మాగంటి గోపీనాథ్కి పూజలు చేసి ఖతం చేసినట్లు నిన్ను కూడా ఖతం చేస్తాను..
ఆగని సంధ్య శ్రీధర్ రావు ఆగడాలు..
బ్లాక్ మ్యాజిక్ చేపించి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ని ఖతం చేసినట్లు నిన్ను కూడా ఖతం చేపిస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడుతున్న సంధ్య శ్రీధర్ రావు..
కిడ్నీలు ఫెయిల్ అయి చనిపోతావు.. నువ్వు ఎంత నీ బ్రతుకు ఎంత నీ పెళ్ళాం వారం రోజులు ముండ మోస్తుంది అంటూ బెదిరింపులు..
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ జూన్ 8న కన్నుమూసిన సంగతి తెలిసిందే. జూన్ 5న ఆయనకు గుండెపోటు రావడంతో హైదరాబాద్లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చేర్చారు. మూడు రోజుల పాటు చికిత్స పొందుతూ జూన్ 8న ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన మూత్రపిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. అయితే ఆయన మృతి విషయంపై తాజాగా ఓ సంచనల విషయం వెలుగులోకి వచ్చింది. క్షుద్రపూజల కారణంగానే అతడు చనిపోయినట్లు ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…హైదరాబాద్ నగరానికి చెందిన ఓ ప్రముఖ కన్వెన్షన్ నిర్వహకుడు ఓ వ్యక్తిని బెదిరిస్తూ.. మాగంటి గోపినాథ్ తాను చేసిన పూజల కారణంగానే చనిపోయినట్లు వెల్లడించాడు. తనతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవని పూజ స్టార్ట్ చేస్తే శవాలు లేవాల్సిందేనంటూ ఓ బీఆర్ఎస్ నేతకు ధమ్కీ ఇచ్చిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే.. నగరానికే చెందిన ఓ బీఆర్ఎస్ నేతకు కన్వెన్షన్ నిర్వహకుడు కాల్ చేశాడు. తన దారికి అడ్డొస్తున్నావని.. నీ ప్రాణానికే ప్రమాదమంటూ డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు…