టీమిండియా- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు మూడో రోజు ఆటకు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో నిర్ణీత సమయం కంటే కాస్త ముందుగానే అంపైర్లు ఆటను నిలిపివేశారు…ఆదివారం నాటి మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి భారత్ 23.5 ఓవర్లు ఆడి రెండు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. అంతకు ముందు ఇంగ్లండ్ 465 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్ కంటే 96 పరుగుల ఆధిక్యంలో ఉంది.
కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా శుక్రవారం మొదటి టెస్టు ఆరంభమైన విషయం తెలిసిందే. లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. గిల్ సేన తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులకు ఆలౌట్ అయింది.
భారత తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుబ్మన్ గిల్ (147)లతో పాటు.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (134) సెంచరీతో చెలరేగాడు. మిగతా వారిలో ఓపెనర్ కేఎల్ రాహుల్ (42) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ నాలుగేసి వికెట్లు కూల్చగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ ఒక్కో వికెట్ తీశారు.
ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ టీమిండియాకు దీటుగా బదులిచ్చింది. ఓపెనర్ బెన్ డకెట్ (62) అర్ధ శతకంతో రాణించగా.. ఓలీ పోప్ (106) శతక్కొట్టాడు. మరోవైపు.. హ్యారీ బ్రూక్ 99 పరుగులతో రాణించాడు. మిగతా వాళ్లలో జేమీ స్మిత్ 40, క్రిస్ వోక్స్ 38 పరుగులతో ఆకట్టుకున్నారు. ఫలితంగా ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్లో 465 పరుగులు చేసింది.
భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సరికి మొత్తంగా 96 పరుగుల లీడ్లో ఉంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) ఈసారి నిరాశపరచగా.. వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 30 పరుగులు చేశాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ 47, కెప్టెన్ గిల్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు..
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 465 పరుగులకి ఆలౌట్ అయ్యింది. బెన్ డకెట్ 62, ఓల్లీ పోప్ 106, జో రూట్ 28, హ్యారీ బ్రూక్ 99, బెన్ స్టోక్స్ 20, జెమీ స్మిత్ 40, క్రిస్ వోక్స్ 38, బ్రేడన్ కర్స్ 22, జోష్ టంగ్ 11 పరుగులు చేశారు. భారత బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రాకి 5 వికెట్లు దక్కగా ప్రసిద్ధ్ కృష్ణ 3, మహ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీశారు..
భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులకి ఆలౌట్ అయ్యింది. యశస్వి జైస్వాల్ 101, శుబ్మన్ గిల్ 147, రిషబ్ పంత్ 134, కెఎల్ రాహుల్ 42, రవీంద్ర జడేజా 11 పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ సింగిల్ డిజిట్ స్కోరు కూడా దాటలేకపోయారు. మరోవైపు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 9 మంది బ్యాటర్లు డబుల్ డిజిట్ స్కోరు చేయడం విశేషం…
ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో అదరగొట్టినా… మిగిలిన వాళ్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో… ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు భారీ స్కోరుకు అతి చేరువగా వచ్చింది. బ్రూక్ బాదుడుకు లోయర్ ఆర్డర్ సహకారం తోడవడంతో కేవలం 6 పరుగుల వెనుకబడిన ఇంగ్లండ్ పోటీలోకి రాగా… రెండో ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ రాణించడంతో టీమిండియా మెరుగైన స్థితిలో నిలిచింది. ప్రస్తుతానికి ఇరు జట్లు సమంగానే ఉన్నా… నాలుగో రోజు భారత బ్యాటర్లు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారన్నది కీలకంగా మారింది. సొంతగడ్డపై దంచికొట్టే అలవాటు ఉన్న ఇంగ్లండ్ ముందు ఎంత లక్ష్యం నిర్దేశించినా సురక్షితం కాదనే విశ్లేషణల మధ్య… టీమిండియా సోమవారం పూర్తిగా బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది!.