కన్నీళ్లు పెట్టుకున్న రోజా
ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన డిబేట్ లో ఆమె మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. పెయిడ్ అర్టిస్ట్ లను పెట్టుకుని తనను అవమానిస్తున్నారని.. దిగజారి మరి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లు వెనుకుండి ఇదంతా జరిపిస్తున్నారని రోజా ఆరోపించారు. తనకు జోలికి వచ్చిన వారు ఎవరు కూడా బాగుపడలేదన్నారు రోజా. తన పిల్లల్ని కూడా వదల్లేదన్నారు. తన పిల్లలకు కూడా న్యూడ్ ఫోటోలు పంపుతున్నారని రోజా వాపోయారు. ఇక్కడ టార్చర్ భరించలేక తన కూతురు ఫారిన్ వెళ్లిపోయిందన్నారు రోజా. పిల్లల బర్త్ డే పుట్టిన రోజు వేడుకలు చేస్తే కూడా సోషల్ మీడియాలో కూడా కింద కామెంట్స్ చూస్తే అన్ని బూతులేనన్నారు. తాను పట్టుదల గల మనిషినే కాబట్టే రాజకీయాల్లో ఉన్నానని తెలిపారు…
ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో రోజా ఎమోషనల్ అయ్యారు.. కన్నీళ్లు పెట్టుకున్నారు. టీడీపీ పెయిడ్ ఆర్టిస్టుల్ని పెట్టి తనను తిట్టుస్తున్నారని.. జబర్దస్త్ నుంచి ఒకడ్ని తీసుకొచ్చి మాట్లాడించారు.. ఎమ్మెల్యేలతో మాట్లాడించారన్నారు. నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్‌కు ఇలా మాట్లాడేందుకు ఎక్కడ నుంచి ఈ ధైర్యం వచ్చిందని.. లోకేష్ ఫోన్ చేసి చెప్పకపోతే ఈ ధైర్యం ఉంటుందా అని ప్రశ్నించారు ఆర్కే రోజా.
ఎన్ని రోజులు వీళ్లను లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబులు కాపాడతారో చూస్తానన్నారు మాజీ మంత్రి రోజా. తనకు ఒక టైమ్ వస్తుందని.. భగవంతుడు తనను సపోర్ట్ చేస్తాడన్నారు. తనను బాధపెట్టిన ప్రతి ఒక్కరూ జీవితంలో చావదెబ్బ తిన్నారని.. చంద్రబాబుతో సహా చరిత్రను చూసుకోవాలన్నారు. మళ్లీ తన జోలికి వస్తున్నారని.. కచ్చితంగా ఈసారి వారు జీరో అయిపోతారన్నారు. వాళ్ల భార్యలు, కూతుళ్లు, కోడళ్లను ఏమైనా అంటే ఊరుకుంటారా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు చాలా పట్టుదల ఎక్కువని.. తనను దొంగదెబ్బ తీయాలని చంద్రబాబు, లోకేష్ ఎన్నోసార్లు చాలా ప్రయత్నాలు చేశారని.. అయినా తాను తట్టుకుని నిలబడ్డానని.. ఈరోజు అదే చేస్తానన్నారు.
‘దేవుడనేవాడు ఉన్నాడు.. అనవసరంగా ఒక మహిళను కళ్ల నీళ్లు తెప్పించి.. ఆమె జీవితం నాశనం చేయాలనుకుంటే భగవంతుడు ఊరికే వదలడు.. బయటకు రాలేకుండా లోపల పెడతారని తెలుసుకోండి. ఎన్నో కష్ట సమయాల్లో వైఎస్ జగన్ సొంత చెల్లెల్లా నన్ను చూసుకున్నారు. చిన్న సమస్య వచ్చినా, నాకు ఏ ఇబ్బంది జరిగినా అండగా నిలిచారు. జగన్ ఓ వైపు.. మరోవైపు నా భర్త, మా అన్నలు నా వెనుక నిలబడ్డారు. కాబట్టే నేను రాజకీయాల్లో బలంగా ముందుకు సాగుతున్నాను.. బలంగా ప్రజల సమస్యలపై పోరాటం
చేయగలుగుతున్నాను. నా పిల్లల ఫోటోలను కూడా దారుణంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతూ మా అమ్మాయి, అబ్బాయిల్ని మానసికంగా క్షోభ పెడుతున్నారు. మా అబ్బాయి చాలా డిప్రెషన్లో ఉన్నాడు.. వాడికి మార్ఫింగ్ ఫోటోలు పంపారు.. ఆ ఫోటోలు చూస్తే సూసైడ్ చేసుకోవాలనిపించింది’ అంటూ రోజా బోరున ఏడ్చేశారు..
నియోజకవర్గంలో మాజీ మంత్రి రోజా, నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మధ్య వార్ నడుస్తోంది. ఇసుక, బియ్యం స్మగ్లింగ్‌తో రోజాతో పాటు ఆమె సోదరులకు, భర్తకు సంబంధం లేదని కాణిపాకం గుడికి వచ్చి ప్రమాణం చేయాలని ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సవాల్ విసిరారు.రూ.12 వేల అద్దె ఇంటినుంచి ఇప్పుడు ఊరికో ఇంటిని నిర్మించుకునే స్థాయికి రోజా ఎదిగిందని ఆరోపించారు..అంతేకాకుండా నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, ఆయన సహచరులు సోషల్ మీడియాలో తన గురించి ”రూ.2,000 ఇస్తే ఏ పనైనా చేసేది. మార్కెట్లో ఆ మాట ఉంది. ఆమె నేడు రూ.రెండు వేల కోట్లు సంపాదించింది. ఆమె వ్యాంప్‌కు ఎక్కువ.. హీరోయిన్‌కు తక్కువ. ఈ పిచ్చి దాంతో వాళ్ల పార్టీ నేతకు పిచ్చెక్కిందా.. ఆయన పిచ్చి ఈమెకెక్కిందా తెలియడం లేదు” అని దుష్ప్రచారం చేస్తున్నారంటూ రోజా వాపోయింది…