లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్..

*సెలవుల క్యాలండర్ ప్రకటింన తెలంగాణ సర్కారు!*
_తెలంగాణ సమయం ప్రతినిధి_
_హైదరాబాద్, డిసెంబర్ 28_
* 2025 ఏడాదికి గాను ప్రభుత్వం సెలవులను ఖరారు చేసింది.
* 27 సాధారణ, 23 ఐచ్ఛిక సెలవులు
* ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం
* 27 సాధారణ, 23 ఐచ్ఛిక సెలవులు కలిపి మొత్తం [50] సెలవులు ఉన్నాయి.
* ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.
*2025 సాధారణ సెలవులు*
* సంక్రాంతికి రెండు రోజులు
* రంజాన్‌కు రెండు రోజులు
* విజయదశమికి రెండు రోజులు
* క్రిస్మస్‌ రెండు రోజులు
* మిగతా అన్ని ప్రముఖ పండుగలకు ఒక రోజు సెలవు..

భారత్ దెబ్బకు తలలు పట్టుకుంటున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్…

అంతర్జాతీయంగా భారత్ దౌత్య విధానాలతో ప్రపంచం యావత్తు ఇండియా వెనకే ఉంటుంది. అదే విధంగా శత్రుదేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ లు భారత్ వ్యూహాలతో వణుకుతున్నాయి..జమ్ము-కశ్మీర్ లో ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజంలో గగ్గోలు పెట్టింది. కానీ పాకిస్తాన్ రోధనను ఎవ్వరూ పట్టించుకోలేదు. చైనాను చేతిలో పెట్టుకొని భారత్ ను ముప్పు తిప్పలు పెట్టించవచ్చని అనుకున్న పాక్ కు చైనా కూడా ఇండియా వైపునకు మళ్లడంతో ఏం చేయాలో తెలియక తల పట్టుకుంది. చైనా, అమెరికాను చూస్తూ మురిసిపోయిన పాకిస్తాన్ రెండు దేశాల నుంచి ఎదురు దెబ్బలు తప్పలేదు. చైనా భారత్ మాకు మిత్ర దేశం అని చెప్పగా.. రీసెంట్ గా అమెరికా పాకిస్తాన్ పై సాంక్షన్స్ విధించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పాక్ మెడపై మరో కత్తి వేలాడుతుంది. అంతర్జాతీయంగా పాకిస్తాన్ కు ఏ దేశం కూడా ఆర్థిక సాయం చేయడం లేదు. దీంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్ విలవిలలాడుతోంది. ఇప్పుడు చైనా కూడా తమ అప్పును తీర్చాలంటూ ఒత్తిడి చేస్తుండడంతో మరింత సంకటంలో పడిపోయింది. ఇక బంగ్లాదేశ్ గురించి చెప్పుకుంటే అమెరికా పన్నిన వలలో పడింది. షేక్ హసీనా పాలనలో సుభిక్షంగా ఉన్న దేశం ఒక్కసారిగా సంక్షోభంలో పడింది. యూనస్ ప్రభుత్వం సంక్షోభాన్ని పట్టించుకోకుండా.. భారత్ పై విరోదం పెంచుకుంటూ మరింత దిగజారింది.

బంగ్లాదేశ్ కు ఆహార దినుసుల నుంచి విద్యుత్ వరకు భారతే అన్నీ సమకూరుస్తుంది. కరోనా సమయంలో సైతం ఉచిత టీకాలను భారతే పంపించి ఆదుకుంది. ఇంకా బట్టల నుంచి తినే ప్రతీ ఆహార దినుసు భారతదేశమే ఎగుమతి చేస్తోంది. కానీ బంగ్లా మాత్రం వాపు చూసుకొని బలుపుగా మురిసిపోతుంది. ఇప్పటికే హిందువులపై దాడులు పెరిగాయి. అక్కడి హిందువులు వాటిని తీవ్రంగా ఎదురిస్తున్నారు.

అంతర్జాతీయ సమాజం కూడా బంగ్లాదేశంలో దాడులపై మండిపడుతుంది. ఇలానే కొనసాగితే అంతర్జాతీయంగా బహిష్కరిస్తామని ఐక్యరాజ్య సమితి కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. అయితే ఇప్పటికీ భారత్ అంటే కొంచెం భయంగానే ఉంది బంగ్లాదేశ్. కానీ సరిహద్దులో మాత్రం ఇబ్బంది పెడుతుంది. భారత్ కూడా పిచుకపై బ్రహ్మాస్త్రం లాగా చూస్తూ సైలెన్స్ గా ఉంటోంది..ఇటీవల భారత్ పెద్ద ఎత్తు వేసింది. ఎంతలా అంటే పాక్ ఐఎస్ఐ వద్ద కూడా దీనికి జవాబు లేనంతగా.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు మాదిరి.. ఒక్క చర్యతో రెండు దేశాలకు చెక్ పెట్టింది. ఆఫ్ఘనిస్తాన్ కు పాకిస్తాన్ కు మొదటి నుంచి వైరం ఉంది. ఇటీవల కొన్ని దాడులు పెరగడంతో ఎల్ఓసీ వద్ద ఉన్న పాక్ జవాన్లు, ఆర్టిలరీ గన్స్, ఆప్ఘనిస్తాన్ వైపునకు తరలించింది పాక్. ఇక ఎల్ఏసీ వద్ద చైనాతో గొడవలు సద్దుమణగడంతో అక్కడి నుంచి భారత సైన్యాన్ని ఎల్ఓసీ వైపునకు భారత్ తరలించింది. ఇక మయన్మార్ రెబల్స్ బంగ్లాదేశ్ కు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో బంగ్లాదేశ్ సైలెంట్ అయిపోయింది. ఇలా ఒక్క దెబ్బకు భారత్ రెండు దేశాలకు చెక్ పెట్టింది..

నితీష్ కుమార్ రెడ్డికి సునీల్ గవాస్కర్ వార్నింగ్..

స్కాట్ బొలాండ్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. నితీష్ రెడ్డి సెంచరీ పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ యువ బ్యాటర్ ఆటతీరును మెచ్చుకున్నాడు.

టెస్టుల్లో అతడికి ఇదే తొలి సెంచరీ. సమీప భవిష్యత్తులో అతడు మరిన్ని శతకాలు సాధించనున్నాడు. భవిష్యత్తులో అతడి మరిన్ని అద్భుత ఇన్నింగ్స్ ఆడతాడని భావిస్తున్నాను. అతడు భవిష్యత్తు భారత స్టార్ క్రికెటర్ అని గవాస్కర్ అన్నారు. అదే సమయంలో ఓ హెచ్చరిక సైతం చేశాడు…అతడు తన తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు చేసిన త్యాగాలను గుర్తుంచుకోవాలన్నాడు. భారత క్రికెట్ కారణంగానే నితీష్ ఇక్కడకు వచ్చారని, ఈ సెంచరీతో గర్వం తలకెక్కకూడదన్నారు. నిజాయతీగా ఉంటూ క్రమశిక్షణ పాటిస్తే అతడికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నాడు…ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. నితీష్ కుమార్ రెడ్డి (105), మహ్మద్ సిరాజ్ (2) క్రీజులో ఉన్నారు. భారత్ ఇంకా 116 వెనుకబడి ఉంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే…

తెలంగాణలో మందుబాబులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ .

తెలంగాణలో మందుబాబులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్న తెలంగాణలో మద్యం షాపుల్ని అర్ధరాత్రి వరకూ తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 31న నిర్వహించే కొత్త సంవత్సల వేడుకల సందర్భంగా మద్యం అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మద్యం షాపులతో పాటు బార్లు, రెస్టారెంట్లు కూడా అర్ధరాత్రి వరకూ తెరిచి ఉంచనున్నారు.తెలంగాణలో కొత్త సంవత్సర వేడుకల్ని ధూంధాంగా జరుపుకునేందుకు మందుబాబులు సిద్దమవుతున్నారు. వీరికి ఎక్సైజ్ శాఖ శుభవార్త అందించింది. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకూ మద్యం షాపుల్ని తెరిచే ఉంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బార్లు, రెస్టారెంట్లు రాత్రి ఒంటిగంట దాకా వ్యాపారం చేసుకోవచ్చని తెలిపింది. ఈమేరకు ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది..

అంతా తూచ్.. సిఫార్సు లేఖలపై టీటీడీ..!.

తెలంగాణ రాజకీయ నాయకుల సిఫారసు లేఖల స్వీకరణపై టీటీడీ ఈవో శ్వామల రావు క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలు స్వీకరిస్తున్నట్లు జరుగుతోన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.

డ్యూరాండ్ లైన్‌పై తాలిబాన్ల దాడి..!

ఆఫ్ఘనిస్థాన్‌లో పాకిస్థాన్ వైమానిక దాడులకు తాలిబాన్ ప్రతీకారం తీర్చుకుంది..

ఆఫ్ఘనిస్థాన్‌లో పాకిస్థాన్ వైమానిక దాడులకు తాలిబాన్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ – ఆఫ్ఘనిస్తాన్‌లను వేరు చేసే డ్యూరాండ్ రేఖకు ఆవల అనేక కేంద్రాలపై దాడులు జరిగినట్లు ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ జిల్ పేర్కొంది…

ఆఫ్ఘనిస్థాన్‌లో పాకిస్థాన్ వైమానిక దాడులకు తాలిబాన్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ – ఆఫ్ఘనిస్తాన్‌లను వేరు చేసే డ్యూరాండ్ రేఖకు ఆవల అనేక కేంద్రాలపై దాడులు జరిగినట్లు ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ జిల్ పేర్కొంది.
అయితే డ్యూరాండ్ లైన్ విషయంలో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య వివాదం నడుస్తోంది. డ్యూరాండ్ రేఖను తన సరిహద్దుగా ఆఫ్ఘనిస్తాన్ ఇంకా అంగీకరించలేదు. అందువల్ల పాకిస్థాన్‌లో దాడి జరిగిందని ఆఫ్ఘనిస్థాన్ నేరుగా చెప్పడం లేదు. డ్యూరాండ్ రేఖకు ఆవల ఉన్న అనేక ప్రాంతాలపై దాడులు జరిగినట్లు ఆఫ్ఘనిస్తాన్ పేర్కొంది.

ఆఫ్ఘనిస్థాన్‌లోని ఉగ్రవాద కేంద్రాలపై పాక్ జరిపిన వైమానిక దాడుల్లో 46 మంది చనిపోయారు. ప్రతీకారంగా, తాలిబాన్ దళాలు పాకిస్తాన్‌లోని “అనేక పాయింట్లను” లక్ష్యంగా చేసుకున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మంగళవారం నాడు పాకిస్థాన్‌తో సరిహద్దులో ఉన్న పాక్టికా ప్రావిన్స్‌లోని పర్వత ప్రాంతంలో పాకిస్థాన్ దాడి జరిగింది. ఆఫ్ఘనిస్థాన్‌లోని ఏడు గ్రామాలను పాకిస్థాన్ లక్ష్యంగా చేసుకుని దాడి చేసిందని, ఈ దాడిలో ముర్గ్ బజార్ గ్రామం పూర్తిగా ధ్వంసమైందని ఆఫ్ఘనిస్తాన్ తెలిపింది. ఈ వైమానిక దాడిని రక్షణ మంత్రిత్వ శాఖ పిరికిపందంగా అభివర్ణించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో పాకిస్తాన్ రాయబారి మహ్మద్ సాదిక్ కాబూల్‌లో తాలిబాన్ నాయకత్వంతో సమావేశమైన కొన్ని గంటల తర్వాత ఈ దాడి జరిగింది. మహ్మద్ సాదిక్ ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక అంతర్గత మంత్రి సిరాజుద్దీన్ హక్కానీని కూడా కలిశారు…

బిజేపిలోకి తెలంగాణా స్టార్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్.

తేలంగాణలో బలపడుతున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ప్రముఖ వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానించే ప్లాన్ చేస్తుంది. సినీ అలాగే క్రీడా ప్రముఖులకు తమ పార్టీలో ప్రాధాన్యత ఇచ్చే దిశగా నిర్ణయాలు తీసుకుంటుంది…ఇక పార్టీలో ఉన్న అగ్ర నేతలకు కూడా తెలంగాణలో పెద్దపేట వేసేందుకు బిజెపి అధిష్టానం సిద్ధమైంది. ఇప్పటికే బీజేపీ కీలక నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని జాతీయ అధ్యక్షుడిగా నియమించేందుకు అమిత్ షా సిద్ధమయ్యారు. ఇక త్వరలోనే తెలంగాణలో ఆ పార్టీలో కీలక చేరికలు ఉండే అవకాశం ఉంది.

మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ ను బిజెపిలోకి ఆహ్వానిస్తున్నారు హోం మంత్రి అమిత్ షా. 2020లోనే ఆయనను బిజెపిలోకి తీసుకోవాలని భావించిన కొన్ని కారణాలతో వివిఎస్ లక్ష్మణ్ రాలేదు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగా ఉండటంతో ఆయనకు అవకాశం కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి ఆయనకు ఎంపీ సీటు ఇవ్వటానికి కూడా బిజెపి అధిష్టానం సిద్ధమైంది. ఉత్తరాది రాష్ట్రాల్లో క్రమంగా ఇబ్బంది పడుతున్న బిజెపి దక్షిణాది రాష్ట్రాల్లో బాగా వేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంటుంది.

ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి ఇబ్బందులు లేకపోవడంతో తెలంగాణలో ఆ పార్టీ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటుంది. కర్ణాటకలో కూడా క్రమంగా బిజెపి బలహీనపడటం ఆ పార్టీకి మింగుడు పడటం లేదు. ఈ తరుణంలో ప్రజాదరణ ఉన్నవాళ్లను అలాగే ప్రముఖ వ్యక్తులను పార్టీలోకి తీసుకుంటే కచ్చితంగా కలిసి వస్తుందని బిజెపి అంచనా వేస్తోంది. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రముఖ సినీనటులను బిజెపిలోకి తీసుకుని వాళ్లకు మంచి ప్రాధాన్యత కల్పించారు. వీవీఎస్ లక్ష్మణ్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది.

కర్ణాటకలో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. క్రికెట్లో సుదీర్ఘకాలం పాటు రాణించిన లక్ష్మణ్ రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. కానీ వాటిని ఇప్పటివరకు ఎక్కడా కూడా లక్ష్మణ్ ఖండించలేదు ధ్రువీకరించలేదు. అయితే బిజెపి అధిష్టానంతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో పార్టీలోకి తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కు బిజెపి మంచి ప్రాధాన్య ఇచ్చింది. ఆయనకు ఢిల్లీ నుంచి ఎంపీ సీట్ కూడా ఇచ్చారు. 2019 ఎన్నికల్లో బిజెపి ఎంపీగా గౌతమ్ గంభీర్ విజయం సాధించాడు. అటు కర్ణాటకలో కూడా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లేపై బిజెపి ఫోకస్ పెట్టింది ఆయనను పార్టీలోకి తీసుకుని కీలక పదవి ఇవ్వాలని బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్లాన్ చేసిన కుంబ్లే మాత్రం అందుకు అంగీకారం తెలపలేదు..

సిరాజ్ డాట్ బాల్.. దద్దరిల్లిన స్టేడియం.. మియా మ్యాజిక్ అంటే ఇది..

టిమిండియా స్టార్ పేసర్, తెలంగాణ డీఎస్పీ మహమ్మద్ సిరాజ్‌కు పేస్ ఆల్‌రౌండర్, మెల్‌బోర్న్ సెంచరీ హీరో నితీష్ కుమార్ రెడ్డి ధన్యవాదాలు తెలిపాడు. సెంచరీకి అండగా నిలిచిందుకు ఇన్‌స్టా వేదికగా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు…ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో నితీష్ కుమార్ రెడ్డి అసాధారణ బ్యాటింగ్‌తో అరంగేట్ర శతకాన్ని అందుకున్నాడు. మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన నితీష్ కుమార్ రెడ్డి సంచలన బ్యాటింగ్‌తో టీమిండియాను గట్టెక్కించడమే కాకుండా శతకాన్ని సాధించాడు.

రిషభ్ పంత్ ఔటైన అనంతరం క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి.. జడేజా వెనుదిరిగినా వాషింగ్టన్ సుందర్‌తో కలిసి 8వ వికెట్ 127 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించాడు. హాఫ్ సెంచరీతో నితీష్‌కు అండగా నిలిచిన సుందర్‌ను నాథన్ లయన్.. అనూహ్య బౌన్స్‌తో స్లిప్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు.

సుందర్ ఔటయ్యే సమయానికి నితీష్ 96 పరుగులతో క్రీజులో ఉన్నాడు. బుమ్రా బ్యాటింగ్‌కు రాగా నితీష్ మరో మూడు పరుగులు చేసి 99వ నిలిచాడు. స్ట్రైకింగ్ తీసుకున్న బుమ్రా.. కమిన్స్ బౌలింగ్‌లో మూడు బంతులాడి వెనుదిరిగాడు. దాంతో నితీష్ కుమార్ రెడ్డి శతకంపై ఉత్కంఠ నెలకొంది.

కానీ ఆఖరి వికెట్‌గా బ్యాటింగ్‌కు వచ్చిన సిరాజ్.. కమిన్స్ వేసిన మూడు బంతులను అద్భుతంగా డిఫెన్స్ చేసి నితీష్‌ కుమార్ రెడ్డికి స్ట్రైక్ ఇచ్చాడు. బుమ్రా బ్యాటింగ్ సమయంలో నితీష్ తండ్రి ముత్యాల రెడ్డి తీవ్రంగా టెన్షన్ పడ్డారు. పదే పదే ఆ దేవుడిని ప్రార్థించాడు.

స్కాట్ బోలాండ్ వేసిన మరుసటి ఓవర్‌లో నితీష్ రెండు బంతులు డిఫెన్స్ చేయడంతో ఉత్కంఠ తారా స్థాయికి చేరింది. మూడో బంతిని లాంగాన్ దిశగా బౌండరీ తరలించిన నితీష్.. సెంచరీ మార్క్ అందుకొని గర్జించాడు. సిరాజ్ సహకారం అందించకపోయి ఉంటే నితీష్ 99 పరుగుల వద్దే అజేయంగా నిలిచిపోయేవాడు. ఈ క్రమంలోనే సెంచరీ అనంతరం అతన్ని హగ్ చేసుకున్న ఫొటోను నితీష్ ఇన్‌స్టా వేదికగా పంచుకున్నాడు. ‘నిన్ను నమ్మాను సిరాజ్ భాయ్’అనే క్యాప్షన్‌తో థ్యాంక్స్ చెప్పాడు.

ఈ పోస్ట్‌కు సిరాజ్ కూడా స్పందించాడు. ‘చాలా సంతోషంగా ఉంది. ఈ సెంచరీకి నువ్వు అర్హుడవి. అభినందనలు’అని బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌లు నెట్టింట వైరల్‌గా మారాయి..

తండ్రిగా ఎంతో గర్వపడుతున్నా.. థాంక్యూ బింకు: కేటీఆర్‌ భావోద్వేగ ట్వీట్.!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తన కుమారుడు హిమాన్షు రికార్డ్ చేసిన ప్రత్యేక వీడియోను సోషల్ మీడియా వేదికైన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు….జూలైలో కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా హిమాన్షు తన తండ్రి కోసం రికార్డ్ చేసిన ఓ వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

తండ్రిపై హిమాన్షు ప్రత్యేక ప్రేమ..
“నా సూర్యుడివి.. నా చంద్రుడివి.. నా దేవుడివి నువ్వే, నాన్నా..” అంటూ హిమాన్షు తన గాత్రంలో తండ్రిపై ఉన్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు. అయితే, అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఆ వీడియోను విడుదల చేయడం సరికాదని భావించిన హిమాన్షు, దానిని నిలిపివేశారని కేటీఆర్ ట్వీట్ ద్వారా వెల్లడించారు.
ఈ వీడియో గురించి తనకు వారం క్రితమే తెలిసిందని, హిమాన్షు సాహిత్యం, గానం అద్భుతంగా ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. “ఈ కష్టతరమైన సంవత్సరంలో ఇది నాకు ఉత్తమ బహుమతి. తండ్రిగా ఎంతో గర్వపడుతున్నాను,” అని భావోద్వేగంతో ట్వీట్ చేశారు.

పాటపై ప్రశంసలు..

హిమాన్షు స్వరాన్ని (Vocals) ప్రశంసించిన కేటీఆర్, అతని ప్రతిభ తనను విశేషంగా ఆకట్టుకుందని పేర్కొన్నారు. “నా పుట్టినరోజు కోసం హిమాన్షు ఎంతో శ్రమ పెట్టి ఈ పాటను రూపొందించాడు. ఇది నా జీవితంలో మరపురాని బహుమతి,” అని కేటీఆర్ తన ఆనందాన్ని పంచుకున్నారు. హిమాన్షు పాడిన ఈ పాట, తండ్రిపై కుమారుడి ప్రేమను ప్రతిబింబించడమే కాకుండా, కేటీఆర్‌కు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే గుర్తుగా మారింది..

విమాన ప్రమాదం.. పుతిన్‌ క్షమాపణలు.!

అజర్‌ బైజాన్‌ ఎయిర్‌లైన్స్‌ (Azerbaijan Airlines)కు చెందిన జె2-8243 విమానం కూలిపోవడంతో 38 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే…ఈ ఘటనపై రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) తాజాగా స్పందించారు. ఈ ప్రమాదం జరగడంపై విచారం వ్యక్తం చేసిన ఆయన.. అజర్‌బైజాన్‌ దేశాధినేతను క్షమాపణలు కోరారు.

విమానం అజర్‌ బైజాన్‌లోని బాకు నగరం నుంచి రష్యాలోని చెచెన్‌ ప్రాంతానికి చెందిన గ్రోజ్నికి ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకొంది. కజఖ్‌స్థాన్‌లో ల్యాండింగ్‌ సమయంలో విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 38 మంది మృతి చెందగా.. 29 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన రోజున ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులను ఎదుర్కొనేందుకు గ్రోజ్ని సమీపంలో రష్యా గగనతల రక్షణ వ్యవస్థ క్షిపణులను ప్రయోగిస్తోందని క్రెమ్లిన్‌ పేర్కొంది.

ఆ క్షిపణుల్లో ఒకటి విమానాన్ని తాకినట్లు సరిగ్గా స్పష్టం చేయలేదు. అంతకుముందు.. రష్యా క్షిపణి తాకడం కారణంగా విమానం కూలిందంటూ ఉక్రెయిన్‌తో పాటు అజర్‌ బైజాన్‌ కూడా ఆరోపించింది. ఈ క్రమంలోనే స్పందించిన అధ్యక్షుడు పుతిన్‌.. అజర్‌ బైజాన్‌ దేశాధినేత ఇల్హామ్‌ అలీయేవ్‌ను క్షమాపణలు కోరారు. ఉక్రెయిన్‌, అజర్‌ బైజాన్‌ ఆరోపణల వేళ.. రష్యా ప్రకటనతో పాటు పుతిన్‌ స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది…

తొక్కిసలాటలో సీఎం రేవంత్ ను అరెస్ట్ చేయాలి.. ఆర్ఎస్ ప్రవీణ్ డిమాండ్..!

సిఎం రేవంత్ రెడ్డి సభకు ప్లెక్సీలు కడుతూ మృతి చెందిన సంఘటన, సంధ్య థియేటర్ తొక్కిసలాట సంఘటనను వేరువేరుగా చూడవద్దని మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు…తెలంగాణభవన్ లో ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ మెదక్ జిల్లా కొల్చారం మండలం కిష్టాపూర్ గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు తీస్తుండగా షాక్ కొట్టి ఇద్దరు యువకులు మరణించిన ఘటనకు సంధ్య థియేటర్ సంఘటనకు సంబంధం ఉంద న్నారు. రెండు ప్రమా దాల్లో వేర్వేరు న్యాయాలు ఉండరాదని అన్నారు. సంధ్య థియేటర్ ఘటనకేసు కిష్టాపూర్ కేసుకు సంబంధించి సంఘటనకు ఒకే న్యాయం ఉండాలన్నారు. అల్లు అర్జున్ సంధ్యథియేటర్ కేసులో ముద్దాయి అయితే కిష్టాపూర్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి ముద్దాయి అవుతారని చెప్పారు.

ఈ రెండుసంఘటనలు జాగ్రతలు తీసుకొకపోవడంతోనే జరిగాయన్నారు. ఈసంఘటనల్లో ముమ్మాటికీ స్థానిక పోలీసు వైఫల్యమే అని పేర్కొన్నారు. కానీ పోలీసులు తమకు తామే నింది తులుగా పేర్లు చేర్చుకుంటారా అని ప్రశ్నించారు. ఈ న్యాయ సూత్రం మేరకు మెద క్ ఘటనలో కూడా స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు, చివరికి సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అల్లు అర్జున్ మీద నమోదు చేసిన కేసును ఈసంఘటనలో కూడా అమలు చేయాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు….

నితీష్ కుమార్ రెడ్డి శతకం.. కన్నీటి పర్యంతమైన రవి శాస్త్రి!.

మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ మూడో రోజు ఆటలో అనేక నాటకీయ పరిణామాల మధ్య సినిమాటిక్ తరహాలో స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో లాంగాన్ దిశగా బౌండరీ బాది సెంచరీ మార్క్ అందుకున్నాడు.

221 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత జట్టును నితీష్ సంచలన బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. వాషింగ్టన్ సుందర్‌(160 బంతుల్లో ఒక్క ఫోర్‌తో 50) కలిసి 8వ వికెట్‌కు 127 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా ఔటైనా.. సిరాజ్ సాయంతో సెంచరీ మార్క్ అందుకొని తన కలను సాకారం చేసుకున్నాడు.

నితీష్ సంచలన శతకంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 116 ఓవర్లలో 9 వికెట్లకు 358 పరుగులు చేసింది. క్రీజులో నితీష్ కుమార్ రెడ్డితో పాటు మహమ్మద్ సిరాజ్(0 బ్యాటింగ్) ఉన్నాడు. భారత్ ఇంకా 116 పరుగుల వెనుకంజలో ఉంది. ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ మూడేసి వికెట్లు తీయగా.. నాథన్ లయన్ రెండు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 పరుగుల భారీ స్కోర్ చేసిన విషయం తెలిసిందే.

అయితే నితీష్ కుమార్ రెడ్డి శతకం సాధించిన వెంటనే అతని తండ్రి ముత్యాల రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఒక్కసారిగా తన కష్టాలను గుర్తు చేసుకోని కన్నీటి పర్యంతమయ్యాడు. అయితే నితీష్ తండ్రే కాదు.. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి సైతం భావోద్వేగానికి గురయ్యాడు. కొడుకు సక్సెస్‌ను చూసి భావోద్వేగానికి గురైన తండ్రి చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేకపోయాడు.

ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న రవి శాస్త్రి.. నితీష్ సెంచరీ సమయంలో పఠాన్‌తో కలిసి హిందీ వ్యాఖ్యానం చేశాడు. ‘ఇది భావోద్వేగపూరితమైన సందర్భం. అతని తండ్రికే కాదు. ప్రేక్షకుల్లోని ప్రతీ ఒక్కరు కన్నీటిపర్యంతమయ్యారనుకుంటున్నా.’అని శాస్త్రి ఎమోషనల్ అయ్యాడు. ఈ వీడియోను స్టార్ స్పోర్ట్స్ అభిమానులతో పంచుకుంది.
https://x.com/mufaddal_vohra/status/1872916497565466957?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1872916497565466957%7Ctwgr%5E607fb2c9babc338b1235a274f621f10d8aafa5d0%7Ctwcon%5Es1_c10&ref_url=http%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F..

నాగార్జున సాగర్ ప్రధాన డ్యాంపై మళ్లీ సీఆర్పిఎఫ్ బలగాల మోహరింపు.!

సాగర్ ప్రధాన డ్యాంపై సీఆర్పిఎఫ్ భద్రత తొలగించారు. నాగార్జున సాగర్ డ్యాం తిరిగి ఎస్పీఎఫ్ ఆధీనంలోకి వచ్చింది. అయితే శనివారం ఉదయం 10 గంటలకు నాగర్జున సాగర్ డ్యాం నుంచి వెళ్ళిపోయిన సిఆర్పిఎఫ్ బలగాలు…తిరిగి మళ్లీ రాత్రి ఏడు గంటలకు సాగర్ ప్రధాని డ్యాంని ఆధీనంలో తీసుకోవడం చర్చనీయాంశమైంది.

గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సమయంలో నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ నిర్వహణ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. బోర్డుకు ఇండెంట్‌ ఇస్తున్నా తెలంగాణను పదేపదే అడగాల్సి వస్తోందని..13వ గేటు నుంచి తమ వైపు ఉన్న గేట్లను తామే ఆపరేట్‌ చేసుకుంటామని కృష్ణా బోర్డుకు లేఖ రాసింది.

తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తూ.. ప్రస్తుతం 13వ క్రెస్ట్‌ నుంచి ఏపీ పరిధిలో మిగతా భాగమంతా తెలంగాణ పరిధిలో ఉన్నది. తమ పరిధిలో ఉన్న ప్రాజెక్టును ఏపీ బలవంతంగా ఆక్రమించిందని తెలంగాణ కేంద్రానికి ఫిర్యాదు చేయడం వంటి పరిణామాలతో ఎన్నికల సమయంలో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి.

ఈ క్రమంలో సమయంలో కేంద్ర బలగాలు రంగ ప్రవేశంతో కాస్త ఉద్రికత్త తగ్గింది. ఆ విషయంలో కేంద్ర హోం శాఖ, జలవనరుల శాఖలు రెండు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి, కృష్ణా బోర్డుకు చెందిన ఇద్దరు అధికారులు క్షేత్ర స్థాయి పరీశీలన కూడా చేశారు.
ఐతే ఏపీ పునర్వ్యవస్థీకణ చట్టం ప్రకారం సాగర్‌ నిర్వహణ తెలంగాణే చూస్తుందని, కాబట్టి వెంటనే ప్రాజెక్టును అప్పగించాలని తెలంగాణ కేంద్రానికి వరుస లేఖలు రాసింది. కేంద్ర హోంశాఖ సూచించిన విధంగా 2023 నవంబర్‌ 28కి ముందు ఉన్న పరిస్థితిని కొనసాగేలా చూడాలని కోరింది.

ప్రస్తుతం నాగార్జున సాగర్ డ్యాం భద్రత కేఆర్ ఎంబీ అధీనంలో ఉండటంతో సీఆర్ పీఎఫ్ బలగాలతో భద్రత నిఘాలో ఉంది.. శనివారం సీఆర్పీఎఫ్ నుంచి భద్రతపరమైన చర్యలను ఎస్పీఎఫ్ అప్పజెప్పారు. అయితే ఉదయం 10 గంటలకు నాగర్జున సాగర్ డ్యాం నుంచి వెళ్ళిపోయిన సిఆర్పిఎఫ్ బలగాలు… తిరిగి మళ్లీ రాత్రి ఏడు గంటలకు సాగర్ ప్రధాని డ్యాంని ఆధీనంలో తీసుకోవడం చర్చనీయాంశమైంది…

54 కోట్లు 600 కోట్లు ఎలా అయ్యాయి: హైకోర్టులో కేటీఆర్‌ పిటిషన్
..

ఈ కేసులో నిరాధారమైన నిందారోపణలే తప్ప నిజాలు లేవు. ఫార్ములా ఈ సీజన్ 10 నిర్వహణ, స్పాన్సర్ లేకపోవడంతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది…ఇందులో కుట్ర లేదు, అవినీతి అంతా కన్నా లేదు. ఈ నిర్ణయం నేను ఒక మంత్రిగా తీసుకున్నాను. హైదరాబాద్ ప్రతిష్ఠను పెంచడం కోసం తీసుకున్న నిర్ణయం మాత్రమే. ఫార్ములా ఈ మరో సీజన్‌ను కూడా హైదరాబాద్ లో నిర్వహించడానికి తీసుకున్న ఒక విధానపరమైన నిర్ణయం మాత్రమే.

ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన జరిగితే ఎలక్షన్ కమిషన్ నోటిస్‌లు ఇవ్వాలి.. అది ఇప్పటి వరకు జరగలేదు. ఎలక్షన్ కమిషన్ తరుపున మీరు ఎందుకు వకాల్తా పుచ్చుకున్నారు? ఫార్ములా ఈ వలన రాష్ట్రానికి లాభం వచ్చిందని నీల్సన్ రిపోర్ట్ చెప్తోంది. అది చేజారిపోకూడదని 54 కోట్ల చెల్లింపులు అప్పటి నా శాఖ జరిపింది. చెల్లింపులు అక్రమం కాదు. అయితే ఈ 54 కోట్లు 600 కోట్లు ఎట్లా అయ్యాయి? ఆ లెక్క ఇప్పటివరకు మాకు కనిపించలేదు. చాలా అస్పష్టంగా ఈ ఆరోపణ. 600 కోట్ల లెక్క ముందు చెప్పండి. కేవలం ఇది నా మీద బురద జల్లే ప్రయత్నం మాత్రమే.

హెచ్ఎండీఏ అధికారాలకు లోబడే 54 కోట్లు చెల్లింపులు ఫార్ములా ఈ సంస్థకు బదిలీ చేయడం జరిగింది. మీరు చెప్పే 8 కోట్లు టాక్స్ రిటర్న్స్ మాత్రమే. స్పాన్సర్ ఆ పన్నును భర్తీ చేస్తారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా జరిగిన చెల్లింపులు అన్నీ రూల్స్ ప్రకారామే జరిగాయి. 54 కోట్లు ఫార్ములా ఈ నిర్వహకులకు ఇచ్చినప్పుడు, అది మీరన్నట్టు అవినీతి జరిగితే… మరి ఫార్ములా ఈ సంస్థ మీద ఎందుకు కేసులు వేయలేదు? ఇప్పటివరకు నాకు రూపాయి కూడా ముట్టినట్టు మీరు చూపించలేకపోయారు. ఇవి కక్షపూరిత ఆరోపణలే కానీ.. నేరం జరిగిందని చెప్పే రుజువులు కాదు. ఫార్ములా ఈ వల్ల ఒకవేళ నష్టం జరిగితే.. అది కేవలం రేవంత్ అర్ధరహిత నిర్ణయాలు, ఆలోచన లేని పనుల వల్ల మాత్రమే జరిగింది’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు…

KTR:నితీష్ కుమార్ రెడ్డి ఫ్యూచర్‌లో కెప్టెన్ అవుతారు..!

బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుతం సృష్టించాడు. నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) తన అంతర్జాతీయ టెస్టు కెరీర్‌లో మొదటి సెంచరీ(First century) నమోదు చేసి సత్తా చాటాడు..ఆస్ట్రేలియాతో ఈ బోర్డర్ గవాస్కర్ సిరీస్‌ తొలి టెస్టుతో అరంగేట్రం చేసిన 21 ఏళ్ల నితీష్ కుమార్ రెడ్డి మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో బాక్సింగ్ డే టెస్టులో 171 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్‌తో సెంచరీ మైలురాయిని చేరుకున్నాడు.

మొత్తంగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar series)లో విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ తర్వాత సెంచరీ చేసిన మూడో భారతీయ బ్యాటర్ గా నితీష్ కుమార్ రెడ్డి నిలిచాడు. దీంతో నితీష్ ఘన విజయం పై రాజకీయ ప్రముఖులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తరఫున సెంచరీ చేసిన నితీశ్ కుమార్ రెడ్డిని కేటీఆర్(KTR) అభినందించారు. టెర్రిఫిక్ ఇన్నింగ్స్ నితీశ్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఫ్యూచర్ కెప్టెన్ నితీష్ అంటూ ఆకాశానికి పొగిడారు..

అనుమతులు ఉన్నా.. లేకున్నా వాటి జోలికి వెళ్లం.. హైడ్రా చీఫ్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు.!

ఆనుమతులు ఉన్నా.. లేకున్నా.. నివాస గృహాల జోలికి హైడ్రా వెళ్లదు.. ఇకపై ఆక్రమణలు చేస్తే మాత్రం హైడ్రా కఠినంగా వ్యవహరిస్తుంది.. అంటూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు…హైడ్రా ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు 8చెరువులు, 12 పార్కులను హైడ్రా కాపాడిందని.. రంగనాథ్ పేర్కొన్నారు. 200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌పై ప్రజలకు అవగాహన కల్పించామని రంగనాథ్ పేర్కొన్నారు. ఇకపై ఆక్రమణలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. శనివారం మీడియాతో మాట్లాడిన రంగనాథ్.. హైడ్రా ఓవరాల్ ప్రోగ్రెస్‌పై స్పందించారు..

సాంకేతిక పరిజ్ఞానంతో చెరువులకు సరిహద్దులు, బఫర్‌జోన్‌లు నిర్ణయిస్తున్నట్లు పేర్కొన్నారు.. ఎన్ఆర్ఎస్‌ఈతో సమన్వయం చేసుకొని శాటిలైట్ చిత్రాలు సేకరిస్తున్నామన్నారు. అలాగే.. చెరువులకు సంబంధించి 2000 నుంచి 2024 వరకు ఉన్న చిత్రాలు సేకరిస్తున్నామని.. వివరించారు.. ఎఫ్‌టీఎల్‌కు సంబంధించి పారదర్శకంగా, శాస్త్రీయంగా మార్కింగ్ చేయబోతున్నామన్నారు. నాలాలకు సంబంధించి కూడా కిర్లోస్కర్‌తో సమన్వయం చేసుకుంటున్నట్లు వివరించారు. ఇప్పటివరకు హైడ్రాకు 5800 ఫిర్యాదులు వచ్చినట్లు రంగనాధ్ తెలిపారు. మున్సిపాలిటీల్లో అనధికార నిర్మాణాలపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.
హైడ్రా చర్యల వల్ల ప్రజల్లో అక్రమ, అనధికార నిర్మాణాలపై అవగాహన పెరిగిందని రంగనాధ్ తెలిపారు. ఎఫ్‌టీఎల్ అంటే ఏంటి?, బఫర్ జోన్ అంటే ఏంటి?, ఎక్కడ నిర్మాణాలు చేసుకుంటే మంచిది.. ఎక్కడ కొనాలి అనే క్లారిటీ.. ప్రజల్లో వచ్చిందని, కొందరు కావాలనే హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు…

మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే లాభమే..

మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం’ అంటూ టీవీల్లో, పేపర్లలో ప్రకటనలు ఇచ్చినా ఎవ్వరూ పట్టించుకోరు. కనీసం రోజుకు ఒక పెగ్ అయినా పడాల్సిందేనని అనుకుంటారు..ఇక మందు బాబుల సంగతి గురించి చెప్పాల్సిన పని లేదు. మందు షాపుల ముందే తాగేసి పడుకుంటారు.
మద్యం తాగడం వల్ల లివర్, కిడ్నీలు ఫెయిల్ అయ్యి ప్రాణాల మదకు వస్తుందని డాక్టర్లు హెచ్చరించినా పెద్దగా పట్టంచుకోరు. మరి మద్యం సేవించినా ఆరోగ్యంగా ఉండాలంటే కష్టమే కదా.. కానీ పెద్దగా చింతించాల్సిన పని లేదని సైంటిస్టులు అంటున్నారు.

ఇటీవల చేసిన పలు పరిశోధనల్లో మద్యం సేవించినా లివర్ పాడవకూడదంటే ఏం చేయాలని పలువురి మీద పరిశోధనలు చేశారు. ఇందులో మద్యం తాగినప్పుడు పచ్చి మిర్చి తింటే లివర్ డ్యామేజ్ కాదని తేలింది..

ఎందుకంటే పచ్చి మిర్చిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మద్యం తాగినప్పుడు పచ్చి మిర్చి తింటే.. ఆ యాంటీ ఆక్సిడెంట్లు లివర్‌కు రక్షణగా నిలుస్తాయి. దీని వలన లివర్ పై ఎలాంటి ఎఫెక్ట్ పడదు.

పచ్చి మిర్చి తిని మద్యం సేవిస్తే లివర్‌పై ఎంలాంటి ప్రభావం పడదని, లివర్‌కు మేలు జరుగుతుందని చెబుతున్నారు. కానీ మంచిదని అదే పనిగా తాగి, పచ్చి మిర్చి తింటే మాత్రం అనారోగ్య సమస్యలు రావడం గ్యారెంటీ అని చెబుతున్నారు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.).