టీ తాగుతూ సిగరెట్ కాలుస్తున్నారా!.. వీసా లేకుండానే పై లోకానికి పక్కా!.

ఈ రోజుల్లో చాలామంది రోజూ టీ తాగుతూ సిగరెట్ కాల్చడం అలవాటుగా చేసుకుంటున్నారు. కానీ ఇది ఆరోగ్యానికి తీవ్రమైన నష్టం కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడి టీ తాగుతూ సిగరెట్ కాల్చడం వల్ల అన్నవాహిక క్యాన్సర్, గొంతు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. పురుషుల్లో శుక్రకణాల నాణ్యత తగ్గిపోతుంది. గుండెపోటు సమస్య వస్తుందట. ఈ అలవాటును మానేయకపోతే వీసా లేకుండానే పై లోకానికి పక్కా అని హెచ్చరిస్తున్నారు.