వేణు స్వామి చెప్పే జాతకాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. కేవలం సెన్సేషన్ కోసమే కావాలనే ట్రెండింగ్లో ఉండే సెలెబ్రిటీల గురించి జాతకాలు చెబుతుంటాడు. అలా యూట్యూబ్లో, సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతుంటాడు. తాజాగా వేణు స్వామి అల్లు అర్జున్ గురించి చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. జైలుకెళ్లిన వారంతా సీఎంలు అవుతున్నారు కదా.. బన్నీ కూడా త్వరలోనే సీఎం అయ్యే ఛాన్స్ఉందని అన్నాడు. పార్టీ పెడతాడా? అని అడిగితే.. కచ్చితంగా పెడతాడు అని జోష్యం చెబుతున్నాడు..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు అంటూ బాంబ్ పేల్చారు వేణు స్వామి. కొత్త పార్టీ పెడతాడని వేణు స్వామి చెప్పిన ఓ వీడియో వైరల్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో తన జాతకాలతో అతి తక్కువ కాలంలో చాలా ఫేమస్ అయ్యారు వేణు స్వామి….ఇతరుల జాతకాలు చెప్పడంలో బిజీగా ఈయన పండితుడు.. తన జాతకం చూసుకోవడం మర్చిపోయినట్టున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
venu swamy comments on venu swamy
నాగ చైతన్య, శోభితా ధూళిపాళ పెళ్లి తర్వాత విడిపోతారు అని వేణు స్వామి కామెంట్స్ చేయడం పెద్ద వివాదానికి దారి తీసింది. అయితే.. ఆ తర్వాత పెద్దగా బయట కనబడని వేణు స్వామి.. తాజాగా అల్లు అర్జున్ జాతకం చెప్పారు. త్వరలోనే అల్లు అర్జున్ సీఎం అవుతాడు అంటూ బాంబ్ పేల్చారు వేణు స్వామి. జైలుకు వెళ్లిన వాళ్లంతా సీఎం లు అయ్యారు కాబట్టి… త్వరలోనే అల్లు అర్జున్ సీఎం అవుతాడు అన్నారు. ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు వేణు స్వామి..