పాకిస్తాన్ను ఏకిపారేసిన రాజ్నాథ్ సింగ్..చైనా సైలెంట్‌!..

పహల్గాం ఉగ్రదాడిని అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తూ వస్తున్న భారత్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

చైనాలోని క్వింగ్ డావోలో షాంఘై సహకార సంస్థ సదస్సు జరుగుతోంది. ఇందులో సభ్య దేశాలైన భారత్, రష్యా,పాకిస్తాన్, ఇరాన్, కిర్గిస్దాన్, కజకిస్తాన్, తజకిస్తాన్, బెలారస్, ఉజ్బెజిస్తాన్ పాల్గొంటున్నాయి. ఈ సదస్సులో ప్రవేశపెట్టిన తీర్మానంలో పహల్గాం ఉగ్రదాడిని ప్రస్తావించలేదు. అదే సమయంలో పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ లో జరుగుతున్న దాడుల్ని మాత్రం ప్రస్తావించారు. ఈ పత్రంపై సభ్య దేశాలన్నీ సంతకం చేసాయి. కానీ భారత్ మాత్రం నిరాకరించింది..

భారత్ లోని కశ్మీర్లో 26 మంది ప్రాణాలు తీసేందుకు కారణమైన పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ఈ పత్రంలో ఎలాంటి ప్రస్తావన చేయకపోవడంతో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దీనిపై సంతకం చేసేందుకు నిరాకరించారు. తద్వారా ఈ దాడికి అండగా ఉన్న పాకిస్తాన్ తో పాటు దాని మిత్రదేశాలు చైనా, రష్యా, ఇతర దేశాలకూ షాక్ ఇచ్చినట్లయింది. పహల్గాం దాడి విషయంలో ఇప్పటికే అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో పర్యటించిన అఖిలపక్ష బృందాలు పాకిస్తాన్ వైఖరిని ఎండగట్టాయి..ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. సామూహిక భద్రత కోసం ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ఎస్సీవో సభ్యులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ ప్రాంతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లు శాంతి, భద్రత, విశ్వాస లేమే అన్నారు. ఈ సమస్యలకు మూలకారణం ఉగ్రవాదీకరణ అన్నారు. ఉగ్రవాద గ్రూపుల చేతుల్లో సామూహిక విధ్వంసక ఆయుధాల విస్తరణతో ఇతరులు సహజీవనం చేయలేరన్నారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి నిర్ణయాత్మక చర్యలు కావాలన్నారు.

ఉగ్రవాదాన్ని నడిపించే, పెంచే, తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే వారు దాని పరిణామాలను భరించడం అత్యవసరమని తేల్చేశారు. అలాగే పహల్గామ్ ఉగ్రవాద దాడిని ప్రస్తావిస్తూ… ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమను తాము రక్షించుకోవడానికి, ముందస్తుగా, తదుపరి దాడులను నిరోధించడానికి భారత్ తన హక్కును వాడుకుందన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి సమయంలో బాధితులను మతపరమైన గుర్తింపు అడిగి మరీ కాల్చి చంపారని గుర్తుచేశారు…

చైనా సైలెంట్…
చైనాలోని షాంఘైలో సహకార రక్షణ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ ‘కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయి, దాన్ని ఒక సాధనంగా వాడుతున్నాయి, తమ సొంత ప్రయోజనాల కోసం ఉగ్రవాదానికి సహాయం చేస్తున్న దేశాలు అందుకు తగ్గ ఫలితాన్ని చూస్తాయని’ పరోక్షంగా పాక్ దేశానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు ‘ ఈ దేశాలు ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్నాయని, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నాయని’ అని అన్నారు. శాంతి, ఉగ్రవాదం ఎప్పటికీ కలిసేదే లేదని తేల్చి చెప్పారు..భారత్ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ గురించి కూడా వివరించారు. ‘సీమాంతర ఉగ్రవాదాన్ని నిరోధించడానికే భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టింది. మా దేశంపై ఉగ్రదాడులు జరిగిన కారణంగా.. ఆపరేషన్‌ చేపట్టాం. ఆపరేషన్‌ సిందూర్‌ భారత్‌ హక్కు. ఉగ్రవాదుల విషయంలో మేము సహనంతో ఉండే అవకాశమే లేదు. ఉగ్రవాద కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడానికి వెనుకాడబోం. మన యువతలో రాడికలైజేషన్ వ్యాప్తిని నిరోధించడానికి కూడా మనం సరైన చర్యలు తీసుకోవాలి’ అని వ్యాఖ్యలు చేశారు….ఎస్‌ఈవో రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి రాజ్‌నాథ్‌ సింగ్ చైనా వెళ్లారు. 2020లో గల్వాన్ లోయ వివాదం తర్వాత నరేంద్ర మోదీ మంత్రివర్గంలోని సీనియర్ మంత్రి చేసిన మొదటిసారిగా చైనా పర్యటనకు వెళ్లారు. ఈ సమావేశంలో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందని రాజ్‌నాథ్‌ చెప్పుకొచ్చారు. ఇక, గురువారం సమావేశం ప్రారంభమయ్యే ముందు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్, పాకిస్తాన్, ఇరాన్, కజకిస్తాన్, రష్యా, తజికిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్ వంటి సభ్య దేశాల రక్షణ మంత్రులు గ్రూప్ ఫోటో కోసం సమావేశమయ్యారు..