త్రితాలా ఉత్సవాల్లో హమాస్‌ లీడర్ల ఫొటోలతో ఏనుగులపై ఊరేగింపు.. బీజేపీ ఫైర్..!

Kerala:

భారత్‌లో పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్‌కు మద్దతు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కేరళ లోని పాలక్కాడు జిల్లా త్రితాలా ఉర్సు ఉత్సవాల్లో హమాస్‌ లీడర్ల ఫోటోలను ఏనుగులపై ఊరేగించడం తీవ్ర కలకలం రేపింది. హమాస్‌కు మద్దతుగా వాళ్లు బ్యానర్లు ప్రదర్శించారు.

ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఇతర నేతలు కూడా హాజరయ్యారు. అయితే.. కేరళ ఉర్సు ఉత్సవాల్లో హమాస్‌ లీడర్ల ఫోటోలను ప్రదర్శించడంపై బీజేపీ మండిపడింది.

నిర్వాహకులపై కేసు నమోదు చేయాలి: బీజేపీ డిమాండ్‌

అయితే, నిర్వాహకులపై కేసు నమోదు చేయాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది. కేరళలో పరిస్థితికి ఇది అద్దం పడుతోందని విమర్శించారు బీజేపీ నేతలు. రాష్ట్రంలో అధికార సీపీఎం నేతలతో పాటు విపక్ష కాంగ్రెస్‌ నేతలు మత రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో కొద్దిరోజుల క్రితమే ఉగ్రవాదుల సమావేశానికి హమాస్‌ నేతలు హాజరయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో కేరళలో వాళ్ల నేతల ఫోటోలను ఏనుగులపై ఊరేగించడం కలకలం రేపుతోంది..