సినీ ప్రముఖులపై మూడో రోజు కొనసాగుతున్న ఐటీ రైడ్స్.

పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో రెండో రోజు కొనసాగుతున్న సోదాలు

పుష్ప 2 నిర్మాత ఇళ్లలో కొనసాగుతున్న సోదాలు

నిర్మాత రిలయన్స్ శ్రీధర్ ఇంట్లో ఐటీ సోదాలు

ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాంగో సంస్థపై కొనసాగుతున్న రైడ్స్…

*స్వరం మార్చిన ఎమ్మెల్యే.. ప్రభుత్వంపై ఫైర్.. అధికారులపై ఆగ్రహం..*

తెలంగాణ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులు ఒకచోట పనిచేస్తూ బదిలీలతో మరోచోటకి వెళ్తారని… కానీ ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా స్థానిక ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తారన్నారు. తాను పుట్టింది, పెరిగింది, రాజకీయ జీవితాన్ని ఇచ్చింది హైదరాబాదే అని అన్నారు.

ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి సీరియస్ అయ్యారు. ఫుట్‌పాత్ కూల్చివేతలు మొదలు పెట్టాలంటే ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టాలంటూ వ్యాఖ్యలు చేశారు. ఏ ప్రభుత్వం అయినా అధికారులకు స్వేచ్ఛను ఇస్తే ఆ ప్రభుత్వాలకు మనుగడ ఉండదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులు ఒకచోట పనిచేస్తూ బదిలీలతో మరోచోటకి వెళ్తారని… కానీ ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా స్థానిక ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తారన్నారు. తాను పుట్టింది, పెరిగింది, రాజకీయ జీవితాన్ని ఇచ్చింది హైదరాబాదే అని అన్నారు.

తనకు రాజకీయం ఇచ్చింది హైదరాబాద్‌ కాబట్టి తాను ఖైరతాబాద్ నియోజకవర్గానికే పరిమితం కాదని… హైదరాబాద్‌లో ఎక్కడ ప్రజలకు ఇబ్బంది వచ్చినా దానం ముందుంటాడని స్పష్టం చేశారు. గతంలో తాను హైడ్రా విషయంలో మాట్లాడినా.. ఇప్పుడు ఫుట్‌పాత్‌ల విషయంలో మాట్లాడుతున్న అంటే అది ప్రభుత్వానికి చెడ్డపేరు రావొద్దనేదే తన అభిప్రాయమని చెప్పుకొచ్చారు. ఇటీవల మాదాపూర్‌లో ఫుట్‌పాత్‌లపై కుమారి ఆంటీని వేధిస్తున్నప్పుడు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ఆమె జోలికి పోవొద్దని అధికారులకు ఏ విధంగా ఆదేశాలు ఇచ్చారో.. ఇప్పుడు ఫుట్‌పాత్ ఆక్రమణల కూల్చివేతల్లో కూడా ముఖ్యమంత్రి అదే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

పేద ప్రజల జీవనాధారాన్ని అధికారులు ధ్వంసం చేస్తున్నారన్నారు. ఎలాంటి పబ్లిక్ నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చేసే పనుల వల్ల ప్రజల మధ్య తాము తిరగలేకపోతున్నామంటూ వ్యాఖ్యలు చేశారు. పేదల ఇండ్లను అధికారులు తొలగించడం సరైంది కాదన్నారు. ఓల్డ్ సిటీలో అక్రమ నిర్మాణాలు వారికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మొదలు పెడితే అక్కడి నుంచే తొలగింపులు చేయాలన్నారు. అధికారుల వైఖరి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యలు చేశారు.

కాగా.. నిన్న (బుధవారం) జీహెచ్‌ఎంసీ అధికారులపై దానం సీరియస్‌ అయిన విషయం తెలిసిందే. ఆపరేషన్ రోప్‌లో భాగంగా చింతల్‌బస్తీలో అక్రమ నిర్మాణాలను గుర్తించిన జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు వాటిని కూల్చివేసే పనిలో పడ్డారు. ట్రాఫిక్ పోలీసులతో కలిసి అక్రమాలను కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు. అయితే జీహెచ్‌ఎంసీ అధికారుల వైఖరిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవిషయాన్ని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే అక్కడకు చేరుకుని హల్‌చల్ చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారులకు ధమ్కీ ఇచ్చారు. ఎక్కడి నుంచో ఇక్కడకు బతకడానికి వచ్చి.. ఇక్కడున్న తమను బతకనియ్యరా అంటూ మండిపడ్డారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలను ప్రభుత్వానికి చెందిన ఎమ్మెల్యే అడ్డుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి..

డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు జైలు శిక్ష

2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసులో దర్శకుడు రాంగోపాల్ వర్మను దోషిగా తేలుస్తూ 3 నెలల జైలు శిక్ష విధించిన ముంబై అంథేరి కోర్టు

ఫిర్యాదుదారునికి RGV 3 నెలల్లో రూ.3.72లక్షల పరిహారం ఇవ్వాలని, లేదంటే మరో 3 నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పు…

ఈడీకి లక్ష జరిమానా విధించిన బాంబే హైకోర్టు

ముంబైకి చెందిన రాకేశ్ జైన్ అనే స్థిరాస్తి వ్యాపారిపై మనీ లాండరింగ్ కింద దర్యాప్తు చేపట్టిన ఈడీ

ఓ ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈడీ కేసు నమోదు

దీంతో ముంబై హైకోర్టును ఆశ్రయించిన రాకేశ్ జైన్

ఇందులో మనీ లాండరింగ్ ఎక్కడుంది. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ప్రజలను వేధించొద్దని హితవు

ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి రూ.1 లక్ష జరిమానా విధించిన ముంబై హైకోర్టు…

విమర్శలు మానుకోకపోతే.. 20 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరే మిగులుతారు..ఏక్‌నాథ్‌ శిందే.

తమ పార్టీ శివసేన (Shiv Sena), అధికార కూటమి మహాయుతిపై విమర్శలు చేస్తున్న శివసేన (యూబీటీ)పై (Shiv Sena (UBT)) మహారాష్ట్ర (Maharashtra) డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) మండిపడ్డారు…విమర్శలు మానుకోకపోతే.. 20 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరే మిగులుతారని వ్యాఖ్యానించారు. విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

”మొదటి నుంచి కూడా నన్ను, మహాయుతిని శివసేన (యూబీటీ) విమర్శిస్తూనే ఉంది. కానీ, వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోయింది. గతేడాది జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. వారికి తమ స్థాయి ఏంటో తెలియజెప్పారు. ఓటమి పట్ల వారంతా ఆత్మపరిశీలన చేసుకోవాలి. విమర్శలను ఇలాగే కొనసాగిస్తే.. ప్రస్తుతం 20 మంది ఎమ్మెల్యేల నుంచి ఇద్దరే మిగులుతారు” అంటూ హెచ్చరించారు..

చిత్తశుద్ది ఉంటే ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల కూల్చివేతను.. పాతబస్తీ నుంచి ప్రారంభించండి: ఎమ్మెల్యే దానం.

హైదరాబాద్‌లో ఫుట్‌పాత్‌ల కూల్చివేతలపై ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు..పేద ప్రజల జీవనాధారాన్ని అధికారులు ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పాలసీ ఉంటే పబ్లిక్‌ నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారంటూ ప్రశ్నించారు. అధికారులు చేసే పనులతో తాము ప్రజల మధ్య తిరుగలేకపోతున్నామని చెప్పారు. అధికారులకు చిత్తశుద్ధి ఉంటే ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల కూల్చివేతను పాతబస్తీ నుంచి ప్రారంభించాలన్నారు. హైదరాబాద్‌ ఆదర్శ్‌నగర్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మట్లాడుతూ.. మాదాపూర్‌లో కుమారీ అంటీకి ఇచ్చిన మినహాఇంపును అధికారులు పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

చింతల్‌బస్తీలో ట్రాఫిక్‌ పోలీస్‌-జీహెచ్‌ఎంసీ సంయుక్తంగా రోప్‌ కింద రోడ్డు ఆక్రమించి చేపట్టిన వందకుపైగా నిర్మాణాలను బుధవారం కూల్చివేశారు. ఇండ్లు కోల్పోయిన వారంతా రోజువారీగా పొట్టపోసుకునే చిరు వ్యాపారులే. దీంతో అక్కడకు వచ్చిన దానం నాగేందర్‌ ఒకింత ఆవేశానికి గురయ్యారు. స్థానిక ఎమ్మెల్యే నోటీసులో లేకుండా కూల్చివేతలు ఎలా చేపడతారు? ఆపకపోతే ఇక్కడే బైఠాయిస్తా.. ఎమ్మెల్యే పదవి పోయినా సరే జేసీబీకి అడ్డంగా కూర్చుంటానని హెచ్చరించారు. ‘దావోస్‌లో ఉన్న సీఎం వచ్చే వరకు రెండ్రోజులు ఆగండి.. ప్రజలకు నేను కదా సమాధానం చెప్పుకోవాల్సింది.. కూల్చివేస్తే బాగుండదు..’ అంటూ ఘాటుగా మాట్లాడారు. కానీ ఇదంతా పది నిమిషాల్లో ముగిసింది. అధికారులు మాత్రం క్షణం పాటు కూడా కూల్చివేతలు నిలిపివేయలేదు. గత 40 ఏండ్లుగా ఇక్కడే ఉంటూ బతుకుదెరువు సాగిస్తున్న తమ షాపులను తొలగిస్తే రోడ్డునపడుతామంటూ స్థానికులు రోదించినా.. అధికారులు కూల్చివేతలను ఆపలేదు..

ఇవాళ దరఖాస్తు చేసుకున్నా రేషన్ కార్డు అందజేస్తాం..ఉత్తమ్.

రేషన్ కార్డుల కోసం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని… అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు….ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని… ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. పేదలందరికీ రేషన్ కార్డులను మంజూరు చేస్తామని తెలిపారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు గ్రామసభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇవాళ దరఖాస్తు చేసుకున్నా రేషన్ కార్డు ఇస్తామని ఉత్తమ్ తెలిపారు. రేషన్ కార్డులు ఇవ్వకుండా పదేళ్ల పాటు ప్రజలను బీఆర్ఎస్ మోసం చేసిందని మండిపడ్డారు. మరోవైపు ఈ నెల 24 వరకు రేషన్ కార్డులను దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ నెల 26 నుంచి అర్హులకు రేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేయనుంది..

నా ఇష్టం బరాబర్ నేను కేసీఆర్ ఫోటో పెట్టుకుంటా..రేవంత్ రెడ్డి ఫోటో నాకిష్టమైతే పెట్టుకుంటా..లేకుంటే లేదని సంచలన వ్యాఖ్యలు చేసిన.ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.

నా ఇష్టం బరాబర్ నేను కేసీఆర్ ఫోటో పెట్టుకుంటా తప్పేంటని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఫోటో నాకిష్టమైతే పెట్టుకుంటా..లేకుంటే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలన్నదే నా ఆశయం. కానీ వరుసగా రెండుసార్లు ప్రజలు తిరస్కరించిన కాటా శ్రీనివాస్ నా కార్యాలయంపై దాడికి పాల్పడడం సరికాదు. నేనేమీ చేతులకు గాజులు తొడుక్కోలేదు’ అని ఆయన హెచ్చరించారు. మూడుసార్లు ఓడినా కాటా శ్రీనివాస్ గౌడ్ కు కనీసం సిగ్గు లేదని ఘాటుగా విమర్శించారు.పిచ్చి పిచ్చి ఆలోచనలను కాటా మానుకోవాలని వార్నింగ్‌ ఇచ్చారు.

క్యాంప్ కార్యాలయం ఎమ్మెల్యే ఇళ్లు లాంటిది. దానిపై దాడి చేయటం దారుణం. కొందరు చీప్ మెంటాలిటితో పని చేస్తున్నారు. క్యాంప్ కార్యాలయంపై దాడికి సంబంధించి జిల్లా ఎస్పీ, ఐజీలతో పాటు కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశామన్నారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు. కాగా, పటాన్‌చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గంలోని ఒరిజినల్ కాంగ్రెస్ క్యాడర్ నిరసనకు పిలుపునిచ్చారు.