కాలువలు ఇలా – నీరు పారేదెలా…?

అన్నదాతలు సక్రమంగా తమ పొలాల్లో పంటలు పండించాలంటే వర్షాలు రావాలి, జలాశయాలు నిండాలి, ఆ నీరు కాలువల ద్వారా పొలాలకు చేరాలి. అయితే జలాశయాల్లో నీరున్నా అధికారులు పొలాలకు నీరు వదిలితే మాత్రం ఆ నీరు పొలాలకు చేరే అవకాశం కనిపించడంలేదు. దీనికి కారణం మేజర్లు, మైనర్లలో పిచ్చి కంప,, డంపింగ్ యార్డ్ లో మారి విపరీతంగా పెరిగి అడవులను తలపించడమే తోపాటు పాలకులు, అధికారుల నిలువెత్తు అలసత్వానికి నిదర్శనంగా కాలువలు మారాయి.. సరైన వర్షాలు లేకున్నా ఎగువన కురిసిన వర్షాలతో రైతన్నల కళ్ళల్లో ఆనందం కనబడుతున్న అధికారుల నిర్లక్ష్యంతో ఆ ఆనందం ఆవిరి అయ్యేటట్లే ఉంది.. కాలువల పరిస్థితి సరిగా లేకపోవడంతో నీరు అందుతుందా లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు.

కాలువలలో పిచ్చి కంపను తొలగించే నాధుడే కరువయ్యాడు. సిబ్బంది ఉన్నారా కాలువలపై విధుల్లో ఉపయోగిస్తున్నారా ..?.కంపను తొలగించే పరిస్థితి లేదు. దీంతో సాగర్‌ జలాలు పొలాలకు ఎంతవరకు వస్తాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడడంతో శ్రీశైలం జలాశయానికి భారీగా నీరు చేరుతోంది.. శ్రీశైలం గేట్లు ఎత్తడంతో దిగువకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.. దీంతో పంటలు వేసేందుకు రైతులు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కానీ సాగర్‌ జలాలు వచ్చేందుకు కాలువల్లో పిచ్చికంప విపరీతంగా పెరగడం, అవి తొలగించకపోవడం, పలు ప్రాంతాల్లో మేజర్లకు గండ్లుపడడంతో పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్‌ఎస్‌పీ అధికారులు మేజర్లు, మైనర్లపై దృష్టి సారించి మరమ్మతులు చేయించాలని, పిచ్చికంపను తొలగించాలని రైతులు కోరుతున్నారు…

అలసత్వంలో అధికారులు..

నీటి పారుదల అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఆఫీసుకే పరిమితం అవుతున్నారు తప్పా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో చూడడం లేదు. నీళ్లు ఇస్తే ఎలా పోతాయన్న ఆలోచన కూడా చేయడం లేదు. రైతులంతా పనుల్లో నిమగ్నమయ్యారు. హుజూర్ నగర్ లో డంపింగ్లను తలపిస్తున్న ఎన్ఎస్పి మేజర్ మైనర్ కాలువలు.. లైనింగ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయా.?. సాగునీరు వస్తుందా..? రాదా..? అన్న అనుమానంలో రైతులు ఉన్నారు. సాగునీటి విడుదల చేయాలని ఇప్పటికే గత కొన్ని రోజులుగా ఖమ్మానికి తరలించారు అనంతరం కొన్ని కాలువలకి నీటిని తరలిస్తున్నారు.. కానీ అవి చివరిదాకా చేరడం చాలా కష్టమని కాలువల పరిస్థితి చూస్తే అర్థమైంది…

ఎండాకాలం కాకుండా వర్షాకాలంలో పని మొదలు..

వర్షాకాలంలో అది కూడా కాలువ నీరు వదిలే సమయంలో లైనింగ్ పనులు మొదలుపెట్టడం చాలా విచిత్రంగా ఉంది.. అది కూడా వెనక నుండి లైనింగ్ పనులు వేసుకోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. ముందుగా వరద నీరు వచ్చేది ఎటువైపు నుంచి వస్తుంది ఆ నీరు ఎటువైపు మళ్ళించాలో అవగాహన లేకుండా వేస్తున్నట్లుగా ఆరోపణలు ఎదురవుతున్నాయి…. అక్కడక్కడ నాశరకం పనులతో మామ అనిపిస్తున్న కాంట్రాక్టర్లు.. తమకేం పట్టినట్టుగా వ్యవహరిస్తున్న అధికారులు… స్థానిక మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పనుల పర్యవేక్షణలో కొంత అలసత్వం వల్ల కూడా ఇలా జరుగుతుందని పలువురు ఆరోపణలు..
ఇప్పటికైనా స్థానిక మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పనులను పరిశీలించి వాటిపై నాణ్యత లోపం లేకుండా పనులను తొలిగతన పూర్తి చేయాలని రైతులు కోరుకుంటున్నారు..

సాగర్ గేట్లు ఎత్తితే పులిచింతలకి నీరు..

సాగర్ గేట్లు ఎత్తితే రైతులకు ఎటువంటి లాభం ఉండదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. మైనర్, మేజర్ కాలువల మరమ్మత్తులు సరిగా చేసి నీటిని వదిలితే అప్పుడు చివరి రైతుకి నీళ్ళు అందుతాయని రైతులు తెలుపుతున్నారు.. సాగర్ గేట్లు ఎత్తడం వల్ల తమకి ఎటువంటి లాభం లేదని అవి పులిచింతల ద్వారా మళ్లీ ఆంధ్రకే వెళ్లి అటు సముద్రంలో కలిసిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు….

పులిచింతలకు నీరు చేరి అక్కడ నుండి ఆంధ్రా నుండి సముద్రంలోకి తరలిపోవడం తప్ప తమకు ఎటువంటి లాభం లేదని అంటున్నారు రైతులు… అక్కడక్కడ కొంత మేర లిఫ్టు ఉన్నవరకు మాత్రమే ఆ నీరు ఉపయోగపడుతుందని ఆ తరువాత ఇంకెవరికి ఆ నీరు ఉపయోగకరంగా ఉండదని తెలిపారు…