ప‌ట్ట‌ణాల్లోని పేదలకూ ఇందిర‌మ్మ ఇండ్లు: పొంగులేటి

ప‌ట్ట‌ణాల్లోని పేదలకూ ఇందిర‌మ్మ ఇండ్లు: పొంగులేటి
తెలంగాణ : పేద‌ వారి సొంతింటి క‌ల నెర‌వేర్చడమే ప్రజా ప్రభుత్వ ల‌క్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప‌ట్ట‌ణాల్లోని పేదలకూ ఇందిర‌మ్మ ఇండ్లు కేటాయిస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్లపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ‘HYDలో 16 మురికివాడలను గుర్తించాం. వారున్న చోటే G+3 ప‌ద్ద‌తిలో ఇండ్ల నిర్మాణం. వ‌రంగ‌ల్‌, నిజామాబాద్‌, MBNR, న‌ల్గొండ, క‌రీంన‌గ‌ర్ ప‌ట్టణాలలో ఇదే విధానం అమ‌లు చేస్తాం’ అని స్పష్టం చేశారు.