https://x.com/RichKettle07/status/1919967897113305328.
పాకిస్తాన్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పలు ఆంక్షలు విధించింది. దీనికి తోడు భారత్ ఎప్పుడు ఎటు వైపు నుంచి దాడి చేస్తుందోననే భయం పాక్‌కు పట్టుకుంది. ఈ క్రమంలోనే ఒకవైపు.. గత కొంతకాలంగా బలూచిస్తాన్ ప్రత్యేక దేశం కోసం చేస్తున్న పోరాటం కాస్తా హింసాత్మకంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా పాక్ సైనికులే లక్ష్యంగా బలూచిస్తాన్‌లో జరిగిన బాంబు దాడి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇటు భారత్, అటు బలూచిస్తాన్ మధ్య పాక్ ఇరుక్కుపోయినట్లయింది..ప్రత్యేక బలూచిస్తాన్ దేశం ఏర్పాటు కోసం ఇప్పటికే పాక్ ప్రభుత్వంపై, సైన్యంపై పోరాటం చేసేందుకు బలూచిస్తాన్ ప్రాంతంలో బాంబు దాడులు, పేలుళ్లు జరుగుతున్నాయి…
ఇది ఇలా ఉండగా,,
పాకిస్తాన్‌పై భారత దాడి చేయడంతో బలూచిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వాసులు నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు..
*🔹ఆపరేషన్ సింధూర్.*
*🔹14 మంది పాక్ సైనికులను హతమార్చిన BLA *
ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే పాకిస్థాన్‌పై ఒకవైపు భారత్ కఠినంగా వ్యవహరిస్తుంటే,
మరోవైపు బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) కూడా గట్టిగానే చుక్కలు చూపిస్తోంది.
తాజాగా BLA స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్స్ స్క్వాడ్ పాక్ ఆర్మీ వాహనంపై రిమోట్ కంట్రోల్ IED బాంబు పేల్చింది.
ఈ ఘటన మచ్కుంద్ ప్రాంతంలో జరగ్గా.. 12 మంది పాక్ సైనికులు అక్కడికక్కడే చనిపోయారు. మరో దాడిలో ఇద్దరు జవాన్లను BLA మట్టుబెట్టింది…
వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రెండు దాడుల్లో 14 మంది పాక్ ఆర్మీ హతమయ్యారు. బిలాన్లోని మాచ్‌లోని షోర్కాండ్ ప్రాంతంలో పాకిస్థాన్ సైనిక కాన్వాయ్‌పై బీఎల్ఏ రిమోట్ క్రంటోల్ ఐఈడీ దాడి చేసింది. ఈ దాడిలో 12 మంది సైనికులు మరణించారు. మరణించిన సైనికుల్లో స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ తారిక్ ఇమ్రాన్, సుబేదర్ ఉమర్ షరూక్ ఉన్నారు. ఈ పేలుడు ధాటికి వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఇక మరోచోట బీఎల్ఏ నిర్వహించిన రెండో దాడిలో ఇద్దరు పాక్ జవాన్లు మృతి చెందారు. కచ్‌లోని కులాగ్ టిగ్రామ్ ప్రాంతంలో పాక్ సైనికులను లక్ష్యంగా చేసుకుని ఐఈడీ పేలుడు బాంబులు అమర్చి ఇద్దరు సైనికులను హతమార్చారు. ఈ రెండు దాడులు తామే చేశామని బీఎల్ఏ ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. అంతే కాకుండా పాక్ ఆర్మీపై బీఎల్ఏ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. పాకిస్థాన్ ఆర్మీని కిరాయి ముఠాగా ప్రకటనలో తెలిపింది.
కాగా.. రెండు రోజుల క్రితం కూడా బలూచిస్థానలో జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు పాక్ ఆర్మీ ప్రాణాలు కోల్పోయారు. కచ్చి జిల్లాలోని మాచ్ ప్రాంతంలో పాక్ ఆర్మీ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఐఈడీతో పేల్చేశారు. ఈ పేలుళ్లో ఏడుగురు పాక్ సైన్యం మృతి చెందారు. అయితే ఈ దాడికి పాల్పడింది బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఉగ్రవాదులుగా పాకిస్థాన్ ఆర్మీ అనుమానిస్తోంది.
మరోవైపు పాకిస్థాన్‌లోని లాహోర్‌లో వరుస పేలుళ్లు జరిగాయి. లాహోర్ వాల్టన్ రోడ్‌లోని సైనిక విమానాశ్రయం వెలుపల మూడు పేలుళ్లు సంభవించాయి. పేలుళ్లను పాకిస్థాన్ అధికారులు ధృవీకరించారు. అయితే పేలుళ్ల నష్టంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ పేలుళ్లతో ముందస్తు చర్యల్లో భాగంగా లాహోర్ ఎయిర్‌పోర్టును మూసివేశారు. ఒక్కసారిగా పేలుళ్లు సంభవించడతో జనం భయంతో అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు..