బెంగాల్ లో పర్యటించిన అమిత్ షా.. నేతాజీ ఇండోర్ స్టేడియంలో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. సంవత్సరాలుగా బెంగాల్ కమ్యూనిస్ట్ పాలనలో ఉంది.. ఆ తర్వాత మా, మాతి, మానుష్ నినాదంతో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చారని అన్నారు.
కానీ మమతా బెనర్జీ నాయకత్వంలో బెంగాల్లో చొరబాట్లు, మహిళలపై నేరాలు, నేర కార్యకలాపాలు, బాంబు పేలుళ్లు, హిందువులపై దాడులు పెరిగాయని ఆరోపించారు. మమతా బెనర్జీ సీఎం పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు వందలాది మంది బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని ఆరోపణలు చేశారు. దీదీ పాలనతో బెంగాల్ ప్రజలు విసుగు చెందారని.. ఆక ఆమె సమయం ముగిసిందని.. 2026 బెంగాల్ ఎన్నికల్లో అధికారం బీజేపీదేనని జోస్యం చెప్పారు..
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మమత ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ రాష్ట్రంలో అవినీతి, చొరబాట్లను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు…టీఎంసీ పాలనలో బెంగాల్లోని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని, రాష్ట్రం నుంచి హిందువుల వలసలను అడ్డుకోవాలని షా ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు…