అక్కినేని అఖిల్ తన బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై..అఖిల్ క‌న్నా జైన‌బ్ తొమ్మిది సంవ‌త్స‌రాలు పెద్ద‌నా?..

అక్కినేని అఖిల్ తన బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. ఈ రోజు తెల్ల‌వారుజామున ప్రియురాలు జైనాబ్‌ రవ్జీతో ఏడ‌డుగులు వేశాడు అఖిల్‌. గురువారం రాత్రి నుంచే పెళ్లి సంబురాలు మొద‌లు కాగా, ఈ కార్య‌క్ర‌మంలో చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ ఫ్యామిలీస్‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కూడా పాల్గొన్నారు. ఇప్పుడిప్పుడే పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. అయితే జైన‌బ్‌ని అఖిల్ పెళ్లి చేసుకున్న త‌ర్వాత నుండి ఆమె గురించి తెగ ఆరాలు తీస్తున్నారు నెటిజ‌న్స్. ఈ క్ర‌మంలో అఖిల్ క‌న్నా జైన‌బ్ తొమ్మిదేళ్లు పెద్ద‌ద‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు…అక్కినేని అఖిల్, జైనాబ్‌ల మ‌ధ్య వ‌య‌స్సు తేడా 9 సంవత్సరాలు అని, అఖిల్ వయస్సు ప్రస్తుతం 30 సంవత్సరాలు కాగా , జైనాబ్ వ‌య‌స్సు 39 సంవత్సరాలు అని అంటున్నారు. ఇప్పుడు వారి వ‌య‌స్సు విష‌యంలో జోరుగా చ‌ర్చ న‌డుస్తుంది. అఖిల్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో కామెంట్ సెక్షన్‌ను డిసేబుల్ చేయడం ద్వారా ఈ చ‌ర్చ మ‌రింత ఎక్కువైంది. జైనాబ్.. ప్రముఖ పారిశ్రామికవేత్త జుల్ఫీ రావడ్జీ కుమార్తెగా, కళాకారిణిగా, బ్లాగర్‌గా, బేస్పోక్ పరఫ్యూమర్‌గా కూడా గుర్తింపు పొందారు . హైదరాబాద్ మూలాలున్న జైనాబ్‌ ప్రస్తుతం ముంబైలోనే సెటిల్ అయ్యారని తెలుస్తోంది. ముంబైలోనే రవ్‌డ్జీ ఫ్యామిలీ ఉంటోందని టాక్.

జైనాబ్ తండ్రికి దుబాయ్, అరబ్ కంట్రీస్‌లో వ్యాపారాలున్నాయని అంటున్నారు. వైఎస్ జగన్‌కి కూడా జైనబ్ తండ్రి జుల్పీ అత్యంత సన్నిహితులు అని తెగ ప్ర‌చారాలు న‌డిచాయి. ఇక వైసీపీ ప్రభుత్వంలో ఆయన కీలక బాధ్యతల్ని నిర్వర్తించారని కూడా చెప్పుకొచ్చారు. ఇక జైనబ్ ఇప్పుడు సొంతంగా ఆర్ట్ గ్యాలరీని నిర్వహిస్తున్నారని, ఆమె చాలా ఫేమస్ ఆర్టిస్ట్ అని నేషనల్ మీడియా రాసుకొచ్చిన సంగతి తెలిసిందే. గత ఏడాది నవంబర్‌లో అఖిల్, జైనబ్‌లకి ఎంగేజ్మెంట్ జర‌గ‌గా, వారి ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించిన పిక్స్‌ని నాగార్జున ఎక్స్‌లో షేర్ చేశాడు. ఇక వీరి రిసెప్ష‌న్ జూన్ 8న గ్రాండ్‌గా జ‌ర‌గ‌నుంది..

ప్రస్తుతం జైనబ్‌ ఏజ్ 39 ఏళ్ళు అని.. అఖిల్ వయసు 30 ఏళ్ళు అని సమాచారం. ఈ విషయం తెలిసిన చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు యేజ్‌తో సంబంధం లేకుండా పెళ్లిళ్లు ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పుడు అందులో పెద్ద ఆశ్చర్యమేముంది అంటూ కామెంట్లో చేస్తున్నారు. ఇక జైన‌బ్ గ‌తంలో మీనాక్షి అనే సినిమాతో వెండితెరపై ఆర్టిస్ట్ గా కూడా మెరిసింద‌ట‌. గతంలో హైదరాబాద్‌లో రిఫ్లెక్షన్ పేరుతో కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్ ఎగ్జిబిషన్‌ను పెట్టిన ఈ అమ్మడు.. ప్రస్తుతం ముంబైలో నివాసం ఉంటుంది. ఆమె ఎక్కువగా లండన్, దుబాయ్, ఇండియా లాంటి దేశాలకు విహారాలు చేస్తూ ఉంటుందని.. తన ఇన్‌స్టా చూస్తే అర్థమవుతుంది…

ఎవ్వరు ఈమె…!?

అఖిల్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న‌ జైనబ్ రావిడ్జి ఎవరు.. ఆమె ఏం చేస్తుంది.. బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. తెలుసుకోవాలని సెర్చింగ్లు మొద‌లైపోయాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జైన‌బ్‌ తండ్రి జుల్ఫీ రావెడ్జి అని తెలుస్తుంది. ఆయన గ‌తంలో ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ముఖ్య సలహాదారుడుగా పనిచేశాడ‌ట‌. అంతేకాదు మిడిల్ ఈస్ట్ దేశాలకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా.. ఎన్నో సేవలను అందించాడట. ఇక అటు జగన్‌తో పాటు.. ఇటు నాగార్జున కుటుంబంతో వీరికి మొదటి నుంచే మంచి బాండింగ్ ఉందని సమాచారం. .