ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో బాలిక అనుమానాస్పద మృతి…!

ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో బాలిక అనుమానాస్పద మృతి

పరీక్ష రాస్తూ ఫిట్స్ కారణంగా చనిపోయిందని చెప్తున్న సిబ్బంది.. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని ఆరోపిస్తున్న బాలిక కుటుంబ సభ్యులు

ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గొల్లగూడెం గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న కూసుమంచి మండలం బోడియతండాకు చెందిన భూక్య రమేష్, బూబమ్మ దంపతుల కూతురు ప్రతిమ(15)

సోమవారం మధ్యాహ్నం పరీక్ష రాస్తుండగా ఒక్కసారిగా ఫిట్స్ వచ్చి కిందపడిపోయిందని, వెంటనే ప్రాథమిక చికిత్స అందించామని తెలిపిన పాఠశాల సిబ్బంది

మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, అప్పటికే బాలిక చనిపోయిందని వైద్యులు తెలిపారని పేర్కొన్న సిబ్బంది

ఫిట్స్ వచ్చినప్పుడు తమకు సమాచారం ఇవ్వకుండా ఆసుపత్రికి ఎలా తీసుకెళ్లారని సిబ్బందిని నిలదీసిన బాలిక తల్లిదండ్రులు

తమ కూతురికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే తమ కూతురు చనిపోయిందని ఆసుపత్రి ముందు నిరసనకు దిగిన తల్లిదండ్రులు, బంధువులు

ఈ ఘటనపై దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన అధికారుల..