తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఓట్ల లెక్కింపు (MLC Vote Counting) ప్రశాంతంగా కొనసాగుతున్నది. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి (Nalgonda Teacher MLC) జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు నల్గొండలోని వేర్ హౌసింగ్ గోదాంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద కొనసాగుతున్నది..ఈ స్థానానికి మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ముగిసింది. మొదటి ప్రాధాన్యతలో పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్రెడ్డి (Sripal Reddy) లీడ్లో ఉన్నారు. శ్రీపాల్రెడ్డికి 6,035 ఓట్లు, యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డికి 4,820 ఓట్లు, టీపీఆర్టీయూ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డికి 4,437 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి పూలరవీందర్కి 3,115 ఓట్లు, బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డికి 2,289 ఓట్లు దక్కాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులు చెల్లుబాటు అయిన మొత్తం ఓట్లు 23,641 కాగా చెల్లని ఓట్లు 494గా గుర్తించారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులే విజేతలుగా నిలువనున్నారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో విజేతలు తేలకపోతే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరగనున్నది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలుపు కోటా ఓట్లు 11,822 కాగా అభ్యర్థులెవరూ ఆ సంఖ్యను చేరుకోలేకపోయారు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును కొనసాగిస్తున్నారు…
ఇవాళ రాత్రి 11 గంటల వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం తొలి ఫలితం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు 30 గంటలు పట్టే అవకాశం ఉండగా ఫట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు రెండున్నర రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది..
*🔹నల్లగొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్…*
_• కొనసాగుతున్న రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు…._
16 రౌండ్ లెక్కింపు పూర్తి…
15 మంది అభ్యర్థులు ఎలిమినేట్..
*• శ్రీపాల్ రెడ్డి (పిఆర్టియు) – 7673*
* అలుగువెల్లి నరసింహారెడ్డి (యూటీఎఫ్)- 5660.
• హర్షవర్ధన్ రెడ్డి – 5309.
• పూల రవీందర్ – 3992..
*🔹• మ్యాజిక్ ఫిగర్ 11821 ఓట్లను చేరుకునేంతవరకు కొనసాగనున్న ఎలిమినేషన్ ప్రక్రియ..*