ఏపీలో రైతులకు గుడ్ న్యూస్.. 80% రాయితీతో డ్రోన్లు..!

*ఏపీలో రైతులకు గుడ్ న్యూస్.. 80% రాయితీతో డ్రోన్లు*

అమరావతి :

కేంద్రం ప్రవేశపెట్టిన నమో డ్రోన్ దీదీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అమలు చేస్తోంది. 80% రాయితీతో మహిళా రైతులకు డ్రోన్లు అందిస్తోంది. లబ్ధిదారులను ఎంపిక చేసి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డ్రోన్ వినియోగంపై శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటివరకు 875యూనిట్లు మంజూరు చేశారు. యూనిట్ ధర రూ.10 లక్షలు కాగా రూ.8లక్షలు ప్రభుత్వమే భరిస్తోంది. డ్రోన్ల ద్వారా ఎరువులు, పురుగు మందుల పిచికారీ సులభమవుతోంది.