ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంట్ కష్టాలను గుర్తుచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్టంలో నేను పాదయాత్ర చేస్తూ ఓ రోజు రాత్రి 12 గంటలకు నిజామాబాద్ జిల్లాలోని ఒక ఊర్లోకి వెళ్ళాను
దారిలో వెళ్తుంటే రోడ్డు మీద కూర్చొని కొందరు రైతులు చలి మంట వేసుకున్నారు.. అందులో ఒక బీటెక్ చదువుతున్న అబ్బాయి ఉన్నాడు
సెలవులు ఉన్నాయని తన తండ్రికి సహాయంగా ఉండాలని వచ్చానని, రోజు పేపర్లో రాత్రిపూట పాము కాటుకు రైతు మృతి అని వచ్చే వార్తలు చదివేవాడినని, ఇప్పుడు బోరు వేయడానికి వెళ్లాలంటే భయంగా ఉందని ఆ అబ్బాయి నాతో చెప్పాడు
అబ్బాయి ఆ మాటలు చెప్తుంటే నాకు చాలా బాధ వేసింది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరెంట్ కష్టాలు ఇలా ఉండేవి అన్నారు..