ఇండియా వైపే ఆపిల్ మొగ్గు…టిమ్ కుక్ కీలక ప్రకటన..డొనాల్డ్ ట్రంప్ పరువు తీసిన టిమ్ కుక్..!

భారత్‌లో యాపిల్ కంపెనీ (Apple Companies)లు పెట్టాల్సిన అవసరం లేదని..

భారత్ లో ఐఫోన్ల తయారీని చేపట్టొద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యాపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్ కు సూచించిన విషయం తెలిసిందే.

అమెరికా (America)లోనే పెట్టాలంటూ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ (President Donald Trump) చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా దుమారం రేపాయి…ఖతార్ పర్యటనలో భాగంగా యాపిల్ సీఈవో టిక్ కుక్‌ (Tik Cook)తో భేటీలో ఆయన మాట్లాడుతూ.. భారత్ (India) అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో ఒకటని అన్నారు. అక్కడ అమెరికా ప్రాడక్ట్స్ అమ్మడం చాలా కష్టంతో కూడుకున్న విషయమని కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా టిమ్ కుక్ స్పందించారు.

యాపిల్ భారత్‌ను వదిలి వెళ్లడం లేదంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. త్వరలోనే ఐఫోన్ల తయారీని మరింత పెంచుతామని ప్రకటించారు. ఐఫోన్ 17 సిరీస్ తయారీ భారత్‌లోనే ఉండబోతోందని తెలిపారు. ఐఫోన్ ప్రో మోడళ్లను కూడా తయారు చేస్తామంటూ టాటా ఎలక్ట్రానిక్స్ ముందుకొచ్చిందని అన్నారు. ఇప్పటికే ఐఫోన్ 17 సిరీస్ తయారీని ఫాక్స్‌కాన్ మొదలు పెట్టిందని టిమ్ కుక్ తెలిపారు..

ట్రంప్ వ్యాఖ్యల తరువాత కేంద్ర ప్రభుత్వ అధికారులు ఆపిల్ ఎగ్జిక్యూటివ్ లతో మాట్లాడినట్లు తెలిసింది. భారతదేశంలో కంపెనీ పెట్టుబడి ప్రణాళికల్లో ఎలాంటి మార్పులేదు. భారత్ లో ఐఫోన్ల తయారీకి ప్రధాన స్థావరంగా మార్చాలని ప్రతిపాదిస్తున్నట్లు వారు హామీ ఇచ్చినట్లు తెలిసింది.