డాకు మహారాజ్ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ బాలకృష్ణ అభిమానులు ఓ థియేటర్ వద్ద గొర్రె పొట్టేలును బలి ఇచ్చారు. బలి ఇచ్చిన గొర్రె రక్తాన్నిఅద్ది డాకు మహారాజ్ పోస్టర్ కు రుద్దుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది…
నెట్టింట విమర్శలు కాగా, సినిమా హిట్ కావాలని మూగ జీవాలను అలా బలివ్వడం ఏంటని జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలు మంచివి కాదని నెటిజన్లు కూడా విమర్శిస్తున్నారు. .. అభిమానం ఉండాలి కానీ మూగజీవాలనే భలించే అంత అభిమానం ఉండకూడదు అంటూ సోషల్ మీడియా లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు…. అభిమాన నటుడుపై అభిమానం ఉంటే అది వేరే విధంగా చూపించాలి కానీ ఇలా పిచ్చి అభిమానం చూపిస్తే అది సరైన పద్ధతి కాదంటూ చురకలు అంటించారు నెట్ జన్లు..