*యాదాద్రి భువనగిరి జిల్లా*
*నేడు భూదాన్ పోచంపల్లిలో పర్యటించనున్న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవవర్మ*
గవర్నర్ భూదాన్ పోచంపల్లి లో పర్యటిస్తున్న సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు చేనేత జౌళిశాఖ రాష్ట్ర అధికారులతో కలిసి స్థానిక టూరిజం పార్కుతో పాటు సమీపంలోని చేనేత కార్మికుల గృహాలను సందర్శించారు.
టూరిజం పార్కులో చేనేత వస్త్రాల తయారీ విధానాలను గవర్నర్ పరిశీలించనున్న నేపథ్యంలో పార్కులో తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
టూరిజం పార్కులోని కాన్ఫరెన్స్ హాల్లో చేనేత కార్మికులు, కళాకారులు, పద్మశ్రీ అవార్డు గ్రహీతల తో గవర్నర్ ముఖాముఖి నిర్వహించనున్నరు.
చేనేత బీమా, త్రిఫ్ట్ పథకం చెక్కు లను గవర్నర్ లబ్ధిదారులకు అందజేయనున్నరు.
గవర్నర్ చేనేత కార్మికుల గృహాలను సైతం సందర్శించి మగ్గాలను ప్రత్యక్షంగా పరిశీలించి
వారి జీవన స్థితిగతులను అడిగి తెలుసుకోనున్నారు.
నేడు ఉదయం 10.45 గంటలకు గవర్నర్ జిష్ణుదేవవర్మ పోచంపల్లికి చేరుకుంటారు. 11.15 వరకు చేనేత గృహాల సందర్శన, 11.15 నుంచి 11.30 గంటలకు టూరిజం పార్కును సందర్శించి పార్కులో చేనేత వస్త్ర తయారీ ప్రక్రియను పరిశీలిస్తారు. 11.30 నుంచి మధ్యాహ్నం 12గం టలకు చేనేత కార్మికులతో ముఖాముఖి సమావేశం నిర్వహిస్తారు.మధ్యాహ్నం 12.15 వరకు చేనేత కార్మికు లకు బీమా, త్రిఫ్ట్ ఫండ్ చెక్కుల పంపిణీ చేస్తారు. అనంతరం 12.15 గంటల తర్వాత గవర్నర్ తిరిగి
రాజ్భవన్ కు వెళ్ళనున్నరు.