గత నాలుగు రోజులుగా యాదాద్రి జిల్లాలో అడవి దున్న హల్ చల్…మత్తు ఇంజక్షన్ ఇవ్వడంతో కింద పడిపోయి మృతి..!!!

గత నాలుగు రోజులుగా యాదాద్రి జిల్లాలో అడవి దున్న హల్ చల్…మత్తు ఇంజక్షన్ ఇవ్వడంతో కింద పడిపోయి మృతి ...

అడవిని వదిలి గ్రామీణ ప్రాంతాల్లోకి రావడంతో చుట్టుపక్క గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో గ్రామస్తులు మరియు అటవీ శాఖ అధికారులను చూసి అడవిదున్న భయానికి లోనై జిల్లాలోని పలి మండలాల్లోకి తిరుగుతూ భువనగిరి మండలం రెడ్డి నాయక్ తండా సమీపంలో మత్తు ఇంజక్షన్ ఇవ్వడంతో కింద పడిపోయి మృతి చెందింది.
స్థానికులు మాత్రం అటవీ శాఖ అధికారుల అత్యుత్సాహం కారణంగానే ఎక్కువ మోతాదులో రెండుసార్లు మత్తు ఇంజక్షన్ ఇవ్వడం కారణంగానే మృతి చెందిందని ఆరోపిస్తున్నారు. మృతి చెందిన అడవిదున్నను పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ కు తరలించారు ఫారెస్ట్ అధికారులు..