సౌదీలో పర్యటించనున్న మోదీ
ప్రధాని మోదీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లనున్నారు. క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు ఏప్రిల్ 22, 23 తేదీల్లో సౌదీలో పర్యటిస్తారు. 2016, 2019 తర్వాత మూడోసారి నరేంద్ర మోదీ గల్ఫ్ దేశంలో పర్యటించనున్నారు. 2023 సెప్టెంబర్‌లో G20 సమ్మిట్, సౌదీ-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య తొలి సమావేశంలో పాల్గొనేందుకు సౌదీ యువరాజు ఇండియా వచ్చిన విషయం తెలిసిందే..
అంతరిక్షంలోకి 40 ఏళ్ల తర్వాత మరో భారతీయుడు
భారతదేశం నుంచి దాదాపు 40 ఏళ్ల తర్వాత మరోసారి ఓ భారతీయుడు అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్నాడు. ఇస్రో ప్రకారం శుభాన్షు శుక్లా అనే యువకుడు 2025 మేలో ఆక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లనున్నాడు. 1984లో రాకేశ్ శర్మ తర్వాత ఇది తొలి భారతీయ అంతరిక్ష ప్రయాణం కానుంది. ఈ మిషన్ భారత అంతరిక్ష రంగానికి కొత్త అనుభవాలను, అవకాశం కల్పిస్తుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.
తండ్రి చనిపోయినా కష్టపడి చదువుతున్న చిన్నారి కథ విని కన్నీళ్లు పెట్టుకుని భావోద్వేగానికి గురైన మాజీ మంత్రి హరీష్ రావు
తండ్రి చనిపోయాడని.. తన తల్లి కష్టపడి చదివిస్తుందన్న ఓ చిన్నారి కథ విని స్టేజి పైనే కంటతడి పెట్టుకుని.. చిన్నారిని ఓదార్చిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు
సిద్దిపేటలో స్కూల్ విద్యార్థులకు ‘భద్రంగా ఉండాలి.. భవిష్యత్‌లో ఎదగాలి’ అనే అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు..
*భగవద్గీతకు యునెస్కో గుర్తింపు*
భారతదేశ వారసత్వ సంపదలు భగవద్గీత, భరత ముని రచించిన నాట్యశాస్త్రం రాతప్రతులు యునెస్కోకు చెందిన మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కించుకున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ ఇవీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయునికి గర్వించే క్షణాలని తెలిపారు..
భారత్‌కు జపాన్ సర్ప్రైజ్ గిఫ్ట్.. ఇక రైల్వే ట్రాక్ హీటెక్కాల్సిందే!
ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగానే ముంబై (Mumbai) – అహ్మదాబాద్ (Ahmedabad) హైస్పీడ్ రైల్ కారిడార్ శరవేగంగా రూపుదిద్దుకుటోంది. ఒకవేళ ఆ ట్రాక్ పూర్తయితే దేశంలో ముంబై – అహ్మదాబాద్ రూట్ తొలి హైస్పీడ్ రైల్వే కారిడార్‌గా నిలవనుంది. అయితే, ఆ ట్రాక్‌పై ట్రైన్ గరిష్ట వేగం గంటకు 320 కి.మీగా ఉండనుంది.
బుల్లెట్ ట్రైన్‌గా పిలిచే ఈ రైలు వ్యవస్థను భారత రైల్వే అనుబంధ సంస్థ నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ (ఎన్హెచ్ఎస్ఆర్సీ) అభివృద్ధి చేస్తోంది. ముంబై-అహ్మదాబాద్ మార్గంలో పనులు పూర్తయిన వెంటనే హై టెంపరేచర్, డ్రైవింగ్ పరిస్థితులపై సమాచారాన్ని సేకరించేందుకు బుల్లెట్ ట్రైన్లను ట్రయల్ రన్ (Trial Run) చేయనున్నారు.
ఈ క్రమంలోనే ఇండియా (India)తో జపాన్ కు ఉన్న స్నేహ సంబంధాల నేపథ్యంలో ఆ దేశం ఇండియాకు రెండు బుల్లెట్ ట్రైన్లను గిఫ్ట్‌గా ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. భారత్‌లో బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌కు బిగ్ బూస్ట్ ఇచ్చేలా మిత్ర దేశం జపాన్ (Japan) ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం.
గంటకు ఏకంగా 320 కి.మీటర్ల వేగంతో దూసుకెళ్లే షింకన్ సెన్ E5, E3 (Shinkansen E5, E3) సిరీస్ బుల్లెట్ ట్రైన్లు త్వరలోనే భారత్‌కు రానున్నాయి. అయితే, ట్రైన్లనే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడార్‌పై ట్రయల్ రన్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. కానీ, అధికారికంగా బుల్లెట్ ట్రైన్లు 2026లో ప్రయాణికుల అందుబాటులోకి వస్తాయని ఎన్హెచ్ఎస్ఆర్సీ (NHSRC) ఇప్పటికే ప్రకటించింది…
నాగర్ కర్నూల్ జిల్లా:
మంత్రి పొంగులేటి హెలికాప్టర్ కు తప్పిన ప్రమాదం* .
అప్రమత్తం అయి మంటలు అర్పిన పోలీసులు.
మంత్రి పొంగులేటి హెలికాప్టర్ కు తప్పిన ప్రమాదం.
శనివారం భూ భారతి చట్టం 2025 అవగాహన కార్యక్రమానికి నాగర్ కర్నూల్ జిల్లా కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, సంపత్ కుమార్ హెలికాప్టర్ లో వచ్చారు.హెలికాప్టర్ కలెక్టరేట్ ప్రాంగణం లో ల్యాండింగ్ చేస్తున్న క్రమం లో సిగ్నల్ కోసం బుల్లెట్ ఫైర్ చేయడంతో కింద ఉన్న వొట్టి గడ్డి పై పడి అగ్నిప్రమాదం సంభావించింది. 2 మీటర్ల మేర అంటుకుంది. పోలీసులు, ఫైర్ సిబ్బంది అప్రమత్తం అయి వెంటనే మంటలు అర్పారు.దింతో మంత్రికి పెను ప్రమాదం తప్పింది అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు..
కాలేజ్ భవనం పై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
సూర్యాపేట – చిలుకూరు మండలం గేట్ ఇంజినీరింగ్ కాలేజ్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ బీటెక్ విద్యార్థిని కృష్ణవేణి..
ఆత్మహత్యకు ముందు తల్లితోనే హాస్టల్ గదిలో కృష్ణవేణి..
తెలవారుజామున కాలేజ్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య..
కాలేజ్ యాజమాన్య వేధింపులే ఆత్మహత్యకు కారణమా లేదా కుటుంబ కలహాలేమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు..
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలానికి చెందిన కృష్ణవేణి…
*కృష్ణవేణి ఆగు చావదు అమ్మ ముందే బిల్డింగ్ పై నుంచి దూకి బీటెక్ విద్యార్థి సూసైడ్*
కాలేజీ బిల్డింగు పైనుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు ఈ ఘటన చిలుకూరు మండలం రామాపురం గ్రామంలోని గేటు కాలేజీలో చోటుచేసుకుంది.మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పిగుడుపల్లి గ్రామానికి చెందిన కృష్ణవేణి రామాపురంలోని గేట్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఉగాది సెలవులకు ఇంటికి వెళ్లిన కృష్ణవేణి తల్లితో కలిసి శుక్రవారం రోజే కాలేజీకి వచ్చింది. తల్లితో కలిసి కాలేజీ హాస్టల్లో నిద్రించిన కృష్ణవేణి.. శనివారం తెల్లవారుజామున వాష్ రూమ్‌కి వెళ్తున్న చెప్పి బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
గమనించిన విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కృష్ణవేణిని ఆసుపత్రికి పరిశీలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణవేణి ఆత్మహత్యకు గల కారణాలపై వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు.
తమ కూతురికి కాలేజీలో ఎలాంటి గొడవలు లేవు. తనతో ఎలాంటి డిస్కషన్ చేయలేదని చెబుతోంది. తమ కూతురికి ఎలాంటి సమస్యలు లేవు.. చాలా బాగుండేది.. ఆత్మహత్య చేసుకునే ముందు తనతో ఎలాంటి విషయాలు చెప్పలేదని చెప్పింది. అయితే కృష్ణవేణి చివరగా మాట్లాడినటువంటి ఫోన్ కాల్ డేటా ఆధారంగా.. పోలీసులు విచారణ ప్రారంభించారు. నిన్న రాత్రి మంచిర్యాల జిల్లాకు చెందిన వ్యక్తితోటే మూడు సార్లు ఫోన్ మాట్లాడినట్లు తెలిసింది. తరుచూ కూడా అతనితో కాల్ సంభాషణ ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఆ ఫోన్లో నెంబర్ కూడా మై సోల్ అని పెట్టుకుంది. కాబట్టి ఖచ్చితంగా ఆమెకు ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమా అని పోలీసులు అనుమానిస్తున్నారు. కృష్ణవేణి సూసైడ్‌తో కాలేజీ యానమాన్యం, స్టూడెంట్స్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
పోలీస్ స్టేషన్‌కు వచ్చిన శ్రీరెడ్డి
నటి శ్రీరెడ్డిని విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆమెపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారిస్తున్నారు.కాగా ఇప్పటికే శ్రీరెడ్డి కూటమి నాయకులకు క్షమాపణలు చెప్పినా కూటమి నేతలు, కార్యకర్తలు మాత్రం తగ్గడం లేదు. ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు..
*తెలంగాణ సచివాలయంలో భద్రత పెంపు.*
సచివాలయంలో కొత్త సీసీ కెమెరాల ఏర్పాటు.
నిఘా మరింత పటిష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఇటీవల సెక్రటేరియట్ కు పెరిగిన నకిలీ ఉద్యోగుల బెడద.
భద్రతా పరమైన బెదిరింపు కాల్స్ లో ఇప్పటికే ఒకరి అరెస్ట్.
ముఖ్యమంత్రి భద్రతా దృష్ట్యా సీఎం వాహనాలు ఎంట్రీ, ఎగ్జిట్ ప్రాంతాల్లో నాలుగు దిక్కులు కవర్ చేసేలా 360 డిగ్రీల కెమెరాలు ఏర్పాటు..
*🔹జైళ్లలో ఖైదీల కోసం ప్రత్యేక ‘సెక్స్ రూమ్స్’*
_•ఇటలీలో ఖైదీల లైంగిక కలయిక కోసం అధికారులు జైళ్లలో ప్రత్యేకంగా శృంగార గదులు ఏర్పాటు చేస్తున్నారు._
_• 2 గంటలపాటు తమ భార్యలు, ప్రియురాళ్లతో వీరు ఏకాంతంగా గడపవచ్చు. ఆ ప్రదేశంలో గార్డుల పర్యవేక్షణ కూడా ఉండదు. కాగా ములాఖత్‌కు వచ్చే భాగస్వాములతో ఖైదీలకు శృంగారం జరిపే హక్కు ఉంటుందని అక్కడి అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో అక్కడి ఉంబ్రియా ప్రాంతంలోని జైలులో తొలి సెక్స్ గది ఏర్పాటు చేశారు..
*ఐదేళ్ల తర్వాత ప్రారంభం కానున్న మానససరోవర యాత్ర”
దాదాపు ఐదేళ్ల తర్వాత కైలాస మానస సరోవర యాత్ర ప్రారంభం కానున్నది. ఈ యాత్రకు సన్నాహాలు జోరందుకున్నాయి. త్వరలోనే దీనిపై ప్రజానోటీసు జారీ చేస్తామని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.
త్వరలోనే యాత్ర ప్రారంభం అవుతుందన్నారు. చైనాతో సంప్రదింపుల తర్వాత యాత్ర కోసం మార్గాలను తిరిగి రూపొందించడాన్ని పరిశీలిస్తుందని జైస్వాల్ అన్నారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలుస్తాయన్నారు. మానస్ సరోవర్కు మూడు మార్గాలు ఉన్నాయి. ఆయా మార్గాల గుండా ప్రయాణానికి దాదాపు 14 రోజుల నుంచి గరిష్ఠంగా 21 రోజుల సమయం పడుతుంది.
సముద్ర మట్టానికి కైలాస మానసరోవరం 22వేల అడుగుల ఎత్తుల ఉంటుంది. ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ పాస్ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. సిక్కింలోని నాథులా నుంచి 802 కిలోమీటర్లు, ఇక మూడు మార్గమైన నేపాల్ రాజధాని కాట్మండు నుంచి దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అయితే, యాత్రలో పాల్గొనే పర్యాటకులంతా వందశాతం ఫిట్‌గా ఉంటే మాత్రమే ప్రయాణం చేయాలి. లేకపోతే ఇబ్బందులుపడే అవకాశాలుంటాయి.
కైలాస పర్వతం..
కైలాస పర్వతం, మానస సరోవరం టిబెట్‌లో ఉంది. ఏటా వేలాది మంది కైలాస, మానస సరోవర యాత్రలో పర్యాటకులు పాల్గొనేవారు. ఈ యాత్ర కరోనా మహమ్మారి కారణంగా 2020లో నిలిచిపోయింది. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో యాత్ర నిలిచిపోయింది.
పలు దఫాలుగా చర్చల తర్వాత.. యాత్ర పునరుద్ధరించడంతో పాటు విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. ఇక త్వరలోనే ఇందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించనున్నారు. కరోనా మహమ్మారి సమయంలో నిలిచిన యాత్ర ఇప్పుడు ప్రారంభం కానుంది.