సూర్యపేట: రోడ్డు రోలర్‌ను ఢీకొట్టిన ‘పల్లెవెలుగు’ బస్సు

సూర్యపేట: రోడ్డు రోలర్‌ను ఢీకొట్టిన ‘పల్లెవెలుగు’ బస్సు

కోదాడ నుంచి సూర్యాపేటకు వస్తున్న ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల వివరాలు.. బ్రిడ్జి పక్కనే ఉన్న రోడ్డు రోలర్‌ను బస్సు ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను సూర్యపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు…

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సుమారు గంటపాటు శ్రమించి డ్రైవర్‌ను బయటకు తీశారు పోలీసులు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సులో ఉన్న ప్రయాణికులను అద్దాలను పగలగొట్టి ఒక్కొక్కరిని కిందకు దించారు స్థానికులు.