కుంకీ ఏనుగులు ఎక్కడ? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ అంటూ గ్రామస్తుల నినాదాలు..

కుంకీ ఏనుగులు ఎక్కడ? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ అంటూ గ్రామస్తుల నినాదాలు

చిత్తూరు జిల్లా సోమల(మం)కొత్తూరులో ఏనుగుల గుంపు దాడిలో రైతు రామకృష్ణమరాజు మృతి

మృతదేహంతో రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు.. పవన్ సమాధానం చెప్పాలని ఆందోళన

సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొత్తూరు కు రావాలని గ్రామస్తులు డిమాండ్..

అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే రామకృష్ణమరాజు మృతి చెందాడని గ్రామస్తుల ఆగ్రహం…..

గతంలో పవన్..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. బెంగళూరుకు వెళ్లారు. ఏనుగుల సమస్యపై చర్చించేందుకు కర్ణాటక వెళ్లిన పవన్ కళ్యాణ్.. అక్కడి అటవీ శాఖ మంత్రితో భేటీ అయ్యారు. ఏపీలో కుంకీ ఏనుగుల కొరతను వారికి వివరించారు. సరిహద్దు ప్రాంతంలో ఏనుగుల సమస్యలను వారికి వివరించిన పవన్ కళ్యాణ్.. కుంకీ ఏనుగులను అందించాలని కోరారు. పవన్ విజ్ఞప్తి మేరకు 8 కుంకీ ఏనుగులను ఏపీకి పంపేందుకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది.