పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ బజరంగ్ దళ్ కార్యకర్తలు రోడ్డుపై పాకిస్తాన్ జెండాలను అతికించి నిరసన…ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు..!
పాకిస్థాన్ జెండాలను రోడ్ల మీద, టాయిలెట్ వాల్స్ కు కూడా అంటించారు. అయితే ఓ కూడలిలో పాక్ జెండాలను రోడ్డుపై అంటించడాన్ని ముస్లిం మహిళలు తీవ్రంగా ఖండిస్తూ పాక్ జెండాలను తీసి వారితో తీసుకెళ్లారు.
అయితే ఈ నిరసనలకు అనుమతి తీసుకోలేదనే కారణంతో పోలీసులు ఆరుగురు బజరంగ్ దళ్ సభ్యులను అదుపులోకి తీసుకుని తరువాత విడుదల చేశారు. “పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ బజరంగ్ దళ్ కార్యకర్తలు రోడ్డుపై పాకిస్తాన్ జెండాలను అతికించి నిరసన తెలిపారు. కానీ, వారు ఎవరి అనుమతి తీసుకోలేదు. ఇది గందరగోళాన్ని సృష్టించింది. ఆరుగురిని ముందస్తు అరెస్టు చేసి, తరువాత విడుదల చేశాం” అని పోలీస్ కమిషనర్ శరణప్ప అన్నారు. నిరసనలు నిర్వహించేవారు ఎలాంటి గందరగోళం ఏర్పడకుండా ముందస్తు అనుమతి తీసుకోవాలని శరణప్ప చెప్పారు.