నేటి పంచాంగం.. నేటి మాట..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌸పంచాంగం🌸
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 08 – 03 – 2025,
వారం స్థిరవాసరే ( శనివారం )

శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం,
శుక్ల పక్షం,

తిథి : *నవమి* మ12.01 వరకు,
నక్షత్రం : *ఆర్ద్ర* రా2.44 వరకు,
యోగం : *ఆయుష్మాన్* రా7.49 వరకు,
కరణం : *కౌలువ* మ12.01 వరకు,
తదుపరి *తైతుల* రా11.22 వరకు,

వర్జ్యం : *ఉ11.36 – 1.10*
దుర్ముహూర్తము : *ఉ6.17 – 7.52,*
అమృతకాలం : *సా5.02 – 6.35,*
రాహుకాలం : *ఉ9.00 – 10.30,*
యమగండం : *మ1.30 – 3.00,*
సూర్యరాశి : కుంభం,
చంద్రరాశి : మిథునం,
సూర్యోదయం : 6.18,
సూర్యాస్తమయం: 6.04,

*_నేటి మాట_*

*నేడు మనం అనుభవిస్తున్న బాధలు ఎక్కడివి, ఎందుకు వస్తున్నాయి??*
మనకి భగవంతుడి నుండి ఏదైనా లభించలేదంటే భగవంతుడికి నాపై దయలేదు అంటూ ఆయనను ఆక్షేపించకండి…

సృష్టిలో కర్మచక్రం అనుక్షణం తిరుగుతూనే ఉంటుంది, మనం ప్రతి పనిని ఎరుకతో చెయ్యాలి.
మన చేష్టలన్నీ ఇతర ప్రాణకోటికి ఏవిధంగాను హాని కలిగించని విధంగా ఉండాలి.

మనం ఇప్పుడు ఏవైతే బాధలు అనుభవిస్తూ వున్నామో ఒకప్పుడు మనం మరొకరికి కల్పించిన సమస్యలన్న మాట.

ఇప్పుడు మనం చేస్తున్న హింసాత్మక కార్యాలు రాబోయే రోజులలో మనం అనుభవించాల్సిన బాధలన్న మాట.

భవిష్యత్తు బాగుండాలంటే ప్రతిక్షణం ఎరుకతో ఉండాలి అంటారు.
కనుక గతకర్మలను అజ్ఞానపు దశలో చేశాం, ఇప్పుడు వాటిని బాధల రూపంలో అనుభవిస్తున్నాం.
ఇప్పుడు జ్ఞానం తెచ్చుకుంటే మన గతకాలపు దుష్కర్మలన్నీ దగ్ధమవుతాయి.
కనుక మన కర్మలను శుభ్రం చేసుకుంటే మనల్ని ఆదుకోవడానికి ఆయన సదా సిద్ధంగా ఉన్నాడు.
_ఒక్క అడుగు మనం వేస్తే చాలు ఆయన పది అడుగులు మనవైపు వేస్తాడు_.

*_🌸శుభమస్తు🌸_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏