హుజూర్ నగర్ లింగ గిరి రోడ్ లో భారీ చోరీ…!

సూర్యాపేట జిల్లా…

హుజూర్ నగర్ లింగ గిరి రోడ్ లో భారీ చోరీ…

SBI ఏటీఎం ను ధ్వంసం చేసి డబ్బులు బాక్స్ లను దొంగిలించిన గుర్తు తెలియని దుండగులు…

పూర్తిగా ఏటీఎం మిషన్ తగలబెట్టిన దుండగులు..

ఫార్చునర్ లో వచ్చి దొంగతనం చేసినట్టుగా గుర్తించిన పోలీసులు..

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

రాత్రి రెండు గంటల నలభై నిమిషాలకి గుర్తు తెలియని దుండగులు ఫార్చునర్ కార్ లో ఏటీఎం మిషన్ సెంటర్ లోకి వచ్చి కటింగ్ మిషన్లతో ఏటీఎం ను కట్ చేసి, లోపల ఉన్న నగదును దొంగిలించిన దుండగులు…

ఇద్దరు వ్యక్తులు ఏటీఎం సెంటర్లో ప్రవేశించిన వీడియోలు సిసి ఫుటేజ్ లో స్పష్టంగా రికార్డయ్యాయి…ఒకరు కటింగ్ మిషన్ తో.. మరొకరు స్ప్రే బాటిల్, లైటర్ తో మొదటగా ఏటీఎంలోకి ప్రవేశించి.. స్ప్రే బాటిల్ తో మంట పెట్టి కట్ చేసిన అనంతరం షెటర్ కిందికి వేసి.. బయట ఎవరూ రాకుండా కాపులా ఉండి,, దొంగతనం చాకచక్యంగా చేశారు…మొత్తం కూడా 15 నిమిషాల్లోనే ఈ తంతు ముగించేశారు.. సుమారుగా ఏటీఎంలో రెండు రోజుల క్రితమే 20 లక్షల రూపాయలు అందులో పెట్టినట్టుగా ఏటీఎం నిర్వాహకులు తెలుపుతున్నారు…. నగదు మొత్తం దొంగిలించిన తర్వాత సెక్టర్ కిందికి వేసి నిప్పు అంటించి పారిపోయిన దుండగులు…అర్ధరాత్రి సమయంలో గమనించిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం తెలియజేయడంతో వెంటనే సిఐ చరమంద రాజు ఘటన స్థలానికి చేరుకున్న దర్యాప్తుని ప్రారంభించారు…. పూర్తిగా పరిశీలించి సీసీ పుటేజులను కూడా పరిశీలించి దుండగులు ఎవరు అనేదానిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది…ఒక్కసారి ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది..

గత కొన్ని రోజుల క్రితం ఏటీఎం మిషన్ సెంటర్ వద్ద నిర్వాహలకు, బ్యాంకులకు నోటీసులు ఇచ్చిన చేసిన సీఐ చరమంద రాజు… ప్రస్తుతం దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని ఏటీఎం సెంటర్ల వద్ద సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలి అని తెలియపరచినట్లుగా తెలుస్తోంది.. ఏటీఎం నిర్వహకుల అలసత్వం కూడా ఈ ఏటీఎం చోరీకి ఒక కారణంగా మారింది అంటూ స్థానికుల ఆరోపణలు..!