🥀పంచాంగం🥀
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 12 – 06 – 2025,
వారం … బృహస్పతివాసరే ( గురువారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
గ్రీష్మ ఋతువు,
జ్యేష్ఠ మాసం,
బహుళ పక్షం,
తిథి : *పాడ్యమి* మ1.32 వరకు,
నక్షత్రం : *మూల* రా9.32 వరకు,
యోగం : *శుభం* మ2.12 వరకు,
కరణం : *కౌలువ* మ1.32 వరకు,
తదుపరి *తైతుల* రా1.54 వరకు,
వర్జ్యం : *ఉ.శే.వ.6.07 వరకు,*
మరల *రా7.50 – 9.32,*
దుర్ముహూర్తము : *ఉ9.48 – 10.40,*
మరల *మ3.01 – 3.53,*
అమృతకాలం : *మ2.40 – 4.23,*
రాహుకాలం : *మ1.30 – 3.00,*
యమగండం : *ఉ6.00 – 7.30,*
సూర్యరాశి : వృషభం,
చంద్రరాశి : ధనుస్సు,
సూర్యోదయం : 5.28,
సూర్యాస్తమయం: 6.30,
*_నేటి మాట_*
*ప్రార్థన*
సృష్టి క్రమము, అనేక శాఖలతో కూడి యున్నది.
ప్రతీ శాఖకు అధిపతులు, వారికి తగిన పరివారము కలదు.
ఈ కోర్కెలు నెరవేర్చుట దేవుని నియమమా?
దేవునికి సర్వ స్వతంత్ర మున్నను, కొన్నిటికి తాను కూడా బధ్ధుడే.
మనప్రార్ధనలు ఏ శాఖకు చెంది యుండునో ఆశాఖకే నియమితము.
వర్షమునకు వరుణుడు ప్రభువు, అది ఆయన శాఖ.
అటులనే సూర్యుడు ఆరోగ్య మునకు అధిపతి.
గణపతి విఘ్న, అవిఘ్నములకు శాఖాధికారి, సస్య ములకు భూదేవి,
పంట, ఓషధులకు ( వనమూలికలు) చంద్రుడు అధిపతి.
మన ఇంద్రియాలకు కూడా వీరే అధిపతులు.
అయితే దేవుడొక్కడే కదా! ఆయనను ప్రార్ధించుచుంటిమికదా, మన కోరికలు ఎందుకు తీరవు? అని అనుకొనుట పొరబాటు.
నీ ప్రార్థన ఏ శాఖాధికారి కో, ఆయనకే అడ్రెస్చేయవలసి యుండును, కర్మ కాండ మానవులకు చాల ముఖ్యమైనది.
మన సంకల్పములు కూడా పవిత్రమై, అతని కరుణా కటాక్షము లను ఆకర్షించుకొను శక్తి కలిగి యుండవలెను.
భగవంతునకు చేరు కర్మలు మూడు!!…
నిష్కామ కర్మ,
నిస్వార్థ ప్రేమ,
నిర్మల హృదయము.
కనుక భక్తులు చేయు ప్రార్థన లో ఇవి కలిగి యుండవలెను, లేనిచో భగవంతునికి సరాసరి చేరవు, అవి అన్నీ వృధానే.
*_🥀శుభమస్తు 🥀_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏