ఢిల్లీ ఫలితాలపై అన్నా హజారే షాకింగ్ కామెంట్స్ వైరల్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తాజాగా అన్నా హజారే స్పందించారు. ‘నేను ఎప్పుడూ చెప్పేది ఒక్కటే. అభ్యర్థి ప్రవర్తన, ఆలోచనలు బాగుండాలి. జీవితంలో తప్పులు లేకుండా చూసుకోవాలి. ఈ గుణాలు ఓటర్లలో నమ్మకం కలిగేలా చేస్తాయి. నేను ఈ విషయాన్ని కేజ్రీవాల్కు చెప్పాను. కానీ, ఆయన దానిని పట్టించుకోలేదు. చివరకు మద్యంపై దృష్టి సారించాడు. డబ్బుపై వ్యామోహంతో ఉన్నాడు. అందుకే నేడు ఓటమి ఎదుర్కొన్నాడు.’ అని అన్నా హజారే విరమ్శించారు..
ఢిల్లీ పట్టణం కాదు.. మినీ ఇండియా : మోదీ .
ఢిల్లీలో బీజేపీ విజయం సాధారణమైన విజయం కాదని ప్రధాని మోదీ తెలిపారు. ఈ విజయంతో ఆప్ అహంకార పాలనకు ఢిల్లీ ప్రజలు ముగింపు పలికారని తెలిపారు. ఢిల్లీ ఒక పట్టణం కాదని.. మినీ ఇండియా అని పేర్కొన్నారు. ఇక నుంచి ఢిల్లీలో వికాస్, విజన్, విశ్వాస్ నినాదంతో పాలన సాగించి ఢిల్లీలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని మోదీ వివరించారు..
*ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గాడిద గుడ్డు మిగిలింది*
*మాజీ మంత్రి హరీష్ రావు*
మొన్న హర్యానా, నిన్న మహారాష్ట్ర, నేడు ఢిల్లీ ఘోర పరాజయంలో రాహుల్, రేవంత్ రెడ్డి గార్ల పాత్ర అమోఘం.
ఇక్కడ హామీలు అమలు చేయకుండా, ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసుకున్నంత మాత్రాన మీకు ఓట్లు పడతాయా?
మీ గ్యారెంటీల నిజస్వరూపం దేశవ్యాప్తంగా బట్టబయలైంది. ఢిల్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆగమాగం చేసిన కులగణన మీకు బెడిసికొట్టింది.
ఇప్పటికైనా తప్పులు ఒప్పుకొని, ప్రజలకు క్షమాపణ చెప్పి కులగణను మళ్ళీ నిర్వహించండి. అన్ని కులాలకు సమన్యాయం జరిగేలా చూడండి.
ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసి అప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేసుకోండి రేవంత్ రెడ్డి గారూ..
లేదంటే మీరు ఎక్కడ అడుగుపెట్టినా ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయి.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లోనూ మీకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు..
బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్
ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు హతం.
ఛత్తీస్గఢ్: బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్
ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు హతం
మావోయిస్టుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి
మరికొంత మంది జవాన్లకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు
భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు
ఇంద్రావతి నేషనల్ పార్క్ అడవుల్లో ఘటన
అటవీప్రాంతాన్ని జల్లెడ పడుతున్న పోలీసులు..
నల్లగొండ జిల్లా:-
చామ ట్రావెల్స్ బస్సులో రూ. 23 లక్షలు మాయం.
నార్కెట్ పల్లిలో ఓ హోటల్ వద్ద టిఫిన్ చేయడానికి ఆపిన బస్
టిఫిన్ చేసి వచ్చిచూసుకుంటే మాయమైన క్యాష్ బ్యాక్
చెనయ్ – హైదరాబాద్ వెళుతున్న ట్రావెల్స్ బుస్స్
నార్కట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
వాట్సాప్లో వ్యవసాయ సమాచారం రైతులకు ఎంతో ప్రయోజనం..
వాట్సాప్లో వ్యవసాయ సమాచారం రైతులకు ఎంతో ప్రయోజనం
వ్యవసాయంలో ప్రధాన సమస్య చీడపీడలు, తెగుళ్లు. వీటిని గుర్తించడంలో ఆలస్యం, గుర్తించినా అది ఏ తెగులు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం తెలియకపోవడం వల్ల ఎక్కువ మంది రైతులు నష్టపోతున్నారు. పంటకు తెగులు సోకితే ఆ ఫోటో తీసి రైతు వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయగానే అది ఏ తెగులు, ఏ మందులు వాడాలి, ఎంత మోతాదులో వాడాలి అనే సమాచారాన్ని అధికారులు అందిస్తున్నారు. దీనివల్ల రైతులకు సకాలంలో సమాచారం అందుతోంది..
ఆప్ ఓటమిపై సీఎం రేవంత్ ఏమన్నారంటే?
TG: ఢిల్లీలో ఆప్ ఓటమిపై CM రేవంత్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘ఇండియా కూటమిలోని ప్రతి పార్టీ అన్నీ తమకే కావాలని కోరుకుంటున్నాయి. అదే పెద్ద సమస్య. హరియాణాలో ఆప్ వల్ల కాంగ్రెస్ ఓడిపోయింది. ఢిల్లీలో కాంగ్రెస్ అదే పని చేయడం వల్ల ఆప్ పోయింది. ఈ మొత్తం వ్యవహారంలో చివరికి లబ్ధి పొందుతోంది మాత్రం బీజేపీనే. అందుకే అంతా కలిసివచ్చి ప్లాన్ ప్రకారం ముందుకెళ్తే ఆశించిన ఫలితాలు వస్తాయి’ అని పేర్కొన్నారు.