కాలీఫ్లవర్ ఉపయోగాలు

ఆయుర్వేద వైద్య షేక్ బహార్ అలీ వారి మాటల్లో కాలిఫ్లవర్ గురించి..

కాలీఫ్లవర్
తెలుగులో :పూగోబి, కాలీఫ్లవర్.
హిందీలో : గోబీ
అని పిలుస్తారు. కాలీఫ్లవర్ ను భారతదేశం అంతట సాగు చేస్తారు. మనకు ఆహారంగా మరి ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది. అయితే ఈ రోజు మనం కాలీఫ్లవర్ గురించి కొద్దిగా తెలుసుకుందాం. దీనిని ఆహార రూపంలో తీసుకుంటే కలిగే ప్రయోజనాల గురించి చక్కగా తెలుసుకుందాం..

కాలీఫ్లవర్‌లో అనేక పోషకాలు మరియు మొక్కల సమ్మేళనాలు ఉన్నాయి, ఇవి గుండె జబ్బులు మరియు క్యాన్సర్‌తో సహా అనేక వ్యాధులను తగ్గిస్తాయి.

కాలీఫ్లవర్ చాలా ఆరోగ్యకరమైన కూరగాయ, ఇది పోషకాలకు ముఖ్యమైన మూలం.

అదనంగా, ఇది బరువు తగ్గడానికి అనుకూలమైనది మరియు మీ ఆహారంలో చేర్చుకోవడం చాలా సులభం..

పోషకాల నిలయం ; కాలీఫ్లవర్ ను పోషకాహార నిలయంగా చెప్పవచ్చు. కాలీఫ్లవర్‌లో క్యాలరీలు చాలా తక్కువ, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. నిజానికి, కాలీఫ్లవర్‌లో శరీరానికి కావాల్సిన విటమిన్ మరియు మినరల్‌లు ఉన్నాయి. కేలరీలు,ఫైబర్, విటమిన్ సి,కె, బి6, ఫోలేట్,పాంతోతేనిక్ యాసిడ్, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, భాస్వరం వంటివి ఉన్నాయి..

కాలీఫ్లవర్ లో కాలరీలు, ప్రోటీన్లు,కొవ్వు, ఖనిజలవణాలు,
ఫైబర్
విటమిన్ ఏ
కాల్షియం
మెగ్నీషియం
ఐరన్
కాపర్
సోడియం
పొటాషియం
రైబోఫ్లోవిన్,
విటమిన్ సి
నికోటినిక్ యాసిడ్
ఆగ్జాలిక్ యాసిడ్లు కలవు.
దీనిని ఆహారం రూపంలో తీసుకోవడంలో గుండె జబ్బులు, కీళ్లవాతం, చర్మం ముడతలు పడకుండా ఉండటము, గర్భిణీ స్త్రీలకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది.
1. చర్మం ముడతలు పడకుండా ఉండాలంటే కాలీఫ్లవర్ సేవించడం వలన తొందరగా ముసలితనం రాదు మరియు చర్మం ముడతలు పడటం నివారించబడుతుంది ఎందుకంటే ఇందులో గ్లూటాథియేన్ అనే రసాయన పదార్థం ఉంది.
2. గర్భిణీ స్త్రీలు దీన్ని తీసుకోవడం వలన ఇందులో పోలిక్ యాసిడ్ ఉండటం వలన వీరికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
3. కాలీఫ్లవర్ తినటం వలన కీళ్ల జబ్బులు మరియు గుండె జబ్బులు రాకుండా నిరోధిస్తుంది.
4.. peace yoga academy.

ఖానాపురం హవెలి. ఖమ్మం. ఆరోగ్య సలహాల కోసం యోగా శిక్షణ తరగతుల కోసం ఈ క్రింది నెంబర్ కి ఫోన్ చేయగలరు. 7396126557. శ్రద్ధ శ్రీ యోగాచార్యులు ఆయుర్వేద వైద్య నిపుణులు షేక్ బాహర్ అలీ ఖమ్మం.

గమనిక..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో మాకు పంపించండి.. మేము మీ పేరుతో వార్తను ప్రచురిస్తాం…
Watsapp no..9133057959.