సీఎం ప్రసంగంపై నిరుద్యోగుల్లో అసంతృప్తి!..

TG: కాంగ్రెస్ ప్రకటించిన కీలక హామీల్లో జాబ్ క్యాలెండర్ ఒకటి. నిన్న ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ నుంచి ఉద్యోగ ప్రకటన వెలువడుతుందని అంతా భావించారు. తీరా ప్రసంగంలో గతంలో చేసిన విషయాలను ప్రస్తావించారని, ఉద్యోగాలపై ఎలాంటి ప్రకటన చేయలేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు జూన్ 2 నుంచి అమలు చేస్తామన్న ‘రాజీవ్ యువ వికాసం’ పథకం వాయిదా వేయడంతో అశావాహులైన యువత అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.