ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఆయన్ని తిహార్ జైలుకు తరలించారు. ఈ సమయంలో కేజ్రీవాల్ కు సంబంధించిన ప్రతి వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. తిహార జైలులో ఆయనకు ఎటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారు? అడిగిన పుస్తకాలు ఇచ్చారా? తదితర విషయాలపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఇదేకోవలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఎంత ఆస్తి ఉందనే విషయం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. తనకు రూ.1.73 కోట్ల ఆస్తులు ఉన్నాయని తాజా అఫిడవిట్ ద్వారా వెల్లడించారు. బ్యాంకులో ఆయనకు 2.96 లక్షల సేవింగ్స్, రూ.50వేల నగదు.. మొత్తం స్థిరాస్తుల విలువ రూ.1.7 కోట్లుగా ప్రకటించారు. తనకు సొంత ఇల్లు, కారు లేవని తెలిపారు. దంపతులిద్దరి ఆస్తుల విలువ రూ.4.23 కోట్లుగా ఉందని ప్రకటించారు…