెలియదు

అర్జు‌న్‌ను విడుదల చేయాలని అప్పీల్ చేస్తున్నా.. ఈ తరహా కేసులు కోర్టులలో నిలబడ్డా దాఖలాలు లేవు

ఒకవేళ రిమాండ్ వేసినా ఈ రోజో, రేపో బెయిల్ వస్తుంది

శుక్రవారం అరెస్టు చేయడం అన్నది జగన్ మోహన్ రెడ్డి మోడస్ ఆపరెండి
పార్టీ .నన్ను కూడా అలానే అరెస్టు చేసారు

ఒకవేళ ఘటనకు బాధ్యులను చేయాల్సి వస్తే బెనిఫిట్ షో కు అనుమతి ఇచ్చిన వాళ్ళను, టికెట్స్ పెంచుతూ అనుమతి ఇచ్చిన వాళ్ళను కూడా అరెస్టు చేయాల్సి ఉంటుంది – ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు…

అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన హరీష్ రావు

అసలు బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు..?
ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు?

సినిమా కోసం వెళ్లి తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం.

దీనికి అసలు కారకులు, రాష్ట్ర పాలకులే.. చర్యలు తీసుకోవలసింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పైనే.

రేవంత్ రెడ్డి బ్రదర్స్ వేధింపుల వల్లే చనిపోతున్నా అని సూసైడ్ లెటర్ రాసి సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య చేసుకుంటే రేవంత్ బ్రదర్స్ ని ఎందుకు అరెస్టులు చేయరు?

రేషన్ కార్డు నిబంధనల వల్లే, రుణమాఫీ కాక ఆత్మహత్య చేసుకుంటున్నా అని సూసైడ్ లెటర్ రాసి మేడ్చల్ వ్యవసాయ కార్యాలయం వద్ద సురేందర్ రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకుంటే కారకుడైన రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయరు?

అరెస్టు చేయాల్సి వస్తే ముందు రేవంత్ రెడ్డి సోదరులను అరెస్టు చేయాలి.

ఏడాది పాలనలో రైతులను బలిగొన్నందుకు ఎవరిని అరెస్టు చేయాలి?

చట్టం అల్లు అర్జున్ విషయంలోనే కాదు ఎనుముల రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ విషయంలోనూ స్పందించాలి. చట్టం ఎవ్వరికీ చుట్టం కాకూడదు – హరీష్ రావు…

అల్లు అర్జున్ అరెస్ట్‌లో చంద్రబాబు హస్తం ఉంది…లక్ష్మి పార్వతి.

చంద్రబాబు నాయుడు పుష్కరాలకు, కందుకూరుకు వెళ్ళినపుడు తొక్కిసలాటలో ఏంతో మంది చనిపోయారు

ఈ లెక్కన చంద్రబాబు నాయుడును పోలీసులు ఎన్ని సార్లు అరెస్ట్ చేయాలి.. మరి చంద్రబాబు నాయుడును ఎందుకు అరెస్ట్ చేయడం లేదు …

అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించిన కేఏ పాల్

చంద్రబాబు నాయుడు కందుకూరు వెళ్ళినపుడు తొక్కిసలాటలో 8 మంది, గుంటూరులో ముగ్గురు, పుష్కరాల్లో 23 మంది చనిపోయారు

మరి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారా? రాజకీయ నాయకులకు ఒక న్యాయం.. నటులకు, సామాన్య ప్రజలకు ఒక న్యాయమా?..

అల్లు అర్జున్ తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ .

అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. చంద్రబాబు… అల్లు అర్జున్ తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు ఫోన్ చేశారు. జరుగుతున్న పరిణామాల పట్ల ఆందోళన వద్దని సూచించారు. అల్లు అర్జున్ అరెస్ట్ తో బాధపడుతున్న అరవింద్ ను చంద్రబాబు పరామర్శించారు. ఆయనకు ధైర్యం చెప్పారు. ఈ కష్ట సమయంలో తమకు ఫోన్ చేసిన ఏపీ ముఖ్యమంత్రికి అల్లు అరవింద్ కృతజ్ఞతలు తెలియజేశారు..

కాంగ్రెస్‌ అసమర్థతను దాచు పెట్టుకోవడానికి అల్లు అర్జున్ అరెస్టు.. కేంద్ర మంత్రి బండి సంజయ్.

జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్‌ను మాత్రం ప్రభుత్వం అరెస్టు చేసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ విమర్శించారు..కాంగ్రె్‌సకు పాలనాదక్షత శూన్యమని, నాటకాలు, డైవర్షన్‌ పాలిటిక్స్‌ అధికమని ఎక్స్‌లో పోస్టు చేశారు. సంచలన ఘటనలు కాంగ్రెస్‌ అసమర్థతను దాచిపెట్టవని, ఆ పార్టీ డ్రామాలను యావత్‌ దేశం గమనిస్తోందని అన్నారు. దుస్తులు మార్చుకునే సమయమివ్వకుండా పడక గది నుంచి అర్జున్‌ను పోలీసులు తీసుకెళ్లడం దుర్మార్గమైన చర్య అన్నారు..

వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకే : లక్ష్మణ్‌

సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఘటనలో ప్రత్యక్ష ప్రమేయం లేకున్నా అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం అమానుషమని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం సినిమా స్ర్కిప్టు రచించిందని ఆరోపించారు. జాతీయ అవార్డు పొందిన నటుడిని అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు..

రేవంత్ రెడ్డి ఫ్లాప్ యాక్టర్,,జర్నలిస్ట్ ఆర్నాబ్‌ గోస్వామి.

రేవంత్ రెడ్డి శుక్రవారం అల్లు అర్జున్ ను అరెస్ట్ జైల్లో పెట్టాలనుకున్నారు.. ఎందుకంటే శని ఆదివారాల్లో కోర్టుకు సెలవు కాబట్టి బేయిల్‌ దక్కే అవకాశం లేదని ఈ వ్యూహం రచించారు సీఎం రేవంత్ రెడ్డి..అయితే ఈ ప్లాన్ లో రేవంత్ రెడ్డి ఫ్లాప్ యాక్టర్ అయ్యారు అల్లు అర్జున్ సూపర్ స్టార్ గా నిలిచారని ఆర్నాబ్‌ గోస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేశారని పేర్కొన్నారు..

ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్టు విషయమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ నేతలు మండిపడుతున్నారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారింది. సినిమా సెలబ్రిటీలు సైతం రేవంత్ రెడ్డి పై మండిపడుతున్నారు… కేవలం ఒకరినే బాధ్యతలను చేయడం సరి కాదని ప్రశ్నిస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ప్రముఖ జర్నలిస్ట్ ఆర్నాబ్‌ గోస్వామి కూడా అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు.. ఆయనకు అండగా నిలిచారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మండిపడ్డారు.. అల్లు అర్జున్ ని అరెస్టు చేయడం ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం అని ఆయన సంచలన కామెంట్స్ చేశారు. అందరి దృష్టిలో సీఎం రేవంత్ రెడ్డి సూపర్ స్టార్ కావాలని చూశారు కానీ ఏదైనా ఫ్లాప్ యాక్టర్ అయ్యారని కానీ అల్లు అర్జున్ మాత్రం సూపర్ స్టార్ గా నిలిచారని అన్నారు. గతంలో తన విషయంలో కూడా అలాగే జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు..

ఇదిలా ఉండగా డిసెంబర్ 5వ తేదీ పుష్ప2 సినిమా రిలీజ్ అయింది. అంతకు ముందు రాత్రి బెనిఫిట్ షో నిర్వహించారు. ఎక్కువమంది సినిమా చూడడానికి రావడం ఆ సమయంలోనే అల్లు అర్జున్, రష్మిక ఇతర కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరటంతో బన్నీని చూడ్డానికి ఎక్కువ మంది ఫ్యాన్స్ వచ్చేసారు. ఆ సమయంలో తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయింది. ఈ కేసు విషయమై నిన్న శుక్రవారం డిసెంబర్ 13వ తేదీ మధ్యాహ్నం అరెస్టు చేశారు. అయితే కోర్టు మద్యంతర ఫైల్ మంజూరు చేసింది కానీ బన్నీ రాత్రంతా జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ముఖ్యంగా హైకోర్టు ఉత్తర్వులు జైలు అధికారికి రావడానికి ఆలస్యమైంది. నేడు బన్నీ జైల్లో నుంచి బయటకు వస్తారు..
పని అరెస్టు విషయంలో సినీ పరిశ్రమ ఏకతాటిపైకి వచ్చింది.. ముఖ్యంగా నేషనల్ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం ఇది బ్లాక్ డే అని ఎంపీ రవి కిషన్ కూడా అన్నారు.. రేసుగుర్రం సినిమాలో ‘మద్దాలి శివారెడ్డి’ పాత్ర పోషించారు.. ఇది దురదృష్టకరమని తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. ఇదంతా కేవలం రేవంత్ రెడ్డి వ్యక్తిగత కక్షలతోనే చేస్తున్నారని దీని పై విచారణ జరపాలని రవి కిషన్ అన్నారు..

పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించిన ఆర్జీవి.

ట్వీట్‌లో తెలంగాణ పోలీసుల(Telangana Police)పై ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యంగా సమాధానం చెప్పాలని నాలుగు ప్రశ్నలు సందించారు. అందులో 1. పుష్కరాలు, ఉత్సవాలు జరిగినప్పుడు తోపులాటలో భక్తులు చనిపోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా?. 2. ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తారా?. 3. ప్రీరిలీజ్ ఫంక్షన్స్‌లో ఎవరైనా చనిపోతే హీరో, హీరోయిన్లను అరెస్ట్ చేస్తారా?. 4. భద్రత ఏర్పాట్లు పోలీసులు ఆర్గనైజర్లు తప్ప ఫిలిం హీరోలు, ప్రజా నాయకులు ఎలా కంట్రోల్ చెయ్యగలరు? అని రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించారు.