సిరిసిల్లలో చిరువ్యాపారి శ్రీనివాస్ టీ స్టాల్ ను మూసివేయించిన ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ప్రతీది గుర్తు పెట్టుకుంటున్నామని, ఎవరినీ వదిలేది లేదని ఎక్స్ వేదికగా వార్నింగ్ ఇచ్చారు. బతుకమ్మ ఘాట్ సమీపంలో శ్రీనివాస్ అనే వ్యక్తి కేటీఆర్ ఫోటోతో టీ స్టాల్ నడుపుతున్నాడు. తన టీ షాప్ పై కేటీఆర్ ఫోటోను చూసి కలెక్టర్ సహించలేక షాపు మూసి వేయించాలని ఆదేశాలు జారీ చేసినట్లు బాధితుడు వాపోయాడు..
బాధితుడికి కేటీఆర్ ఫోన్..
తమ్మి శ్రీనివాస్ నీ కుటుంబ బాధ్యత నాది…హోటల్ నిర్వాహకుడు, బాధితుడు శ్రీనివాస్ తో ఫోన్లో భరోసానిచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…కేటీఆర్ బొమ్మ పెట్టుకున్నాడనే కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వ చర్యల వలన రోడ్డున పడ్డ హోటల్ నిర్వాహకుడు, బాధితుడు శ్రీనివాస్ తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. తొందర్లోనే వస్తా దుకాణం కొత్తది పెట్టించి నేనే ప్రారంబిస్తానని తెలిపారు. తమ్ముడు శ్రీనివాస్ అధైర్యపడకు నీ కుటుంబ బాధ్యత నాది అంటూ భరోసానిచ్చారు. కేవలం కేటీఆర్ ఫొటో ఉందనే నెపంతో కక్షగట్టిన రేవంత్త్ రెడ్డి ప్రభుత్వం అధికార అహంకారంతో ట్రేడ్ లైసెన్స్ లేదనే సాకుతో సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాటు వద్ద శ్రీనివాస్ నడుపుకుంటున్న చాయ్ దుకాణాన్ని రెండు రోజుల క్రితం సీజ్ చేశారు. అంతటితో ఆగని అధికారులు ఈరోజు క్రెన్ తో శ్రీనివాస్ చాయ్ డబ్బాను తొలగించి ట్రాక్టర్ లో తీసుకెల్లారు చాయ్ హోటల్ నడుపుకుంటే కాని పూట గడవని శ్రీనివాస్ కుటుంబం రోడ్డున పడింది. దింతో స్పందించిన కేటీఆర్ బాధితుడి శ్రీనివాస్ తో ఫోన్లో మాట్లాడి భరోసానిచ్చారు.