నాలుగో టెస్ట్‌లో ఓటమి.. ఓటమి.. సంక్లిష్టంగా మారిన టీమిండియా ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ ఆశలు..!!
అంపైర్లు ఛీటింగ్.. వివాదంగా మారిన జైశ్వాల్ వికెట్ !
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్‌లో భారత జట్టు 184 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమితో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్‌కు చేరాలన్న భారత జట్టు అవకాశాలపై దెబ్బ కొట్టింది..
టీమ్ఇండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిఫ్ ఫైనల్ అవకాశాలు మరింత సంక్లిష్టం అయ్యాయి. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయింది.
మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో భారత్ 184 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. 340 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్ 79.1 ఓవర్లలో 155 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (84; 208 బంతుల్లో 8 ఫోర్లు) ఒక్కడే రాణించాడు. రిషబ్ పంత్ (30; 104 బంతుల్లో 2 ఫోర్లు) పర్వాలేదనిపించాడు..వీరిద్దరు మినహా మిగిలిన అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. రోహిత్ శర్మ (9), కేఎల్ రాహుల్ (0), విరాట్ కోహ్లీ (5), రవీంద్ర జడేజా (2), నితీశ్ రెడ్డి (1), ఆకాశ్ దీప్ (1) లు విఫలం అయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో పాట్ కమిన్స్, స్కాట్ బొలాండ్‌లు చెరో మూడు వికెట్లు తీశారు. నాథన్ లైయాన్ రెండు వికెట్లు పడగొట్టగా, మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్లు చెరో వికెట్ సాధించారు…
టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు తమ పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. మెల్బోర్న్ టెస్టులోనూ ఈ ఇద్దరూ విఫలం అయ్యారు. ఆస్ట్రేలియా 340 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తమ అనుభవం, ఆటతో ఈ భారీ లక్ష్య ఛేదనలో జట్టును ముందుండి ‘రో-కో’ ద్వయం నడిపిస్తారని అభిమానులు ఆశించారు. అయితే.. కెప్టెన్ రోహిత్ శర్మ 9 పరుగులు, విరాట్ కోహ్లీ 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నారు..ఈ క్రమంలో వీరిద్దరిపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వస్తున్నాయి. ఈ ఇద్దరూ ఇన్నాళ్లు టీమ్ఇండియాకు అందించిన సేవలు ఇక చాలు అని, వీరిద్దరు రిటైర్మెంట్ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అంటున్నారు..
రోహిత్ శర్మ గత కొన్నాళ్లుగా టెస్టుల్లో దారుణంగా విఫలం అవుతున్నాడు. వేగంగా ఆడాలని ప్రయత్నిస్తూ ఔట్ అవుతున్నాడు. పదే పదే ఇలా ఔట్ అవుతున్నా కానీ తన పంతాను మార్చుకోవడం లేదు. దీంతో అతడు జట్టుకు భారంగా మారుతున్నాడు. గత 15 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు. అది కూడా స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కావడం గమనార్హం. ఆ మ్యాచ్‌లో 52 పరుగులతో రాణించాడు..ఆస్ట్రేలియా (Australia) 12 సంవత్సరాల తర్వాత టీమిండియాపై (team india) బాక్సింగ్ డే టెస్ట్‌ను గెలుచుకుంది. మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టులో 184 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్‌లోని ఐదో, చివరి టెస్ట్ జనవరి 3, 2025 నుంచి సిడ్నీలో జరుగుతుంది. మెల్బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌కు 340 పరుగుల విజయ లక్ష్యం ఉంది. దీంతో భారత జట్టు 155 పరుగులకే కుప్పకూలింది. భారత 9వ వికెట్‌గా జస్ప్రీత్ బుమ్రా ఔట్ అయ్యాడు. బోలాండ్ అతడిని పెవిలియన్ పంపాడు. సున్నా పరుగులకే బుమ్రా ఔటయ్యాడు. స్మిత్ చేతికి చిక్కాడు..
రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు..
రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్ పై టీమ్ఇండియా మాజీ ఆటగాడు రవిశాస్త్రి స్పందించాడు. కోహ్లీ తన కెరీర్‌ను కొనసాగించాలని కోరాడు. అదే సమయంలో రోహిత్ శర్మ ఈ సిరీస్ ముగిశాక ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నాడు.
రోహిత్ శర్మ ఫుట్‌వర్క్ మెరుగ్గా లేదన్నాడు. అందుకే పరుగులు రాబట్టేందుకు ఇబ్బందులు పడుతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇక నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతడు ఔటైన తీరు ఇబ్బందికరమేనని అన్నారు. కోహ్లీ కనీసం మరో మూడేళ్లు ఆడే అవకాశాలు ఉన్నాయన్నాడు. అతడి ఫిట్నెస్ బాగుందని చెప్పాడు…
ఒంటరి పోరాటం
భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ మాత్రమే అత్యధికంగా 84 పరుగులు చేశాడు. భారత్ తరఫున యశస్వి జైస్వాల్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 86 పరుగుల స్కోరు వద్ద రనౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఒంటరిగా 208 బంతులు ఆడాడు. అందులో 84 పరుగులు చేశాడు. ఆ క్రమంలో ఆయన ఔట్ కూడా వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే ఒకవైపు స్నికోమీటర్లో స్పైక్ కనిపించలేదు. మరోవైపు జైస్వాల్ బ్యాట్, గ్లోవ్ దగ్గర బంతి వెళ్ళినప్పుడు, అది కొద్దిగా దిశను మార్చుకుంది. అయినా కూడా జైస్వాల్‌ను థర్డ్ అంపైర్ అవుట్ చేశాడు. జైస్వాల్ ఔటైన 15 పరుగుల సమయంలోనే ఇతర భారత ఆటగాళ్లు కూడా ఔటయ్యారు.
వివాదాస్పదంగా మారిన ఎంపైర్ల నిర్ణయాలు...
అంపైర్లు ఛీటింగ్.. వివాదంగా మారిన జైశ్వాల్ వికెట్ !
రెండో ఇన్నింగ్స్‌లో అత్యంత కీలకమైన ఆట ఆడుతున్న సమయంలో.. జైస్వాల్‌ను థార్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. ఆ విలువైన వికెట్ కోల్పోవడంతో.. భారత్ ఆ మ్యాచ్‌లో ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చింది.
84 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బ్యాటింగ్ చేస్తున్న జైస్వాల్.. కమ్మిన్స్ బౌలింగ్‌లో హుక్ షాట్ కొట్టాడు. నిజానికి ఆన్‌ఫీల్డ్ అంపైర్ దాన్ని ఔట్ ఇవ్వలేదు. కానీ థార్డ్ అంపైర్ సైకత్ షర్ఫుద్దౌలా అవుట్‌గా ప్రకటించాడు. బ్యాట్‌కు బంతి తగిలినట్లు స్నికోలో తేలలేదు. కానీ బంతి ప్రయాణిస్తున్న లైన్ స్వల్పంగా మారినట్లు గుర్తించిన థార్డ్ అంపైర్ అతన్ని అవుట్‌గా ప్రకటించాడు…లెగ్ సైడ్‌లో కమ్మిన్స్ షార్ట్‌పిచ్ బంతి వేశాడు. దాన్ని హుక్ చేయబోగా, అది మిస్సైంది. కీపర్ అలెక్సీ ఆ బంతిని అందుకున్నాడు. ఆన్‌ఫీల్డ్ అంపైర్ జోయల్ విల్సన్ దాన్ని నాటౌట్‌గా ప్రకటించారు. బౌలర్ రివ్యూకు వెళ్లడంతో .. థార్డ్ అంపైర్ జోయల్ విల్సన్ ఔట్ ఇచ్చేశాడు. 208 బంతులు ఆడిన జైస్వాల్ 84 రన్స్ వద్ద ఔటయ్యాడు.
భారత్‌ను డ్రా దిశగా తీసుకెళ్తాడని భావిస్తున్న తరుణంలో ఓపెనర్ జైస్వాల్ అవుట్ కావడంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. ఆన్ ఫీల్డ్ అంపైర్లతో జైస్వాల్ మొరపెట్టుకున్నా ఫలితం లేకుండాపోయింది. అయితే థార్డ్ అంపైర్ నిర్ణయం సబబే అని ఛానల్ 7లో ఐసీసీ ఎలైట్ ప్యానల్ అంపైర్ సైమన్ టఫెల్ పేర్కొన్నారు.
మరో వైపు మాజీ క్రికెటర్ గవాస్కర్.. థార్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. బంతి బ్యాట్‌కు తాకలేదన్నారు. బంతి వెళ్లిన మార్గాన్ని కేవవం ఆప్టికల్ ఇల్యూజన్‌గా ఆయన అభివర్ణించారు. స్నికో టెక్నాలజీ ద్వారా గుర్తించలేని విషయాన్ని ఎలా ఔట్‌గా పరిగణిస్తారని ప్రశ్నించారు. టెక్నాలజీతో ఔట్ నిర్ణయాన్ని తేల్చలేనప్పుడు, అసలు ఆ టెక్నాలజీ వద్దన్నారు..