నేటి పంచాంగం…

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🎍పంచాంగం🎍
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 16 – 01 – 2025,
వారం … బృహస్పతివాసరే ( గురువారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
హేమంత ఋతువు,
పుష్య మాసం,
బహుళ పక్షం,

తిథి : *తదియ* తె4.25 వరకు,
నక్షత్రం : *ఆశ్లేష* మ12.03 వరకు,
యోగం : *ఆయుష్మాన్* రా2.14 వరకు,
కరణం : *వణిజ* సా4.06 వరకు
తదుపరి *విష్ఠి* తె4.25 వరకు,

వర్జ్యం : *రా12.43 – 2.24,*
దుర్ముహూర్తము : *ఉ10.19 – 11.04,*
మరల *మ2.45 – 3.29,*
అమృతకాలం : *ఉ10.23 – 12.03,*
రాహుకాలం : *మ1.30 – 3.00,*
యమగండం : *ఉ6.0 – 7.30,*
సూర్యరాశి : మకరం,
చంద్రరాశి : కర్కాటకం,
సూర్యోదయం : 6.39,
సూర్యాస్తమయం: 5.41,

*_నేటి విశేషం_*

*ముక్కనుమ*
*కోనసీమ ప్రభలతీర్థం*

*‘’ముక్కనుమ’ నాడు – సావిత్రి గౌరీదేవి వ్రతం”*
కనుమ మరుసటి రోజుని *’ముక్కనుమ’* గా పిలుచు కుంటూ వుంటారు.
ఈ రోజున కొన్ని ప్రాంతాల్లో బొమ్మల నోము( సావిత్రి గౌరీ నోము) చేస్తారు.

*సావిత్రి గౌరీదేవి వేదమాత*
ఈ దేవతను గూర్చి …
వరహ ,
బ్రహ్మవైవర్త ,
పద్మ పురాణాలు ,
దేవీ భాగవతం వివరిస్తున్నాయి.
… స్త్రీలు వివాహమైన తొలి కనుమ మరుసటి రోజుని *’ముక్కనుమ’* గా పిలుచుకుంటూ వుంటారు, కొన్ని ప్రాంతాల్లో బొమ్మల నోము( సావిత్రి గౌరీ నోము) చేస్తారు.
స్త్రీలు వివాహమైన తొలి సంవత్సరం, ఈ నోమును తొమ్మిది రోజులు చేయాలి.

దేవిని తొమ్మిది రోజులు పూజించి తొమ్మిది పిండివంటలతో రోజూ నివేదన చేసిన పిదప ఆ మట్టి బొమ్మలను పుణ్య తీర్థ మందు నిమజ్జనం చేస్తారు.

ముక్కనుమ నాడు సావిత్రి గౌరివ్రతం చేసే మహిళలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం.
వివాహం కావలసిన కన్నెపిల్లలు కూడా
ఈ బొమ్మల నోములో పాల్గొంటూ వుంటారు.

ముత్తయిదువులను పేరంటానికి పిలిచి , మట్టిబొమ్మల మధ్య పసుపు గౌరీదేవిని వుంచి పూజిస్తారు.

అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తూ
ముత్తయిదువులకు పండ్లు , తాంబూలం వాయనంగా ఇస్తారు.
ఈ విధంగా గౌరీదేవిని ఆరాధిస్తూ బొమ్మలనోము చేయించడం వలన
సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని అంటారు.
కన్నెపిల్లలకు సద్గుణ సంపన్నుడైన యువకుడు భర్తగా లభిస్తాడని విశ్వసిస్తుంటారు.
ఇలా ముక్కనుమ కూడా ఈ బొమ్మల నోము ద్వారా కోరిన వరాలను ప్రసాదిస్తూ తనదైన ప్రత్యేకతను ఆవిష్కరిస్తూ వుంటుంది.

*_🎍శుభమస్తు🎍_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏