లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్…

*తిరుమలలో ఏనుగుల సంచారం*

మొదటి ఘాట్ రోడ్డులోని ఏడోవ మైలు సమీపంలో సంచరించిన ఏనుగులు

ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు శ్రమిస్తున్న అటవీ శాఖ, విజిలెన్స్ సిబ్బంది..

*నేడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్..*

*రూ.5,000 కోట్ల బెట్టింగ్!*

TG: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రేపు దుబాయ్ భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్పి పందెం రాయుళ్లు రూ.5,000 కోట్ల వరకు పందాలు కాసినట్లు సమాచారం. దావూద్ ఇబ్రహీం ముఠా ‘డి కంపెనీ’ దుబాయ్ లో బుకీలతో లావాదేవీలు నడుపుతారని సంబంధిత వర్గాలు తెలిపాయి. CT సెమీఫైనల్పై బెట్టింగ్లు వేసిన పలువురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు…

*_వరంగల్లో దేశంలోనే తొలి గోల్డ్ లోన్ ATM.. పావు గంటలో చేతికి డబ్బులు…!!*

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అందుబాటులోకి వచ్చిన తర్వాత టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఎంత కష్టమైన పని అయినా చాలా సులువుగా, ఎంతో మంది చేసే పనిని తక్కువ మందితో చేసే సౌకర్యం కృత్రిమ మేధ కల్పిస్తోంది.

*_తాజాగా ఏఐ ఆధారంగా పనిచేసే గోల్డ్ లోన్ ఏటీఎం అందుబాటులోకి రావడం విశేషం._*

ఇండియాలోనే తొలి గోల్డ్ లోన్ ఏటీఎం ను వరంగల్ లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఎం.వి.రావు శుక్రవారం (మార్చి7) ఏటీఎంను లాంచ్ చేశారు. ఈ ఏటీఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది. ఫైనాన్షియల్ సెక్టార్ లో ఇది గేమ్ ఛేంజర్ ఇన్నోవేషన్ కానుందని ఈ సందర్భంగా ఎం.వి.రావు తెలిపారు.

గోల్డ్ లోన్ ను కేవలం 10 నుంచి 12 నిమిషాలలో ప్రాసెస్ చేస్తుంది ఈ ఏటీఎం. ఆధార్, మొబైల్ నంబర్ వెరిఫికేషన్ చేసి చాలా తొందరగా గోల్డ్ లోన్ ప్రాసెస్ చేస్తుంది ఈ ఏఐ ATM.

*_ATM ఎలా పనిచేస్తుందంటే.._*

ఏటీఎం మెషిన్ లో బంగారు ఆభరణాలు వేసినపుడు వాటి క్వాలిటీ, బరువును అంచనా వేస్తుంది. బంగారం క్వాలిటీని బట్టి ప్రస్తుత మార్కెట్ ధరల ఆధారంగా పేమెంట్ చేస్తుంది. చాలా కచ్చితమైన లెక్కలతో ఇది ఆభరణాలను కొలుచి పేమెంట్ చేస్తుందని అంటున్నారు.

ఏటీఎం మెషీన్ లో వేసిన బంగారాన్ని తూచిన తర్వాత 10 శాతం అమౌంట్ ను క్యాష్ రూపంలో ఏటీఎంలో అప్పటికప్పుడే చెల్లిస్తుంది. మిగతా మొత్తాన్ని అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేస్తుంది. అయితే వినియోగదారులు సెంట్రల్ బ్యాంకు ఖాతాదారులై ఉండాలి.

బ్యాంక్ సిబ్బందితో పాటు కస్టమర్స్ సమయాన్ని ఆదా చేసుందుకు ఈ ఏటీఎం ఉపయోగపడుతుంది. అదే విధంగా గోల్డ్ లోన్ గురించి అధికారులపై ఆధారపడకుండా, ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా ఈ టెక్నాలజీ ఏటీఎం ఉపకరిస్తుంది. ఇది సక్సెస్ అయితే దేశంలోని అన్ని బ్రాంచులలో ఏర్పాటు చేస్తామని సీఈఓ ఎం.వి.రావు తెలిపారు.

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి..!

నల్లగొండ జిల్లా:-
నార్కెట్ పల్లి మండలం. ఏపిలింగటం శివరులో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు

కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలు

హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళుతున్న కారు

ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు హైదరాబాద్ హల్వాలకు చెందిన ప్రవీణ్ ,సాయి గౌడ్ గా గుర్తింపు..

ఆ రెండు దేశాలతో ఎప్పటికైనా భారతదేశానికి ముప్పే.. భారత ఆర్మీ చీఫ్ షాకింగ్‌ కామెంట్స్‌..!

చైనా, పాక్‌ సంబంధాలపై భారత ఆర్మీ చీఫ్ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఆ రెండు దేశాలు ఏకమయ్యే భారత్‌పై దాడి చేస్తున్నాయని ఆరోపించారు. చైనా, పాక్‌ నుంచి ఎప్పటికైనా దేశానికి ముప్పే అన్న ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

చైనా, పాకిస్థాన్‌ దేశాలను ఉద్దేశించి భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఆ రెండు దేశాల మధ్య ఉన్న కుట్ర పూరిత సంబంధాన్ని భారత్ అంగీకరించాల్సిందే అన్నారు. అంతేకాదు.. చైనాలో తయారు అవుతున్న అనేక మిలిటరీ ఉత్పత్తులను పాకిస్థాన్‌ వినియోగిస్తుందని.. వాటితోనే మన దేశంపై దాడికి ప్రయత్నిస్తుందని వివరించారు.

ఒక జాతీయ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఉపేంద్ర ద్వివేది చైనా, పాక్‌ కలిసి చేస్తున్న కుట్రలను అడ్డుకోవాలంటే మరింత అలెర్ట్‌గా ఉండాలన్నారు. ముఖ్యంగా.. వర్చువల్‌ డొమైన్‌లో చైనా, పాకిస్థాన్‌ మధ్య బంధం వందశాతం ఉందని వివరించారు. అందుకే.. ఈ రెండు దేశాల నుంచి భారత్‌కు ముప్పు ఉందని స్పష్టం చేశారు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది.

మరోవైపు.. భారత్‌-పాక్‌ బోర్డర్‌లోని పరిస్థితులపైనా అనుమానం వ్యక్తం చేశారు. వేసవి కాలం సమీపిస్తున్న కొద్దీ జమ్మూ కశ్మీర్‌లో చొరబాట్లు పెరిగే అవకాశం మరింత ఎక్కువగా ఉందన్నారు. సరిహద్దుల వెంబడి చొరబాట్లు తగ్గే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదని.. ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు.

ఉగ్రవాదుల కదలికలు పెరిగే అవకాశం ఉన్నందున భారత్ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఉగ్రవాద కట్టడి కోసం స్ట్రాంగ్‌ యాక్షన్‌ తీసుకుంటుందని ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. ఈ విషయంలో గణనీయమైన పురోగతి సాధించినట్లు తెలిపారు.

ఈసారి సాధారణ వర్షాలే: వాతావరణ శాఖ అంచనా..

ఈసారి దేశంలో సాధారణ వర్షపాతమే ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు..ఏప్రిల్ తొలి వారంలో ఇచ్చే తొలి అంచనాల్లో దీనిపై మరింత క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పగటి పూట ఎండ మంట.. రాత్రి చలి తీవ్రత ఎక్కువగా ఉంటున్నది. కాగా, ఈ ఏడాది ఎల్నినో న్యూట్రల్ కండిషన్స్ ఉంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) స్పష్టం చేసింది.

డిసెంబర్లో లానినా పరిస్థితులున్నా.. ప్రస్తుతం అది బలహీనపడిందని పేర్కొంది. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో టెంపరేచర్లు కొంచెం పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలోనే మార్చి నుంచి మే వరకు ఎల్నినో న్యూట్రల్ పరిస్థితులు 60 శాతం వరకు ఉండొచ్చని డబ్ల్యూఎంవో తెలిపింది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య ఎల్నినో బలపడొచ్చని అభిప్రాయపడింది. అయితే, ఇప్పుడే దానిపై ఓ స్పష్టతకు రాలేమని పేర్కొంది. ప్రస్తుతానికైతే లానినా పరిస్థితులు 40 శాతం వరకున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలోనే మన దేశంలో సాధారణ వర్షపాతమే రికార్డ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తున్నది.

టెంపరేచర్లు పెరుగుతున్నయ్..

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పగటిపూట టెంపరేచర్లు 40 డిగ్రీల మార్క్కు చేరువలో ఉన్నాయి. అదే సమయంలో రాత్రిపూట చలి ప్రభా వం కూడా కనిపిస్తున్నది. రాష్ట్రంలో శనివారం అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లా కొత్తమోల్గరలో 39.8 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత రికార్డయింది. జగిత్యాల జిల్లా గోదూరు, జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 39.7 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డయ్యాయి.

మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, రంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 39 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో 37 నుంచి 39 డిగ్రీల మధ్య రికార్డయ్యాయి. ఇటు పలు జిల్లాల్లో రాత్రిపూట టెంపరేచర్లు తగ్గుతున్నాయి.

ఆసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అత్యల్పంగా 11.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రంగారెడ్డిలో 11.8, నిజామాబాద్లో 12, రాజన్నసిరిసిల్లలో 12.3, సిద్దిపేటలో 12.4, ఆదిలాబాద్లో 12.4, నాగర్కర్నూల్లో 12.5, ములుగులో 12.5, జయశంకర్ జిల్లాలో 12.6 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని, ఆ తర్వాత క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు..

*టన్నెల్ మృతుల ఆనవాళ్లు గుర్తించిన జాగిలాలు*

నాగర్ కర్నూలు జిల్లాలో కూలిన ఎస్ఎల్ బీసీ, టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి సొరంగంలో గల్లంతైన వారిని గుర్తించడంలో కొంత పురోగతి లభించింది, ప్రమాదానికి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది.

ఎస్ఎల్ బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సొరంగంలో ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో డి2 పాయింట్ లో మనుషుల ఆనవాళ్లను కేరళ జాగిలాలు గుర్తించి నట్లు సమాచారం.

ఈ ప్రాంతంలో సిబ్బంది జాగ్రత్తగా మట్టిని తొలగిస్తున్నారు. గల్లంతు అయిన వారిలో కొందరిని నేడు సాయంత్రానికి గుర్తించే ఛాన్స్ ఉంది. ఆనవాళ్లు లభించడాన్ని ఇంకా అధికారులు అధికారి కంగా ప్రకటించలేదు.