*కాంగ్రెస్ నిర్బంధ, నియంత పాలన*
*ప్రజా వ్యతిరేక పాలనను అంతమొందిస్తాం..*
*లగచర్ల గిరిజన రైతుల నిర్బంధానికి వ్యతిరేకంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించిన బీఆర్ఎస్ శ్రేణులు…*
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ హుజుర్ నగర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు డా.బీ .ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి, నిరసన వ్యక్తం చేయడం జరిగింది.
మాజీ జెడ్పిటిసిలు కొప్పుల సైదిరెడ్డి,, జగన్ నాయక్ మాట్లాడుతూ………
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించడం జరిగిందని.. …..
లగచర్ల రైతులపై అక్రమ కేసులు పెడుతూ, రైతులకు బేడీలు వేసిన ఘటనను నిరసిస్తూ కేటీఆర్ ఇచ్చిన పిలుపుకు నియోజకవర్గ వ్యాప్తంగా బిఆర్ఎస్ శ్రేణులు స్పందించడం జరుగుతుందని అన్నారు..హుజూర్నగర్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, వినతి పత్రాన్ని అందించడం జరిగిందని అన్నారు..
కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలని అవలంబిస్తుందని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన రోజు నుండి అన్ని వర్గాల ప్రజలు తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు…కాంగ్రెస్ పార్టీకి గిరిజనులు అంటే వ్యతిరేకత బాబు ఉందని కనీసం మంత్రివర్గంలో ఒక్కరికి కూడా స్థానం ఇవ్వలేదని.. గిరిజనులపై కక్షగట్టి లగచర్లలో రైతులకు బేడీలు వేసి జైలుకు తరలించడం పై బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని.. రానున్న రోజుల్లో గిరిజనులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.…అలివి గాని హామీలతో మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పరిపాలన అందిస్తుంది, అన్ని వర్గాల ప్రజలను నిండా ముంచింది. అని అన్నారు. లగచర్ల గిరిజన, దళిత రైతుల పై అక్రమంగా కేసులు పెట్టి, రైతన్నలకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తున్నామని తెలిపారు. హిరియానాయక్ అనే రైతుని గుండెపోటు వచ్చినా కూడా బేడీలు వేసి హాస్పిటల్ కి తీసుకెళ్లడం దారుణం అని అన్నారు. రైతన్నల పై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
*ఈ కార్య్రమంలో..మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కులనాగేశ్వరరావు,బీఆర్ఎస్ హుజూర్నగర్ పట్టణ ప్రధాన కార్యదర్శి అమర్ గౌడ్, మాజీ డిసిసిబి డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి,డిసిసిబి డైరెక్టర్ కొమ్ము కరుణ సైదులు, హుజూర్నగర్ మండల ప్రధాన కార్యదర్శి అబ్దుల్ నబీ, మఠంపల్లి మండల పార్టీ అధ్యక్షుడు ఇరుగు పిచ్చయ్య, మాజీ జడ్పిటిసి జగన్ నాయక్, మేళ్లచెరువు మండల నాయకులు బచ్చు శ్రీనివాస్ రెడ్డి,నాయకులు భాస్కర్ రెడ్డి, నగేష్ రాథోడ్ ,మట్టపల్లి మాజీ సర్పంచ్ వెంకటరమణ, బీఆర్ఎస్ నాయకులు ములకలపల్లి రాంబాబు, అంజి యాదవ్,చంద్రమౌళి, పరశురాం, జయరాం, చుక్కయ్య , రామిశెట్టి రాము, పల్లె సంతోష్, తోట బిక్షం,బచ్చలకూరి నాగశేఖర్,అబిమళ్ళ నాగరాజు, కిట్టు, లక్క వెంకన్న, కోల శీను,గురువయ్య, రవీందర్,లక్ష్మి, రామకృష్ణ, సాయి ,నాగరాజు, మైసయ్య, బాల సైదా, సత్యనారాయణ, నరసింహారావు, వసంత్ నాగరాజు, రాము,చంద్రగిరి, కామిశెట్టి వెంకటేశ్వర్లు, పిచ్చిరెడ్డి, మహిళా విభాగం రత్నశ్రీ, మరియు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.