ఓ కాంట్రాక్టర్‌ మంత్రి, ఓ బ్రోకర్‌ ముఖ్యమంత్రి.. వాళ్లకు మాటలు గిట్లే వస్తయ్‌ కేటిఆర్ సంచలన వ్యాఖ్యలు…

భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు ఇవాళ భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఫార్ములా -ఈ కార్ రేసు కేసులో ఆయన దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది.ఈ కేసులో కేటీఆర్ తో పాటు మిగతా నిందితులపై ఇప్పటికే ఏసీబీతో పాటు ఈడీ కూడా విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది……..

దీనిపై కెటిఆర్ Kalvakuntla Taraka Rama Rao – KTR మీడియాతో మాట్లాడుతూ..

ఓ కాంట్రాక్టర్‌ మంత్రి, ఓ బ్రోకర్‌ ముఖ్యమంత్రి అని.. వాళ్లకు మాటలు గిట్లే వస్తయ్‌.. వాళ్లకు తెలిసిన రాజకీయం ఇదే అంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు మండిపడ్డారు. నందినగర్‌లోని నివాసం వద్ద ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇక్కడ బీజేపీ రక్షణకవచంలా కాంగ్రెస్‌కు పని చేస్తుంది. బీజేపీ, కాంగ్రెస్‌ ఏ టీమ్‌, బీ టీమ్‌. ఏవరో ఏ టీమ్‌ మాకు తెలియదు. ఇవాళ ఒకరినొకరు పెనవేసుకున్న బంధంతో కలిసి పని చేస్తున్నారు. ఆయన కేసు పెడుతడు.. ఇక్కడికేలి వీళ్లు కాకిరిబీకిరి లొల్లి స్టార్ట్‌ చేస్తరు. ఇవన్నీ మాకు కొత్త కాదు. గతంలోనూ చూశాం.. భవిష్యత్‌లోనూ చూస్తాం. ఇద్దరినీ గతంలో చిత్తుచేసి రెండుసార్లు అధికారంలోకి వచ్చాం. భవిష్యత్‌లో ప్రజల ఆశీర్వాదంతో ప్రజల దయతో అధికారంలోకి వస్తాం’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు..

హై కోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టేసినందుకే కాంగ్రెస్ వాళ్లు నాకు ఉరి శిక్ష వేసినట్లు సంకలు గుద్దుకుంటున్నారు…హైకోర్టులో కొట్టేసిన క్వాష్ పిటిషన్ పై మేము సుప్రీంకోర్టుకు వెళ్ళాము.. అక్కడ కూడా న్యాయ పోరాటం చేస్తాము అని
కేటీఆర్ అన్నారు ..పచ్చ కామెర్ల వాళ్లకి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు వ్యవహరిస్తున్నారు ఈ సన్నాసులు అని ఘాటుగా విమర్శించారు..

అవినీతిపరుడికి, 50 లక్షల రూపాయలు లంచం ఇస్తూ దొరికిన దొంగకు ఏ పని చేసినా తప్పుగానే అనిపిస్తుంది..పుర్రెలో పుట్టింది ఎక్కడికి పోదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు సిఎం రేవంత్ రెడ్డి అన్నారు..