లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్..

*శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన ప్రమాదం.*

చెన్నై నుంచి హైదరాబాద్‌ వచ్చిన బ్లూడార్ట్ కార్గో విమానంలో ల్యాండింగ్ గేర్ సమస్య..!

రన్‌వేపై అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరిన పైలెట్!

అంతర్జాతీయ విమానాలన్నీ ఆపి సేఫ్ గా కార్గో ఫ్లైట్ ల్యాండింగ్‌.

సురక్షితంగా ల్యాండ్ అయిన కార్గో విమానం.!

ల్యాండింగ్ సమయంలో విమానం లో 5 మంది సిబ్బంది.!…

మొయినాబాద్ కోడి పందేల కేసులో స్వాధీనం చేసుకున్న కోళ్లను వేలం వేసిన కోర్టు..!

వేలం పాటలో రూ. 16.65 లక్షలకు అమ్ముడుపోయిన 84 కోళ్లు

ఈ నెల 12న హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ మండలం తోల్కట్టలో ఓ ఫాంహౌస్లో కోడి పందేలు నిర్వహిస్తూ 64 మంది పట్టుబడగా 85 కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

దాంట్లో ఒకటి మృతిచెందగా మిగిలిన వాటిని రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లి కోర్టుకు తరలించారు

అయితే న్యాయమూర్తి వేలంపాట నిర్వహించడంతో.. వేలంపాట సమాచారం అందుకున్న పందెం రాయుళ్లు భారీ సంఖ్యలో తరలివచ్చారు

వీరిలో ఏపీ లోని రాజమహేంద్రవరం, ఏలూరు, నూజివీడు తదితర ప్రాంతాలకు చెందిన వారున్నారు

ఇదే కేసులోని నిందితుల అనుచరులు సైతం పాల్గొని తమ కోళ్లను దక్కించుకున్నారు….

ఎస్సై వేధింపులు తట్టుకోలేకపోతున్నాం.. ఆత్మహత్యకు అనుమతించండి సార్ ..అంటూ ఫ్లెక్సీతో కలెక్టరేట్ ఎదుట వృద్ధ దంపతుల ఆందోళన

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం వేములపల్లికి చెందిన సంది సులోచన, ప్రతాప్ రెడ్డి దంపతులకు 12 ఎకరాల భూమి ఉంది

ఈ భూమికి వెళ్లడానికి ఉన్న దారిని రెండున్నరేళ్లుగా ములుగు జిల్లా కన్నాయిగూడెం ఎస్సైగా పనిచేస్తున్న ఇనిగాల వెంకటేష్, అతడి సోదరుడు, తండ్రి కలిసి మూసివేశారని ఆరోపించిన దంపతులు

దీనిపై హైదరాబాద్ వెళ్లి ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే ఆ ఎస్సై మాపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆందోళన

మూడేళ్లుగా పొలానికి వెళ్లలేక వ్యవసాయం చేయట్లేదని.. తమకు ఆత్మహత్యే దిక్కని, ఆత్మహత్యకు అనుమతించాలని ఫ్లెక్సీతో భూపాలపల్లి కలెక్టరేట్ ఎదుట నిరసన తెలియజేసిన వృద్ధ దంపతులు…

హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం

ఎన్ని సార్లు చెప్పినా నిబంధనలు ఎందుకు పాటించరు? చట్టివిరుద్ధంగా కూల్చివేతలు చేస్తారా?

సెలవు రోజు కూల్చివేతలు చేయడం అలవాటుగా మారిందని మండిపడ్డ హైకోర్టు

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముత్తంగిలో సెలవు రోజు (ఆదివారం) ప్రవీణ్ అనే వ్యక్తికి సంబంధించిన షెడ్ ను అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నా కూడా అతనికి నమాచారం ఇవ్వకుండా కూల్చివేయడంతో అతను హైకోర్టును ఆశ్రయించాడు

విచారణ చేపట్టి అక్కడి హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ పై మండిపడ్డ జస్టిస్ కె.లక్ష్మణ్

దీంతో సెలవు రోజు కూల్చివేతలు చేయొద్దని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఎందుకు అమలు చేయడం లేదని హైడ్రాకు మొట్టికాయలు వేసిన జస్టిస్ కె.లక్ష్మణ్….

సిక్కుల తలపాగాలు తీయించిన అమెరికా?

అక్రమ వలసదారుల్ని అమెరికా భారత్కు పంపించేస్తున్న సంగతి తెలిసిందే. తొలి విమానంలో వచ్చిన వారికి సంకెళ్లు వేసి తీసుకొచ్చినట్లు వార్తలు వచ్చాయి. తాజా విమానంలో సిక్కుల తలపాగాలను తీయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 116మంది వలసదారులతో కూడిన విమానం నిన్న అమృత్సర్లో ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. ఎలాగూ వెనక్కి పంపిస్తున్న అమెరికా, ఇలాంటి పనులు చేయడమేంటంటూ వలసదారులు మండిపడుతున్నారు….

*ఆన్ లైన్ గేమ్స్ కు బానిసై విద్యార్ధి ఆత్మహత్య*

ఆన్ లైన్ గేమ్స్ ఆడి లక్షలు రూపాయలు పోగొట్టుకున్న అరవింద్ (23)…

డిగ్రీ చదువుతున్న అరవింద్…

మాదాపూర్ ఖానామెట్ లో తల్లి కుటుంబ సభ్యుల తో నివాసముంటున్న అరవింద్…

గతంలో అన్ లైన్ డబ్బులు పోవడంతో ఇంట్లో నుంచి పారిపోయిన యువకుడు…

వెతికి అరవింద్ తన ఇంటికి తెచ్చిన తల్లిదండ్రులు…

నిన్న రాత్రి కూడా ఆన్ లైన్ గేమ్ లో మరో అరవై వేలు పోగొట్టిన అరవింద్…

మనస్తాపానికి గురైన ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ అరవింద్…

స్థానిక ఏరియా హాస్పిటల్ తరలించిన తల్లిదండ్రులు…

అప్పటికే చనిపోయాడని నిర్ధారించిన వైద్యులు.

*సుప్రీం తీర్పు.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు టెన్షన్*

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. బీఆర్ఎస్ తరపున గెలిచి.. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆ పార్టీ సుప్రీంను ఆశ్రయించింది. గత విచారణలో వారిపై అనర్హత నిర్ణయం తీసుకోడానికి ఎంత సమయం కావాలని స్పీకర్ను ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో వారికి స్పీకర్ నోటీసులు అందజేశారు. కాగా సుప్రీం తీర్పుతో ఆ ఎమ్మెల్యేల భవితవ్యం తణేలనుండటంతో వారిలో

టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది…

రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి.

రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన అర్జీలు, కుల గణనతో పాటు గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులు, మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని చెప్పారు..ఇప్పటికే పలుమార్లు దరఖాస్తులకు అవకాశం ఇచ్చినప్పటికీ, మీ సేవా కేంద్రాల వద్ద రేషన్ కార్డులకు ఎందుకు రద్దీ ఉంటుందని ముఖ్యమంత్రి ఆరా తీశారు. దరఖాస్తు చేసిన కుటుంబాలే మళ్లీ మళ్లీ చేస్తున్నాయని, అందుకే రద్దీ ఉంటుందని అధికారులు వివరణ ఇచ్చారు. వెంటనే కార్డులు జారీ చేస్తే ఈ పరిస్థితి తలెత్తేది కాదని, ఆలస్యం చేయకుండా వెంటనే కొత్త కార్డులు జారీ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని, అయితే ఇప్పటికే కార్డుల కోసం దరఖాస్తు చేసిన కుటుంబాలు మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎన్నికల నియమావళి అమలులో ఉందని, నియమావళి అమలులో లేని జిల్లాల్లో ముందుగా కార్డులను జారీ చేయాలని చెప్పారు. కోడ్ ముగిసిన తర్వాత అన్ని జిల్లాల్లో కొత్త కార్డులు ఇవ్వాలని సూచించారు. కొత్త కార్డులకు సంబంధించి పౌర సరఫరాల విభాగం తయారు చేసిన పలు డిజైన్లను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పరిశీలించారు.. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు…

వైసీపీ నేతలకు లుకౌట్ నోటీసులు?

AP: తిరుమల కల్తీ నెయ్యి సరఫరా కేసులో బోలేబాబా డెయిరీతో పాటు వైష్ణవి, AR డెయిరీ డైరెక్టర్లు, CEOలను సిట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిని కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తున్న అధికారులు.. గతంలో టీటీడీలో కీలకంగా వ్యవహరించిన వైసీపీ నేతలు భూమన, వైవీ పాత్రపై స్పష్టమైన ఆధారాలు సేకరించినట్లు సమాచారం. వారు దేశం విడిచి పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.