మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ నాయకుల దాడి…

కాంగ్రెస్ కనువిప్పు కార్యక్రమం లో భాగంగా గల్ఫ్ సంక్షేమ సంఘం నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు నంగి దేవేందర్ రెడ్డి మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇంట్లో చొరబడి కార్యకర్తల చేతులో తన్నులు తిన్నాడు. వేల్పూర్ పట్టణ కేంద్రంలో 163 బీ ఎన్ యస్ యస్ అమలులో ఉండగా, ఎమ్మెల్యే ఇంటి చుట్టూ పోలీసుల పహార ఉండగా అందరి కన్నులు కప్పి ఎమ్మెల్యే ఇంట్లో తన అనుచరుడితో కలిసి చొరబడ్డారు. వారిద్దరు బీఆర్ఎస్ శ్రేణుల్లో కలిసిపోయి వారికి తెలియకుండా అక్కడ జరుగుతున్న విషయాలను కాంగ్రెస్ నాయకులకు లైవ్ పెట్టి వీడియో చూపించే ప్రయత్నం చేస్తుండగా బీఆర్ఎస్ నాయకులు పట్టుకొని చితికబాదారు.అంతలోనే అల్లరి శబ్దం విన్న ఎమ్మెల్యే పై అంతస్తూ నుండి చూసి ఆయన్ని ఏమనకండి వదిలేయండి అని శ్రేణులకు సూచించారు. దాంతో నాయకులు వదిలేశారు.

అంతట్లో పోలీసులు వచ్చి జోక్యం చేసుకొని నంగి దేవేందర్ రెడ్డిని బీ ఆర్ యస్ కార్యకర్తల నుంచి ప్రొటెక్ట్ చేసి తీసుకెళ్లారు. నిషిద్ద సెక్షన్ అమలులో ఉండగా, పోలీసులు కాపాల ఉండగా ఎమ్మెల్యే ఇంట్లో చొరబడి వీడియో తీస్తూ లైవ్ పెట్టె ప్రయత్నం చేయడం అంటే పోలీసులు అధికార పార్టీ వారికి కొమ్ము కాస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఎమ్మెల్యే ఇంట్లో చొరబడ్డ వ్యక్తిపై కేసు నమోదు చెయ్యాలని, సెక్షన్ అమలులో ఉండగా పోలీసుల ఆదేశాలను బేఖతార్ చేసిన ఆయన్ని కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ నాయకులు పోలీసులను డిమాండ్ చేశారు…

దాడిని ఖండించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ నాయకుల దాడి…

రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం..

ప్రతిపక్షాలు అధికార పార్టీ వైఫల్యాలపైన ప్రశ్నిస్తూనే ఉంటుంది..

గల్ఫ్ కార్మికుల విషయంలో మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గల్ఫ్ సంక్షేమ బోర్డ్ ఏర్పాటు, NRI సంక్షేమ బోర్డ్ ఏర్పాటు, గల్ఫ్ కార్మికుల టోల్ ఫ్రీ నెంబర్ లాంటి హామీలు ఇచ్చి ఇప్పటి వరకు అమలు చేయలేదు అని ప్రభుత్వాన్ని అడిగాను..

గల్ఫ్ లో చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామని చెప్పి కొందరికి ఇచ్చారు ఇంకా నియోజకవర్గంలో రానివారు ఉన్నారు వారికి ఇవ్వాలని ప్రభుత్వంను అడగటం జరిగింది..

ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన అడగటం నా బాధ్యత.. ఇందులో తప్పేముంది..

దీనికి బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మానాల మొహన్ రెడ్డి మా ఇంటి మీదికి వస్తా అని సవాల్ విసిరాడు..

ఇవాళ మా ఇంటి మీదకి కొందరు కాంగ్రెస్ నాయకులు వచ్చి దాడి చేశారు…

మానాల మొహన్ రెడ్డి కడుపు సల్లబడిందా..

మానాల మోహన్ రెడ్డి మీ ఐడేంటిటి కోసం నా ఇంటి మీదికి దాడికి వస్తే ప్రజలకి జరిగే లాభం ఏంటి.. ఒరిగింది ఏంటి..గత 10 ఏండ్లలో మా కేసీఆర్ గారిని మమ్మల్ని ఇదే మానాల మొహన్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు అనరాని మాటలు అన్నారు..బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నాపై వ్యక్తిగతంగా అనేక మాటలు మాట్లాడినాడు..మేము మీరు చేసినట్టు ఇంటి మీదకి పోయినామా ?.. ఇది సభ్యత నా ? రాజకీయాల్లో ఇది మంచిదా ? బాల్కొండ ప్రజలు ఆలోచించండి

మానాల మోహన్ రెడ్డి మీకు ఒక సూచన చేస్తున్న.. మీరు మా ఇంటిపై దాడికి రావడమో లేదా మా వాళ్ళు మీ ఇంటికి రావడమో, రాజకీయ సన్యాసము తీసుకోవడమో లాంటివి టైం పాస్ డ్రామా కార్యక్రమాలు తప్ప దీనివల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు..అధికార పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడం ప్రజలకు కావాలి.. ఒకవేళ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చపోతే ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన నిలదీసే హక్కు ప్రతిపక్ష ఎమ్మెల్యే గా నా బాధ్యత..ఇది నాకు ప్రజలు ఇచ్చిన హక్కు…ఎవరో కాంగ్రెస్ NRI ఫోరమ్ సంబందించిన వ్యక్తి దేవేందర్ రెడ్డి నా ఇంట్లోకి చొరబడి మా కుటింబ సభ్యులపై దాడికి వచ్చాడు

నేను గల్ఫ్ కార్మికుల పక్షాన వారి హామీలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే అభినందించాల్సింది పోయి దేవేందర్ రెడ్డి వారి అనుచరులతో అక్రమంగా మా ఇంట్లో చొరబడి దాడి చేయడం న్యాయమా ? అని ప్రశ్నించారు…