శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద..
మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ ప్రాజెక్టుల్లోకి వరద పోటెత్తుతోంది. పైనుంచి వస్తున్న వరద నీటితో జూరాల డ్యామ్ ఇప్పటికే నిండుకుండలా మారింది. ఈ సీజన్ లో రెండోసారి అధికారులు డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుకుంటోంది. శ్రీశైలం డ్యామ్ నెమ్మదిగా నిండుకుంటోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి 60,587 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోందని అధికారులు చెప్పారు..
జూరాల డ్యాం నిండిపోవడంతో అధికారులు గేట్లు ఎత్తారు. దీంతో వరద నేరుగా శ్రీశైలం జలాశయానికి చేరుతుంది. కాగా ప్రస్తుతం జూరాల నుంచి శ్రీశైలానికి 60,587 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. ఔట్ ఫ్లో నిల్గా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 854.20 అడుగులకు చేరింది. నిల్వ సామర్థ్యం ప్రస్తుతం 89.7132 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుతుత్పత్తిని అధికారులు నిలిపేశారు.