ఏసీబీ అధికారులకు చిక్కిన చింతలపాలెం ఎస్సై అంతిరెడ్డి…

2024 అక్టోబర్ నెలకు సంబంధించి అక్రమ రేషన్ బియ్యం తరలింపు కేసు విషయంలో స్టేషన్ బెయిల్ మంజూరు కోసం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన చింతలపాలెం ఎస్సై అంతిరెడ్డి.
ఎస్ఐపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన ఏసీబీ అధికారులు.
ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే ఏసీబీకి ఫిర్యాదు చేయాలని వినతి.

సూర్యాపేట జిల్లా….

చింతలపాలెం మండలం ఎస్సై అంతిరెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల పట్టుబడ్డారు.

స్టేషన్ బెయిల్ మంజూరు విషయంలో 10000 లంచం తీసుకుంటుండగా నల్లగొండ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కేసు నమోదు చేశారు.
2024 అక్టోబర్ నెలలో చింతలపాలెం మండలానికి చెందిన వ్యక్తులు అక్రమంగా పిడిఎఫ్ బియ్యాన్ని తరలిస్తున్న విషయంలో కేసు నమోదు చేయడం జరిగింది.
23 అక్టోబర్ 2024న పిడిఎస్ రైస్ అక్రమ రవాణా కేసులు ఆరుగురు పైన కేసు నమోదు అవ్వగా నిందితులను పట్టుకున్న ఎస్ఐ స్టేషన్ బెయిల్ మంజూరు విషయంలో 15000 లంచం డిమాండ్ చేసినట్లు నిందితుల్లో ఒకరు నల్లగొండ ఏసీబీ రేంజ్ అధికారులకు ఫిర్యాదు చేయగా విచారణ జరిపిన ఏసీబీ అధికారులు గతంలో ఎస్సై పై ఉన్న అవినీతి ఆరోపణలు దృష్టిలో ఉంచుకొని ఫిర్యాదు దారుని ద్వారా ట్రాప్ చేయించి రెడ్ హ్యాండెడ్ గా సాయంత్రం నాలుగు గంటల సమయంలో చింతలపాలెం మండలంలో పట్టుకున్నట్టుగా తెలిపారు.. విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్లో విచారించినట్టుగా తెలిపేరు..
వారి దగ్గర ఉన్న నగదును స్వాధీన పరుచుకొని కేసు నమోదు చేసి తదుపరి ఎస్సై ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం ఆశిస్తే ఏసీబీ అధికారులను ఆశ్రయించాలని ప్రజలకు సూచించారు.