*ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి*
యాంకర్…యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేశముక్ గ్రామ పరిధిలోని విజ్ఞాన్ కాలేజీలో ఈతకు వెళ్ళి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.. భూదాన్ పోచంపల్లి మండలం దేశముఖి గ్రామంలో పడవు పడిన ఓ క్వారీ గుంతలో ఈతకు వెళ్లి బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న గంద జయన్ (18), బొడ్డు శ్యామ్ శరన్ (18) ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు.
మొత్తం నలుగురు విద్యార్థులు మధ్యాహ్నం ఈతకు వెళ్లినట్లు సమాచారం.
అందులో ఇద్దరు ఈతరాక నీటిలో మునిగి చనిపోయారు. మృతదేహాల కోసం గాలిస్తున్న పోలీసులు.. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సింది..