కోదాడ సమీపంలో రోడ్డు ప్రమాదంలో ఎస్సై, కానిస్టేబుల్ మృతి..!

_• సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ఎస్సై, కానిస్టేబుల్ మృతి చెందారు. సూర్యాపేట జిల్లా, కోదాడ మండలం, దుర్గపురం సమీపంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తుండగా దుర్గపురం సమీపంలో లారీని కారు వెనకనుండి ఢీ కొట్టడంతో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లా రావులపాలెంలో విధులు నిర్వహిస్తున్న ఎస్సై అశోక్ తో పాటు కానిస్టేబుల్ స్వామి అక్కడికక్కడే మృతి చెందారు.మరో ఇద్దరు వ్యక్తులు పరిస్థితి విషమంగా ఉండటంతో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మృతులు ఇద్దరు పోలీసు డిపార్ట్మెంట్ చెందిన వారు కావడంతో హైదరాబాద్లో ఏదైనా కేస్ నిమిత్తం వెళ్తున్నారా లేక మరేదైనా కారణం వుండొచ్చా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు._