నేటి పంచాంగం…నేటి మాట..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌸పంచాంగం🌸
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 15 – 02 – 2025,
వారం … స్థిరవాసరే ( శనివారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
శిశిర ఋతువు,
మాఘ మాసం,
బహుళ పక్షం,

తిథి : *తదియ* రా10.28 వరకు,
నక్షత్రం : *ఉత్తర* రా12.38 వరకు,
యోగం : *సుకర్మ* ఉ7.02 వరకు,
కరణం : *వణిజ* ఉ9.41 వరకు,
తదుపరి *విష్ఠి* రా10.28 వరకు,

వర్జ్యం : *ఉ.శే.వ.8.07 వరకు,*
దుర్ముహూర్తము : *ఉ6.31 – 8.02,*
అమృతకాలం : *సా4.48 – 6.32,*
రాహుకాలం : *ఉ9.00 – 10.30,*
యమగండం : *మ1.30 – 3.00,*
సూర్యరాశి : కుంభం,
చంద్రరాశి : కన్య,
సూర్యోదయం : 6.31,
సూర్యాస్తమయం: 5.56,

*_నేటి మాట_*

*భగవంతుని తో బంధం*
మనము సామాన్యంగా నిద్రలో అనేకరకములైనకలలు కంటుంటాము.
ఒకసారి కలలో, ఒకతను, పెద్ద అంగడి కి వెళ్ళి నట్టుగా, అక్కడ భగవంతుడు ‘క్యాష్ కౌంటర్’దగ్గర కూర్చున్న ట్లుగా చూశాడు.
ఎంతో ఆశ్చర్యంతో, ” ఓ భగవంతుడా! ఇక్కడ నీవేమి అమ్ముతుంటావు”? అని అడిగాడు.

” నీవు హృదయపూర్వకంగా ఏవి కోరుకుంటే అవి” అన్నాడు భగవంతుడు.

సాక్షాత్తు భగవంతుని నుండి నేరుగా కొనుగోలు చేసే అవకాశం జారవిడుచుకోరాదని, లౌకిక విషయాలు భగవంతుని కోరరాదని తనలో యోచించి … ” ఓభగవంతుడా! నాకు సత్యం, శాంతి, ప్రేమలు కావాలి.
సంతృప్తి కావాలి, ” ఒక్కమాటలో చెప్పాలంటే నా జీవితాన్ని ఆనంద మయం చేసే వన్నీ కావాలి. ” అని కోరాడు.
అప్పుడు భగవంతుడు చిరునవ్వుతో, ” నాయనా! నేను ఇక్కడ పండ్లను విక్రయించను, విత్తనాలు మాత్రమే అమ్ము తాను ” అన్నాడు.

అంటే భగవంతుడు మార్గమును చూపిస్తాడు, ఆ మార్గమున ననుసరించి నడుచుకోవససిన బాధ్యత మనపై ఉన్నది.

అటువంటి అర్పితం చేస్తే, మనకు అనంతమైన ఫలితాన్ని అందిస్తాడు…

సత్ సంకల్పము మనకు ఉంటే, భగవంతుని తో బంధం పెట్టుకుంటే, మనకు ఏది మంచిదో అదే జరుగుతుంది, ఏది అవసరమో అదే లభిస్తుంది.

” నన్ను నమ్మిన వారికి, అన్నమే కాదు, అమృతం కూడ అందిస్తాను.” అంటారు ఆ భగవంతుడు…

*_🌸శుభమస్తు🌸_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏