న్యూఢిల్లీ: కొత్త వక్ఫ్ చట్టంపై పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యను భారత ప్రభుత్వం తిరస్కరించింది, దీనిని “అసభ్యకరమైనది మరియు ప్రేరేపితమైనది” అని పేర్కొంది.
భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం పాకిస్థాన్కు (Pakistan) లేదని ఉద్ఘాటించింది.
”భారత పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లుపై పాకిస్థాన్ చేసిన ప్రేరేపిత, నిరాధార వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత్ అంతర్గత వ్యవహారాలపై మాట్లాడటానికి మీకు ఎలాంటి అధికారం లేదు. మైనార్టీలకు రక్షణ కల్పించే విషయంలో ఇతరులకు బోధించే బదులు పాక్ తన అధ్వాన్న రికార్డును చూసుకోండి” అని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ముర్షీదాబాద్ హింసలో బంగ్లాదేశీయుల ప్రమేయం..?
వక్ఫ్ సవరణ చట్టంపై పాకిస్థాన్ విదేశాంగ అధికార ప్రతినిధి షఫ్కత్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. ఓ వర్గం సంబంధిత ఆస్తుల నుంచి వారిని దూరం చేయడానికే ఈ చట్టాన్ని భారత్ తీసుకువచ్చిందన్నారు. అది మైనార్టీలను కించపరచడమేనని ఆయన చెప్పినట్లు పాక్ మీడియా వెల్లడించింది. తాజాగా వీటిపైనే భారత్ దీటుగా స్పందించింది.